నన్ పై అత్యాచారం
posted on Mar 14, 2015 5:02PM

మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం రోజునే పంజాబ్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే మళ్లీ అలాంటి ఘటన జరగడం హృదయ విదారకం. అది కూడా ఒక 72 ఏళ్ల మహిళపైఅందులోనూ నన్ పై సామూహిక అత్యాచారం కలకలం సృష్టించింది. పశ్చిమబెంగాల్ నాడియా జిల్లాలోని గంగ్నపూర్లో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి సుమారు పన్నెండుమంది దొంగలు స్కూల్ లోకి చొరబడి లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లడంతో పాటు నన్ పై సామూహిక అత్యాచారం చేశారు. విషయం తెలుసుకొన్న స్కూలు సిబ్బంది ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. నన్ పై జరిగిన అత్యాచారానికి ఆగ్రహించిన విద్యార్ధులు ఆందోళనలు చేపట్టి రోడ్డు, రైలు మార్గాలను నిలిపేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిచారు. పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని తగినవిధంగా శిక్షిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఫిరాద్ హామీ ఇచ్చారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనగా ఆయన దీనినిఅభివర్ణించారు.