లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి

 

నాగాలాండ్ రాష్ట్రంలో ప్రయాణికులతో వున్న ఒక బస్సు లోయలో పడిపోవడంతో 13 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేకమంది పరిస్థితి విషమంగా వుంది. ఈ ప్రమాదం ఫేక్ జిల్లాలో మణిపూర్ సరిహద్దుల్లో జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు నాగాలాండ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందినది. ఈ ప్రమాదం సందర్భంగా 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu