పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలు
posted on Nov 23, 2012 12:37PM
.jpg)
పుట్టపర్తి సత్యసాయి బాబా 87వ జన్మదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రిపుర గవర్నర్ డీవై పాటిల్ శుక్రవారం ఉదయం బాబా జయంతి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించిన అన్నిఏర్పాట్లు చేసింది. ప్రశాంతి నిలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సత్యసాయి మహా సమాధిని పుష్పాలలో అతి సుందరంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు ఇప్పటికే ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
కాగా సత్యసాయి 87వ జయంతి కానుకగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పూర్వపు సత్యసాయి తాలూకాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 118 గ్రామాలతో పాటు, బత్తలపల్లి మండలంలోని మరో 5 గ్రామాలకు రూ.80కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటిని అందించే పనులకు నేడు శంకుస్థాపన చేయనుంది.