చైనీయుడికి ఎన్నికల ఇక్కట్లు

 

 

 

ఎన్నికల కోడ్‌తో చైనా దేశస్తుడు జిచెంగ్ కర్నూలు జిల్లాలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో రూ.3.50 లక్షల నగదు లభించడంతో సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆయన వివరాలు చెప్పడంతో వదిలేశారు. చైనాకు చెందిన జిచెంగ్ 15రోజుల కిందట మనదేశం వచ్చారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన కర్నూలు వాసి జుల్ఫికర్ అలీ ఆహ్వానం మేరకు బుధవారం ఇన్నోవాలో స్నేహితులతో కలిసి వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శించేందుకు బయల్దేరారు. భానకచర్ల వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా రూ.3.50 లక్షల నగదు లభించింది.

 

ఎన్నికల నియమావళి ప్రకారం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆ నగదును సీజ్‌చేశారు. జిచెంగ్ పాస్‌పోర్టు, వీసా వివరాలను సీఐ రవిబాబు.. ఎస్పీ రఘురామిరెడ్డికి ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. పూర్తి వివరాలుండడంతో అతడిని వదిలేశారు. జిచెంగ్ ఢిల్లీలో మార్బుల్స్ వ్యాపారం చేస్తున్నారని, మే నెల వరకు మన దేశంలో ఉండేందుకు వీసా ఉందని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu