LATEST NEWS
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో  జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు.  అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.  అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.  
కడప జిల్లా జమ్మలమడుగులో  బీజేపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి   సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు.  అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే..  జములమడుగులో  ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి  మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు.   పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు.   గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు,  రాజోలి జలాశయ నిర్మాణం,  ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు.   గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన..  ఈ సమస్యల పరిష్కారం కాకుంటే..  ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతోనే అమరావతి నిర్మాణ స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చబోతోందని ఆయన వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆయన అభినందించారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజధాని కోసం నిలబడిన ప్రతి పౌరుడి విజయం ఇది అని ఆయన కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇక నుంచి ఒకే చిరునామా ఉండబోతోందని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన కేంద్రం  ఏపి ప్రజల్లో, అమరావతి రైతుల్లో ఆనందం  బాలకృష్ణ స్పందన ఇదే  ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకి ,భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు. మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకి ప్రతీక. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన  సందర్భంగా  రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకి  పార్లమెంట్ సభ్యులందరికీ, మా వెన్నంటి నిలిచిన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ముఖ్యంగా అమరావతి(Amaravathi)రైతుల విజయం. వారి సహనం, త్యాగం, నిబద్ధతే ఈ చారిత్రాత్మక క్షణానికి పునాది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుంది. అమరావతి అజేయంగా, అజరామరంగా వెలుగొందుతుంది. మనందరం కలసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం. జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి మీ నందమూరి బాలకృష్ణ  అని తెలిపాడు.        
  ఎదురే లేదంటూ దూసుకుపోతున్న ధురంధర్ 2  ఇప్పటికే 1650 కోట్ల గ్రాస్ దాకా వసూలు మరి మోదీ ఏం అంటున్నారు  ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడు దేనోడు దానికే ఉంటాడనేది సామెతకి తగ్గట్టే ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)ని పొగిడే వాళ్ళు ఉంటే,  విమర్శించే వాళ్ళు ఉన్నారు. ప్రెజెంట్ పొగిడే వ్యకి మన దేశ ప్రధాన మంత్రి మోదీ(Modi) అయితే, ప్రెజెంట్ విమర్శించే వ్యక్తి  లెజండ్రీ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash Raj)ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకర్ని పొగడడానికి, మరొకర్ని విమర్శించడానికి మనం ఎవరం కాబట్టి  జరుగుతున్న విషయాల గురించి మాత్రమే చెప్పుకుందాం. రీసెంట్ గా ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతు నిజాలని అంగీకరించ లేకే కొంతమంది  'ధురంధర్ 2 పై ‘ప్రోపగాండా’విమర్శలు చేస్తున్నారు. గతంలో  ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ’ లపై కూడా ఇలాగే  తప్పుడు ప్రచారం చేసారని చెప్పిన మోదీ ధురంధర్ 2 లో 2016 లో తాను రద్దు చేసిన నోట్ల రద్దు అంశాన్ని ఉపయోగించడం, ఆ టైంలో నోట్ల రద్దు అనంతరం తదితర పరిణామాలకి సంబంధించి నిజమైన ఫుటేజ్ ఉపయోగించడాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.   Also read: Rajasekhar: రాజశేఖర్ దశ తిరగబోతుందా!  ఎక్స్ వేదికగా మోదీ వీడియోని షేర్ చేసిన ప్రకాష్ రాజ్' సొంతంగా నిర్మించిన సినిమాలని  సెల్ఫ్ డబ్బా గా ప్రమోట్ చేసుకోవడం కరెక్టేనా? అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చలకి కూడా దారి తీస్తుంది. ఏది ఏమైనా బంగాళా ఖాతంలో వాయుగుండం పడి తీరం దాటాక ఫలితం లేదనేలా ఎవరు ధురంధర్ ని పొగిడినా, విమర్శించినా ధురంధర్ 2 కి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఇప్పటికే  సుమారు 1650 కోట్ల గ్రాస్ ని రాబట్టి సరికొత్త ఫిగర్ ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పరిచయం చెయ్యాలనే ఆత్రుతతో ఉన్నాడు.    
    -బైకర్ తో సందడి చేస్తున్న రాజశేఖర్  -శర్వా తండ్రిగా సూపర్ గా చేసాడని కితాబు  -మరి నెక్స్ట్ చిత్రాలు ఏంటి  యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్(Rajasekhar).. హీరోగా ఎన్నో అఖండమైన విజయాల్ని చూసిన హిస్టరీ నేమ్. తోటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సినిమాలకి పోటీగా వచ్చి విజయాల్ని చవి చూసాడు. ముఖ్యంగా మగాడు, అంకుశం, అన్న, శివయ్య, సింహరాశి, ఓం సినిమాల్లో ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ కైతే అభిమానులు,ప్రేక్షకుల చేత పూనకాలు కూడా తెప్పించాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా బ్యాండ్ అంబాసిడర్. చాలా మంది మహిళలు రాజశేఖర్ ని తన అన్నయ్యగా భావించే వారు. ఈ విషయంలో సిల్వర్ స్క్రీన్ కూడా పోటీపడుతోంది. అంతలా రాజశేఖరుడి యాక్టింగ్ ని చూసి మురిసిపోతుంటుంది. మరి అలాంటి రాజశేఖరుడి అప్ కమింగ్ సినీ జర్నీపై ఒక లుక్ వేద్దాం. రాజశేఖర్ ప్రస్తుతం థియేటర్స్ లో 'బైకర్'(Biker)మూవీతో సందడి చేస్తున్నాడు. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులైతే రాజశేఖర్ బైకర్ కి అతి పెద్ద ప్లస్ గా నిలిచాడని, అసలు అయన కాకుండా వేరే వాళ్ళు చేసి ఉంటే బైకర్ పరిస్థితి మరోలా ఉండేదని నిర్మొహమాటంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టుగానే  శర్వానంద్ తండ్రిగా సంతోష్ నారాయణ క్యారక్టర్ లో ఇరగదీసాడు. దీంతో రాజశేఖర్  హీరోగా కాకపోయినా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ తమని అలరించాలని కోరుతున్నారు. రాజశేఖర్ కూడా అందుకు సిద్దంగానే ఉన్నాడు. కానీ అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. నిజానికి ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో రాజశేఖర్ కి ఆవేశం, పొగరుతో కూడిన సరైన క్యారక్టర్ పడితే సినిమా రేంజ్ ఊహకి కూడా అందదు.  also read: Allu arjun: అల్లు అర్జున్ సాంగ్ అరుదైన రికార్డు. ఏకంగా 93కోట్ల వ్యూస్  2023 లో నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ లో కీలక రోల్ లో కనిపించాడు. ఆ మూవీలో కూడా తనకి మాత్రమే సాధ్యమయ్యే పెర్ ఫార్మ్ తో ఇరగదీసాడు. ఆ తర్వాత బైకర్ నే. అంటే మళ్ళీ మూడేళ్ళకి. కాకపోతే బైకర్ విషయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి(Chiranjeevi)ఇంట్లోనే చిన్నప్పట్నుంచి పెరిగిన వ్యక్తి శర్వానంద్. పైగా రామ్ చరణ్ ఎంతో శర్వానంద్ కూడా అంతే. ఈ విషయాన్నీ చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్(Ram Charan)శర్వానంద్(Sharwanandh)కూడా చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మరి బైకర్ ని చిరంజీవి, చరణ్ తో చాలా మంది సినీ పర్సనాలిటీస్ చూసే అవకాశం ఉంది. పై పెచ్చు బైకర్ ని నిర్మించిన యువి క్రియేషన్స్ నే విశ్వంభరని నిర్మిస్తుంది. కాబట్టి రాజశేఖర్ కి ఈ సారి మరిన్ని అవకాశాలు వెంట వెంటనే వచ్చే అవకాశం ఉంది.ఏది ఏమైనా రాజశేఖర్ లాంటి హీరోకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండదు. పాన్ ఇండియాని షేక్ చేసి మళ్ళీ తన కోసం థియేటర్స్ కి పరుగెత్తేలా చేసే క్యారక్టర్ స్టిల్  కొంత మంది  మేకర్స్ మెదళ్లలో మెదులుతూనే ఉండుంటుంది.  
Natural Star Nani's highly anticipated action thriller The Paradise is generating immense buzz, but recent speculations suggest the film might face yet another delay. Directed by Srikanth Odela, the gritty drama is one of the most awaited pan-Indian projects. However, recent industry chatter indicates the team is contemplating pushing the release further back to ensure the final output meets the massive expectations of the audience.   The movie has already experienced a significant schedule change. Originally, The Paradise was locked for a grand release on March 26, 2026. The makers later postponed it to August 21, 2026. This initial move was officially attributed to the need for more post-production time, while also strategically avoiding a crowded box office clash with mammoth releases like Dhurandhar 2 and Toxic. Despite the new August date, reports suggest that the extensive post-production required for the film's complex action sequences is taking longer than anticipated. Because the story deals with a massive socio-political theme and a large-scale tribal backdrop, the team is reportedly unwilling to compromise on the film's technical and visual quality just to meet a strict deadline. While there is no official word yet on this second postponement, the rumors have left fans slightly anxious. Audiences are eagerly waiting to see Nani reunite with his Dasara director for another raw, intense role. The industry and moviegoers alike are now looking toward the production house to issue a formal clarification regarding the final release date.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
    -ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్ డే  -గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఫ్యాన్స్  -అలాంటి ఈ టైంలో అల్లు అర్జున్ సాంగ్ రికార్డు -ఏకంగా 93 కోట్ల వ్యూస్  -మరి ఆ సాంగ్ ఏంటో చూద్దాం   సినిమా చూపిస్తా మావ... నీకు సినిమా చూపిస్తా మావ అంటూ 'ఐకాన్  స్టార్ అల్లు అర్జున్'(Allu Arjun)ఈ నెల 8 న 'రేసుగుర్రం' రీ రిలీజ్ తో సందడి చేయనున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ ని పదింతలు రెట్టింపు చేసేలా ఒక అరుదైన రికార్డు అల్లు అర్జున్ సినీ లైబ్రరీ వద్దకి చేరింది. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం. బుట్టబొమ్మ బుట్టబొమ్మ.. నన్ను చుట్టుకుంటివే.. అల వైకుంఠపురంలోని ఈ సాంగ్ సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజులో కనీసం నిద్రపోయే సమయంలోనైనా బుట్ట బొమ్మ సాంగ్ ని హమ్ చేయని అల్లు అర్జున్ అభిమాని, సంగీత ప్రియులు ఉండరు. అంతలా వారందరితో పెనవేసుకొని పోయింది. ఫ్యాన్స్, మన ప్రేక్షకుల సంగతి  పక్కన పడితే ఫారనర్స్ సైతం బుట్టబొమ్మకి రీల్స్ చేసారు. దీంతో ట్రెండ్ సృష్టించడానికే బుట్టబొమ్మ పురుడు పోసుకున్నట్టయ్యింది.. ఇప్పుడు ఈ సాంగ్  యూట్యూబ్ చరిత్రలో  93కోట్ల వ్యూస్‌ని అందుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది. Also read: VIjay: విజయ్ పై తెలుగు నాట డబ్బు పందాలు.. ఐపీఎల్ పరిస్థితి ఏంటి!  దీన్ని బట్టి బుట్టబొమ్మ సాంగ్ ని రిపీట్ గా ఎంత మంది చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు . సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు అందించిన అందమైన, అర్థవంతమైన, ఆనందకరమైన గిలిగింతలు రేపే సాహిత్యానికి  థమన్ అంతే విధంగా క్యాచీ ట్యూన్స్ అందించడం, అర్మాన్ మాలిక్ అంతే విధంగా ఆలపించడం, అల్లు అర్జున్  స్టెప్స్, కాస్ట్యూమ్స్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కూడా  అందమైన, అర్థవంతమైన, ఆనందకరమైన గిలిగింతలు రేపడంతో బుట్టబొమ్మ సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఆ రికార్డులో కొత్త ఫిగర్ చేరడం ఖాయం.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో ఈ తీగ ఎండిపోవడం మొదలై, పూయడం ఆగిపోతూ ఉంటుంది.  చాలా మంది వేసవిలో శంఖు పుష్పం మొక్క ఇక పువ్వులు పూయదు ఈ సీజన్ లో అనుకుంటారు.  అయితే గార్డెనింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్కకు మార్చి,  ఏప్రిల్ నెలలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. కొన్ని చిట్కాలు పాటిస్తే  శంఖు పుష్పం మొక్కకు పువ్వులు చక్కగా పూస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. శంఖు పుష్పం మొక్కకు మార్చి, ఏప్రిల్ నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తీగను కత్తిరించడం చాలా అవసరం. పాత, ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన కొమ్మలను కత్తిరించాలి. ఇది మొక్క కొత్త కొమ్మలను చిగురించడానికి ప్రోత్సహిస్తుంది. కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఎక్కువగా పువ్వులను పూస్తుంది. శంఖు పుష్పం తీగ కుండీలోని మట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాతదైతే దానిని మార్చాలి. కాలక్రమేణా, మట్టిలోని పోషకాలు తగ్గిపోయి చాలా గట్టిగా మారుతుంది. కుండీ పైభాగంలోని 2 నుంచి 3 అంగుళాల మట్టిని తీసివేసి, దాని స్థానంలో కొత్త కంపోస్ట్ కలిపిన మట్టిని నింపాలి. ఇది మొక్క  కొత్త వేర్లను బలపరిచి, వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వేసవిలో శంఖు పుష్పం  మొక్కకు తేమ మాత్రమే అవసరం. అధికంగా నీరు పోయడం మొక్కకు హాని కలిగిస్తుంది. వేసవి కాలంలో, ఆకులకు నీరు పోయడానికి స్ప్రే బాటిల్‌ను ఉపయోగించాలి. ఇది మొక్కను తేమగా ఉంచుతుంది. మట్టి పై పొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. శంఖు పుష్ప మొక్కకు సూర్యరశ్మి అంటే చాలా ఇష్టం. ఈ మొక్కకు కనీసం 5 నుండి 6 గంటల సూర్యరశ్మిని అందించాలి. ఒకవేళ ఈ మొక్క ఎక్కువ కాలం నీడలో ఉంటే, తీగ పొడవుగా పెరుగుతుంది కానీ పూలు పూయదు. శంఖు పుష్ప మొక్క కోసం మట్టిని సిద్ధం చేసేటప్పుడు, ఇసుక, వర్మీకంపోస్ట్ సరైన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. నెలకు ఒకసారి మట్టిలో లిక్విడ్  ఆవాల పిండి ఎరువును కలపాలి. దీనివల్ల పూల సంఖ్య పెరగవచ్చు. ప్రత్యామ్నాయంగా ఆవు పేడ ఎరువును కూడా వేయవచ్చు.                                        *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి  పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.  ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా,  కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు.  ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత  గురించి  చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు,  తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల  చాపను వేయాలి.  ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో  లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి  సహాయపడతాయి. చన్నీటి స్నానం..  ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే,  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.  వేడిగా అనిపించకుండా ఉండటానికి  చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు..  మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ,  శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు.  వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు.  అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు. గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.                                 *రూపశ్రీ.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో  జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు.  అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.  అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.  
కడప జిల్లా జమ్మలమడుగులో  బీజేపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి   సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు.  అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే..  జములమడుగులో  ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి  మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు.   పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు.   గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు,  రాజోలి జలాశయ నిర్మాణం,  ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు.   గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన..  ఈ సమస్యల పరిష్కారం కాకుంటే..  ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతోనే అమరావతి నిర్మాణ స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చబోతోందని ఆయన వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆయన అభినందించారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజధాని కోసం నిలబడిన ప్రతి పౌరుడి విజయం ఇది అని ఆయన కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇక నుంచి ఒకే చిరునామా ఉండబోతోందని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం.  అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు,  చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. స్విమ్మింగ్ ఫూల్  నీటిలోని క్లోరిన్, రసాయనాలు,  బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా  ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్  పెరుగుతుంది.  స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్  తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే  ఈత కొట్టాలి. స్విమ్మింగ్ పూల్‌లో  అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి  జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి.  ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి.  స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది.  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.                               *రూపశ్రీ.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.