ఉస్మానియాకు వైయస్‌ జగన్‌

Publish Date:Aug 29, 2013

Advertisement

 

సమన్యాయం చేయాలంటూ లేదంటే రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచాలంటూ జైలులోనే దీక్ష చేపట్టిన వైయస్‌ జగన్‌ దీక్షను గురువారం అర్ధరాత్రి పోలీసులు భగ్రం చేశారు. ఆగస్టు 24 నుంచి దీక్షకు దిగిన జగన్‌ను గురువారం రాత్రి 11.58 గంటలకు బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జగన్‌ తన దీక్షను ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తున్నారు.

జగన్‌ బిపితో పాటు షుగర్‌ లెవల్‌, పల్స్‌ రేట్‌ పడిపోయినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్థుతం జగన్‌ ను ఉస్మానియా ఓపి బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబర్‌ గదిలో ఉంచారు. అయితే జగన్‌ ఎటువంటి వైద్యాని సహకరించటం లేదని, పోలీసులు డాక్టర్‌లు ఎంత చెప్పిన వినటం లేదని ఉస్మానియా హాస్పిటల్‌ ఆర్‌ఎంఒ చెప్పారు.