రోహిత్, రైనా దూకుడు, వన్డే సిరీస్ మనదే

Publish Date:Jan 24, 2013

 

 

India beat England by 5 wickets to clinch the 5 match ODI series, India beat England

 

 

ఎట్టకేలకు టీమిండియా విజయపధంలో దూసుకుపోతుంది. ఇటీవల సొంతగడ్డపై కూడా సిరీస్‌లు సమర్పించుకున్న భారత్ ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో హ్యాట్రిక్ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొహాలీ లో ఇంగ్లాండ్ పై ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది.

 

258 పరుగుల లక్ష్య౦తో బరిలోకి దిగిన ఇండియా రహానె స్థానంలో వచ్చిన రోహిత్ 83 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలపాడు. రైనా 79 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 89 నాటౌట్ గా నిలిచి లక్ష్యాన్ని పూర్తిచేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. కుక్ 76, కెవిన్‌పటర్సన్ 76పరుగులు చేసి అవుటయ్యారు. రూట్ 45 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. రవీంద్ర జడేజా (3/39) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇషాంత్ శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. ఓ దశలో కుక్‌సేనను 43 ఓవర్లలో 176/4తో కట్టడి చేసిన భారత బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు.