పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతా : రాజాసింగ్

 

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతాని రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరి వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందు ఉంచుతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, నోటీసులు కాదు.. కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

 అటు ఇటు కానివాళ్లతో కలిసి పార్టీని బలోపేతం చేయలేమని తెలిపారు. ధర్మా కార్యక్రమాలు చేపట్టాలేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరతారని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోందని, రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం ఈ మేరకు ఆదేశించినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu