యువతి సజీవ దహనం

 

ఖమ్మం జిల్లాలో ఒక యువతి సజీవ దహనమైపోయింది. చుట్టుపక్కల వున్నవాళ్ళకు ఏం జరిగిందో కూడా అర్థంకాని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. ఈ గ్రామంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగామంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపిస్తున్నాయని ఇంట్లో వున్న మాధవి అనే 19 సంవత్సరాల యువతి గ్రహించేలోపే ఆమెను మంటలు కాల్చేశాయి. ఈ ప్రమాదంలో యువతి మరణించడంతోపాటు ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లో గ్యాస్ లీక్ కావడం వల్లగానీ, ఇంట్లో పెట్రోల్ నిల్వలు వుండటం వల్లగానీ ఇలా మంటలు వ్యాపించి వుండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu