సోలార్ స్కామ్: ఒమెన్ చాందీ రాజీనామా!

 

Solar panel scam, House adjourns over solar scam issue

 

 

సోలార్ కుంభకోణం ఏకంగా కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఒమెన్ చాందీ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలియవచ్చింది. ఓ ప్రైవేట్‌ బోగస్‌ సోలార్‌ కంపెనీకి చెందిన వ్యక్తులతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహిత సంబంధాలు కలిగి వుంటూ నిబంధనలకు నీళ్ళొదిలి అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా ఆ కంపెనీకి పెద్దయెత్తున అనుచిత లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

 

సౌర పరికరాల కుంభకోణం కేరళలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కుంభకోణంపై మంగళవారం కేరళ అసెంబ్లీలో రగడ చెలరేగింది. ముఖ్యమంత్రి ఒమన్‌చాందీ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి.