40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై

 

 

 mumbai wins ranji trophy, Mumbai clinch 40th Ranji Trophy title, Mumbai clinch 40th Ranji Trophy

 

 

రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఘనవిజయం సాధించింది. సౌరాష్ట్ర పై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో గెలిచి రికార్డ్ 40వ సారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్ని౦గ్స్ లో ధవళ్ కులకర్ణి, అజిత్ అగరార్కర్ దెబ్బకు సౌరాష్ట్ర 82కే ఆలౌటైంది. అజిత్ అగరార్కర్ 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, కులకర్ణి 32 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు.


మొదటి ఇన్ని౦గ్స్ లో  సౌరాష్ట్ర144 పరుగులు చేయగా, ముంబై 355 పరుగులు చేసింది. రెండో ఇన్ని౦గ్స్ లో కూడా సౌరాష్ట్ర బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఎస్‌హెచ్ కోటక్ (0), ఎస్‌డి జోగియానీ (0), ఆర్ఆర్ దావే (5), ఎవి వాసదేవ (0), జెఎన్ షా (6), ఎస్‌పి జాక్సన్ (9), కెఆర్ మక్వానా (7), ఎస్ సానాండ్యా (16) చెత్తగా అవుటయ్యారు. టీ విరామ సమయానికి సౌరాష్ట్ర 58 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయం తర్వాత ధర్మేంద్ర సిన్హ్ జడేజా (22), జైదేవ్ ఉనద్కత్ (9) త్వరగా అవుటయ్యారు. సౌరాష్ట్ర పై ముంబై 125పరుగులు ఇన్ని౦గ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. రంజీల్లో సెంచరీల రికార్డ్ బద్దలు కొట్టిన వసీం జాఫర్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.