కొత్త బాంబు పేల్చిన దిగ్విజయ్
posted on Jul 1, 2013 4:21PM

కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ రోజు హైదరాబాద్ కి వచ్చిన ఆయన కాంగ్రెస్ నేతలను షాక్ కి గురి చేశారు. పది రోజుల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని, అప్పుడు తీసుకొనే నిర్ణయానికి పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నాయకులు కట్టుబడి ఉండాలని అన్నారు.
రాజకీయాల్లో వున్నవారందరూ వ్యాపారాలు చేయకూడదని, ఒకవేళ వ్యాపారాలు ఉంటే మానుకోవాలని అన్నారు. వైఎస్ నాకు సన్నిహితుడు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. అయితే వైఎస్ కు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందని చెప్పారు.
త్వరలో కోర్ కమిటీ ముందుకు సీఎం, బొత్స, ఆజాద్ తో కలిసి తాను హాజరు అవుతానని, సభ్యులకు తమ అభిప్రాయాలు వివరిస్తామని తెలిపారు. మొత్తంగా చూస్తే దిగ్విజయ్ చెప్పిన మాటల్లో ఒక్కదాంట్లోను విషయం లేదని ఇట్టే అర్థమయిపోతుంది.