అదుపుతప్పితే రాష్ట్రపతి పాలనే

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపధ్యంలో రాజకీయ అంశాపై సమ్మెచేసే హక్కు ఉద్యోగులకు లేదని లాయర్‌ రవికుమార్‌ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. సమైక్యాంద్ర కోరుతూ జరుగుతున్న ఆందోళనల వల్ల పరిస్థితులు చేయి దాటితే రాష్ట్ర్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తామంటూ కేంద్రం హైకోర్టుకు నివేదించింది.

రాష్ట్ర విభజనపై తాము ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ పొన్నం అశోక్‌ గౌడ్‌ పరిస్థితులు చేయి దాటే పరిస్థితి ఏర్పడితే మాత్రం తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందన్నారు.

అయితే ఉద్యోగుల సమ్మె వ్యవహారం రాష్ట్రనికి సంభందించినదన్న అశోక్‌ గౌడ్‌, శాంతి భద్రత సమస్య ఏర్పడితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఏపిఎన్జీవోల తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.