చిర౦జీవికి కాంగ్రెస్ షాక్
posted on Mar 11, 2013 10:25AM

ఎమ్మెల్సీ పదవుల పంపకంలో కేంద్ర మంత్రి చిరంజీవి వర్గానికి మరోసారి నిరాశే ఎదురైంది. సామాజిక న్యాయం పేరుతో సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు పేరును పక్కన పెట్టారు. ఈ విషయం తెలియగానే మంత్రి సి.రామచంద్రయ్య, చిరు వ్యక్తిగత కార్యదర్శి విక్రమ్ హుటాహుటిన వెళ్లి పీసీసీ చీఫ్ బొత్సను ఆయన నివాసంలో కలిశారు.
ఎస్సీ వర్గానికి చెందిన జంగా గౌతమ్ పేరును పరిశీలించాలని రామచంద్రయ్యతో చిరంజీవి కబురు పెట్టారు. స్వయంగా తాను కూడా బొత్సకు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో పీఆర్పీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన గౌతమ్.. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనూ అవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సాయంత్రం ప్రకటించిన జాబితాలో చిరంజీవి ప్రతిపాదించిన పేర్లు ఏవీ లేకపోవడం ఆయన వర్గాన్ని నిరాశకు గురి చేసింది.