జగన్ బెయిల్కు అనర్హుడు : సీబీఐ
posted on Nov 23, 2012 3:42PM
.jpeg)
అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ బెయిల్ ఇచ్చేందుకు వ్యతిరేకించింది. 90 రోజుల లోపు విచారణ పూర్తి చేయకుంటే నిందితులకు బెయిల్ ఇవ్వవచ్చన్న దానికి సీబీఐ తన వాదనలో సమాధానం ఇవ్వలేదని జగన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. పిఆర్సి 437, పిఆర్సి 167(2)కింద జగన్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే సీబీఐ సమాధానం ఇవ్వడం లేదని, సీబీఐ తన దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తుందో కూడా చెప్పడం లేదని జగన్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.
అయితే జగన్ కోర్టును తప్పుదారి పట్టించేందుకు బెయిల్ పిటీషన్ వేస్తున్నారని, ఆయన సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ వేసినప్పుడు 90 రోజుల గడువు పూర్తి కాలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో జగన్ కు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోర్టును కోరింది. జగన్ తరపున ప్రముఖ న్యాయవాది పద్మనాభ రెడ్డి వాదిస్తున్నారు. జగన్ కు బెయిల్ ఇప్పట్లో రాదని తెలుస్తోంది.