LATEST NEWS
ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్ సభలో సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం (ఏప్రిల్ 2) ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ వచ్చిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడిందని లోకేష్ పేర్కొన్నారు.
కాగా ఢిల్లీకి చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందిస్తూ.. అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన లోకేష్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందగానే చప్పట్లతో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే హస్తినకు బయలుదేరిన లోకేష్ గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభలో అమరావతిపై జరిగే చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.
అమరావతికి చట్టబద్ధత విషయంలో ధర్మమే గెలిచిందని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందన్నారు. చట్టసభలో అమరావతే రాజధాని అని ఆమోదం పొందినా, వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, ఇంక కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు. తన బొమ్మ కోసం సర్వే రాళ్లపై 750 కోట్లు, పాస్‌బుక్‌ల కోసం పాతిక కోట్లరూపాయల ప్రజాధనాన్ని తగలేసిన జగన్, తన సొంత విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాజధానిని నిర్మిస్తోందన్న నారాయణ.. అమరావతి వంద శాతం సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు.
ప్రభుత్వం దగ్గరున్న 5,000 ఎకరాలు అమ్మి తీసుకున్న రుణాలు తీరుస్తామని, ప్రజల పన్ను నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా స్టేడియంలు, ఎయిర్‌పోర్ట్‌లతో అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్న నారాయణ.. 2028 ఆగస్టు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజే ప్రజలను పక్కదారి పట్టించేందుకు జగన్ మావిగన్ పేరుతో మరో కుట్రకు తెరలేపారని, ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు.
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారాయన.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేశారు.
ALSO ON TELUGUONE N E W S
- విజయశాంతి మాస్ ట్రీట్
- రౌడీల గుండెల్లో వణుకు పుట్టించిన పవర్‌ఫుల్ ఫైట్!
- శ్రీకాంత్ సాక్షిగా విజయశాంతి వీరవిహారం
- పరీక్షా కేంద్రంలో అవినీతిపై పోరాటం!
లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, జగపతిబాబు, శ్రీకాంత్ నటించిన ఆశయం చిత్రంలోని పవర్‌ఫుల్ సన్నివేశాలతో కూడిన వీడియో ఇది. ఎ.మోహనగాంధీ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. పరీక్షా కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న లెక్చరర్‌ను సరోజిని (విజయశాంతి) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆ తర్వాత రోడ్డుపై ఆమెపై దాడికి ప్రయత్నించిన రౌడీలకు బుద్ధి చెప్పే ఉత్కంఠభరితమైన ఫైట్ సీన్ ఇందులో ప్రధాన ఆకర్షణ.
తెలుగు సినీ ప్రేక్షకులకు 'కర్తవ్యం' సినిమాతో లేడీ బాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన విజయశాంతి, మరోసారి తన మార్క్ యాక్షన్‌తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో విజయశాంతి నటించిన ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్యాయాన్ని ఎదిరించే ఒక ధైర్యవంతురాలైన విద్యార్థిని పాత్రలో ఆమె చూపిన తెగువ మెస్మరైజ్ చేస్తోంది.
ఈ యాక్షన్ సీక్వెన్స్ ఒక కాలేజీ నేపథ్యంలో మొదలవుతుంది. పరీక్షా హాల్లో లెక్చరర్ డబ్బు తీసుకుని ఒక స్టూడెంట్ బదులు తానే పేపర్ రాస్తుండగా, విజయశాంతి అడ్డుకుంటుంది. ఈ క్రమంలో జరిగే వాగ్వాదం చివరకు రోడ్డుపై పెద్ద ఫైట్‌కు దారితీస్తుంది. కాలేజీ నుంచి డిబార్ అయిన రౌడీ మూకలు విజయశాంతిపై దాడికి దిగగా, ఆమె తనదైన శైలిలో వారిని మట్టి కరిపించడం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఈ స్టంట్ లో విజయశాంతి బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె కళ్లలో కనిపించే తీక్షణత అద్భుతం. ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ షాట్స్‌ను కూడా ఎంతో నేచురల్‌గా చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రౌడీలు చుట్టుముట్టినప్పుడు ఆమె ఇచ్చే కౌంటర్ ఎటాక్స్, ఫుట్ వర్క్ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ తరహాలో ఉన్నాయి. స్టంట్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండి ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది.
వీడియోలో హీరో జగపతిబాబు కూడా కనిపిస్తారు. ఆయన పాత్ర ఇందులో విజయశాంతికి సపోర్టివ్‌గా ఉంటూనే, ఒక సామాన్య వ్యక్తిగా ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయేలా డిజైన్ చేయబడింది. డైరెక్టర్ ఎమోషన్‌ను మరియు యాక్షన్‌ను బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాత క్లిప్పింగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా, "విజయశాంతి గారు మళ్ళీ ఇలాంటి పవర్‌ఫుల్ రోల్స్ చేయాలి" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscibe చేసుకోండి.
-రేపు రాకాసతో సందడి చేయనున్న నీహారిక
-ప్రమోషన్స్ లో బిజీ
-వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ పై మాటలు
మెగా డాటర్ అనే టాగ్ లైన్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తు తన సినీ డైరీని ఫుల్ బిజీ మోడ్ లో ఉంచుతుంది నీహారిక కొణిదెల(Niharika Konidela). ఈ క్రమంలోనే రేపు 'రాకాస' మూవీతో థియేటర్స్ లో ల్యాండ్ కానుంది. ప్రొడ్యూసర్ గా ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు తో హిట్ అందుకొని ఉండటంతో 'రాకాస'పై అంచనాలు పెరిగాయి.సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా చేస్తుండగా హర్రర్ కామెడీతో తెరకెక్కడం రాకాస స్పెషల్. రేపు ఏప్రిల్ 3 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ హీరో విశ్వక్ సేన్ పై నీహారిక(Niharika)చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో టూ డే ఫ్రెష్ నెస్ హోదాలో తిరుగుతున్నాయి. మరి ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం.
కెరీర్ మొదట్లో నటిగా 'విశ్వక్ సేన్(Vishwak Sen)తో 'టర్మ్స్ అండ్ కండిషన్స్' అనే షార్ట్ ఫిలిం చేశాను. ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చేయమంటే అలానే చేస్తు నటిగా బాగానే ఎంజాయ్ చేశాను. ఆ ఏజ్ లో నాకు వచ్చిన యాక్టింగ్ అదే. కానీ దేవుడి దయవల్ల ఒక సాంగ్ తోనే షార్ట్ ఫిలిం ఆగిపోయింది. ఆ విధంగా ఆగిపోవడం విశ్వక్ కి నాకు మంచి జరిగినట్లయింది. అప్పట్లో మీడియా హడావిడి లేదు. ఏదైనా ఫ్రీగా చేసుకునేవాళ్లం. కానీ మీడియా ఉండుంటే నేను అలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్ని కాదు కదా అని ఇప్పుడు అనిపిస్తుందని చెప్పింది. దీంతో షార్ట్ ఫిలిం ఆగిపోతే ఎందుకు హ్యాపీగా ఫీలవుతున్నావో కూడా చెప్పచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా గతంలో అఖిల్ అక్కినేని గురించి నీహారికనే చెప్పిన కొన్ని మాటలని కూడా వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఆ మాటలు కూడా చూద్దాం.
Also read: Ramayana: టార్గెట్ మొత్తం క్లియర్ గా అర్థమైంది.. ఒక రేంజ్ లో ఉన్న రామాయణ టీజర్
అఖిల్(Akhil Akkineni)అక్కినేని తో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఎస్.ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించాడు. రాజమౌళి(SS Rajamouli)కి చూపిస్తే ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయకపోతే బెటర్ అన్నారని చెప్పుకొచ్చింది. రాజమౌళి కొడుకే కార్తికేయ అనే విషయం తెలిసిందే.
-రామభక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్న రామాయణ
-నిమిషాల్లోనే రికార్డు వ్యూస్
-మాటలు చాలవు
-ఏ రికార్డు మిగలదా!
-టీజర్ లో ఉన్న అంశాలేంటి
మొత్తం అర్థమైంది.. చాలా క్లియర్ కట్ గా.. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా.. రామాయణ(Ramayana)మూవీ భారతీయ చిత్రపరిశ్రమలో రాముడి సాక్షిగా ఒక పెను ప్రభంజాన్న సృష్టించబోతుందనే విషయం మొత్తం అర్థమైంది. ఈ విధంగా పొగుడుతూ ఎంత రాసినా వర్ణించడానికి పదాలు చాలవు. కొత్త పదాలని కనిపెట్టాల్సిన పరిస్థితి. అంతలా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజైన టీజర్ ఉంది. 'రామ' అంటు సుమారు రెండు నిమిషాల ఇరవై రెండు సెకన్ల నిడివితో ఉండగా ఉన్న పళంగా రామభక్తుల చేత రామ నామం జపించేలా కూడా చేస్తుంది. మరి టీజర్ లో ఉన్న రామ అంశాలేంటో చూద్దాం.
సీతమ్మ తల్లి, లక్ష్మణుడితో కలిసి రాముడు వనవాసానికి వెళ్లడం. వనవాసంలో రాక్షసులతో పోరాటం, హనుమంతుడి నుంచి రామ అనే వాయిస్ రాగానే రాముడు వెనక్కి తిరగడం, తన అయోధ్య రాజ్యానికి వచ్చి పట్టాభిషేకుడు అవ్వడం,ప్రజల హర్షద్వానాలు ఇలా ప్రతి అంశం రామ భక్తులని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. రాముడి నుంచి వచ్చే పోరాట సన్నివేశాలతో పాటు అన్ని విభాగాల్లోను ఇంతవరకు సెల్యులాయిడ్ పై తెరకెక్కిన అన్ని రామాయణాల కంటే అద్భుతమైన ప్రపంచం సాక్షాత్కారం కాబోతుందని అర్ధమవుతుంది.
అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు, దానిని సరిచెయ్యడానికి ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. ఐదు వేల సంవత్సరాలుగా మన హృదయాల్ని పరిపాలిస్తున్న రక్షకుడు, మన నాయకుడు పురాణ పురుషుడు అని ఇచ్చిన క్యాప్షన్ మాటలైతే రామభక్తుల హృదయ అంతరాలని తట్టి లేపుతున్నాయి. రాముడు రామభక్తుల హృదయాల్లో సదాకొలువు తీరి ఉంటాడు కాబట్టి మేకర్స్ చాలా తెలివిగా ఎలాంటి వాయిస్ ఓవర్ లేకుండా టీజర్ రిలీజ్ చెయ్యడం టీజర్ కి మరింత వన్నె తెచ్చింది.
Also read: Euphoria:యుఫోరియా ఓటిటి డేట్ ఇదే.. మరి ఆ పని చేసారా
ఇక చివరలో రావణుడి క్యారక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసారు. కానీ ఫేస్ ని చూపించలేదు. అసలు మొత్తం టీజర్ లో ఒక్క రాముడి ఫేస్ ని మాత్రమే రివీల్ చేసారు. రాముడిగా రణబీర్ కపూర్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఎంతలా అంటే ఫ్యూచర్ లో ఎక్కడైనా రాముడి గుడి కడితే తన రూపంతో కట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏ ఆర్ రెహ్మాన్, హాన్స్ జిమ్మెర్ లు తమ ఆర్ ఆర్ తో రామాయణకి ఎంతలా ప్రాణం పోస్తున్నారో కూడా టీజర్ చెప్తుంది. ప్రెజెంట్ రామభక్తులైతే టీజర్ ని చూసి తమ జన్మ ధన్యమయినట్టుగా మురిసిపోతున్నారు. ప్రైమ్ స్టూడియోస్ పై నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మిస్తుండగా నితీష్ తివారి(Nitesh Tiwari)దర్శకుడు. రెండు పార్టులుగా తెరకెక్కనుండగా ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం రిలీజ్ కానున్నాయి. సాయి పల్లవి సీతమ్మ తల్లిగా చేస్తున్న విషయం తెలిసిందే.
-థియేటర్స్ లో సక్సెస్ అందుకున్నయుఫోరియా
-చాలా సున్నితమైన సబ్జెట్
-మీ కోసమే ఓటిటిలోకి
ఈ మధ్య కాలంలో ఏ ముగ్గురు మూవీ లవర్స్ కలిసినా 'యుఫోరియా'(Euphoria)సూపర్ గా ఉంది. నేటి యువతతో పాటు తల్లితండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. ఆలోచింప చేసే సబ్జెట్ కావడంతో పాటు యువతీకి జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. గుణశేఖర్(Gunasekhar)కూడా అత్యద్భుతంగా తెరకెక్కించాడు. కానీ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నాయనేది నిజమేరా! లేదంటే 'యుఫోరియా' ఎంత బాగా ఆడాల్సిన మూవీ అని మూవీ లవర్స్ యుఫోరియా విషయంలో ఎంతగానో బాధపడ్డారు. అది నిజం కూడాను. యుఫోరియాకి దక్కాల్సిన విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా సరికొత్త సినీ కదనరంగంలోకి దూకబోతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
యుఫోరియా ఈ బుధవారం అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈటీవీ విన్(Etv WIn)లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఈ మేరకు ఓటిటి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గుణశేఖర్ తో పాటు ఈటీవీ విన్ యాజమాన్యం ప్రీ స్ట్రీమింగ్ వేడుకని నిర్వహించి మరి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. దీన్ని బట్టి యూఫోరియాకి ఉన్న ప్రాముఖ్యతని అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ ని కూడా రెండు విభాగాల్లో అందుకున్న విషయం తెలిసిందే.
also read: జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
దీంతో 'యూఫోరియా' చూడాలని ఉన్నా థియేటర్స్ లో లేకపోయేసరికి నిరుత్సాహపడ్డ వాళ్లంతా ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని'యుఫోరియా'ని వీక్షించవచ్చు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ పక్కా. మరి 99 రూపాయలతో ఈటీవీ విన్ డౌన్ లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ధురంధర్ భామ సారా అర్జున్(Sara Arjun),ఒకప్పటి హీరోయిన్ భూమిక(Bhumika)తో పాటు మిగతా ఆర్టిస్ట్స్ మిమ్మల్ని అలరించడంలో ఏ మాత్రం పక్షపాతం చూపించరు.
-ఎలక్షన్ క్యాంపెయిన్ లో విజయ్ బిజీ
-ఈ నెల 23 న ఎన్నికలు
-వైరల్ అవుతున్న జననాయగన్ కొత్త రిలీజ్ డేట్
భాష కంటే మనిషి అంతరాత్మ నుంచి వచ్చే భావం గొప్పది. ఆ అంతరాత్మకి అందరు బద్దులు కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఏ మనిషి భావం అయినా ఇట్టే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఈ సత్యం సినీ ప్రియుల ద్వారా అందరి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు 'బొబ్బిలిపులి' లోని ఎన్టీఆర్(Ntr)సాంగ్ 'సంభవం, నీకే సంభవం' అనే సాంగ్ ని పాడుకుంటున్నారు. పైగా పొలిటికల్ పరంగాను సదరు న్యూస్ విజయ్ కి లింక్ అవ్వడం గమనార్హం. అసలు మ్యాటర్ చూద్దాం.
జననాయగన్(Jananayagan)ఈ నెల 24 న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు, వంకలు ఉండవని, రిలీజ్ పక్కా అంటున్నారు. దీంతో అభిమానులు తమ సుదీర్ఘ నిరీక్షకి తెరదించుతు జననాయకుడు రావాలని, సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడాలని బొబ్బిలిపులిలోని సాంగ్ పాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ పై సినీ విశ్లేషకులు స్పందిస్తు ఏప్రిల్ 24 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 23 న తమిళనాడు ఎన్నికలు కంప్లీట్ కాబోతున్నాయి. మూవీలో రాజకీయ నాయకులపై, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై శృతిమించిన విమర్శలు ఉండటంతో సెన్సార్ అడ్డుకట్ట వేసింది. దీంతో 24 న రిలీజ్ కి అడ్డు ఉండదని అంటున్నారు.
Also read: Rashika Shetty: హీరోయిన్‌కి టార్చర్.. నీ ఫేస్‌కి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా!
ఇక లేట్ అయినా జన నాయగన్ కాస్ట్ గురించి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాతో పాటు విజయ్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా, మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల ఏ విధమైన ఆటంకం లేకుండా, శ్రద్దగా చదువుకోవాలంటే వారికి జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా స్టడీ టేబుల్‌పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే, వారు ఎంత కష్టపడి చదివినా ఏకాగ్రత తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారు చదువుకునే ప్రదేశంలో లేదా స్టడీ టేబుల్‌పై ఉంచకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎందుకు చదువుకొనేటప్పుడు పిల్లలకు దగ్గరగా ఉంచకూడదో తెలుసుకుంటే..
మొబైల్ ఫోన్..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫోన్‌ను టేబుల్‌పై దూరంగా ఉంచినప్పటికీ, పిల్లల మనసు పదే పదే నోటిఫికేషన్ల కోసం చూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల, చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను వేరే చోట ఉంచాలి. మరీ ముఖ్యంగా నేటికాలంలో టీనేజ్ పిల్లలకు కూడా సపరేట్ గా ఫోన్ లు కొనివ్వడం పెద్దలు చేస్తున్న తప్పు. చిన్నతనం నుండే పిల్లలకు ఫోన్ విషయంలో మంచి క్రమశిక్షణ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లల మనసు చదువుపైన దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది.
స్నాక్స్..
చదువుకునే బల్లపై లేదా చదువుకునే ప్రదేశంలో చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు వంటివి ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు, దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుుతంది. జంగ్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. దానికి బదులుగా, పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి బల్ల దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.
స్టేషనరీ..
పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు , పోస్ట్-ఇట్ నోట్లను బల్లలపై వదిలేస్తుంటారు. దీనివల్ల స్టడీ టేబుల్ చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌లను మాత్రమే ఉంచాలి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్‌లో భద్రపరచాలి.
గేమింగ్ పరికరాలు..
టేబుల్‌పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ పరికరం లేదా కంట్రోలర్‌ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలిగే అవకాశం ఎక్కువ. దీనివల్ల చదువుకునే సమయం తగ్గి, వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచాలి.
కోట్స్..
గెలుపుకు బోలెడు మార్గాలు ఉంటాయి. కొందరు భయంతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది పిల్లలకు బాగా చదువుకుని మార్కులు బాగ తెచ్చుకోవాలని ఉన్నా, ఏదో బలహీనత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఈ కారణంగా భయంతో చదువు వైపు ఏకాగ్రత పెట్టడానికి కొన్ని కోట్స్ రాసిన స్టిక్కర్స్ పెట్టుకుంటారు. కానీ భయంతో చదివే చదువుకంటే.. ఇష్టంతో చదివే చదువు చాలా బాగా గుర్తుంటుంది. అందుకే చదువుకోవడాన్ని ప్రేరేపించే విదంగా ఉండే కోట్స్ ను స్టడీ టేబుల్ లేదా చదువుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇది మరింత మెరుగ్గా చదవడానికి సహాయపడుతుంది.
చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు పైన చెప్పుకున్నవి పాటించడం వల్ల పిల్లలు చదువులో మరింత మెరుగ్గా ముందుకెళతారు.
*రూపశ్రీ.
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది. పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది. నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా చల్లని నీరు తాగాలంటే.. మట్టి కుండలు మంచి ఆప్షన్.. ఇది చల్లదనాన్నే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో మట్టి కుండ కొనడం అంత సులభం కాదు. సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే నీరు అస్సలు చల్లగా ఉండదు. మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు మంచిది ఎన్నుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు..
రంగు వేసిన కుండలు..
రంగులు వేసిన కుండను ఎప్పుడూ కొనకూడదు. వాటిలో రసాయన రంగులను ఉపయోగిస్తారు, అవి చూడటానికి అందంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరం.
కుండలో రంధ్రాలు..
కుండకు లీకులు లేదా రంధ్రాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలి. కుండ కొనేటప్పుడే కుండలో నీళ్లు నింపి వెంటనే తనిఖీ చేయండి.
కుండ ఆకారం..
కుండ ఆకారాన్ని పరిగణనలోకి తీసుకోడం చాలా ముఖ్యం. కుండ మరీ పలుచగా లేదా మరీ మందంగా ఉండకూడదు, లేకపోతే నీరు చల్లబడదు. సరైన మందం ఉన్న కుండను ఎంచుకోవాలి.
వెడల్పాటి మూతి..
మార్కెట్లో కుండ కొనేటప్పుడు, వెడల్పాటి మూతి ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానివల్ల కుండను నింపడం, నీటిని తీసివేయడం, శుభ్రపరచడం చాలా సులభం అవుతుంది. దానిలోని నీరు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
*రూపశ్రీ.
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు తన సాధన, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మహావీరుడిగా పరివర్తన చెందాడు. అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది, ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం పదమూడవ రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు జైన మతానికి చెందిన 24వ తీర్థంకరుడైన మహావీరుని జన్మదినోత్సవం. ఈ సంవత్సరం, మహావీర్ జయంతి 2026 మార్చి 31, మంగళవారం నాడు వచ్చింది. యువరాజు వర్థమానుడు.. మహావీరుడిగా ఎలా పరివర్తన చెందాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
మహావీరుని పంచ వ్రతాలైన అహింస, సత్యం, అపవిత్రత, బ్రహ్మచర్యం, అపరిగ్రహం జైన మతానికి మూలస్తంభాలు. మహావీరుని జన్మదినోత్సవం జైన సమాజానికి ఒక ప్రధాన పండుగ. ఈ పవిత్రమైన రోజున, జైన దేవాలయాలను అలంకరిస్తారు, మహావీరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు, భారీ రథయాత్రలను నిర్వహిస్తారు. ప్రజలు దానధర్మాలు చేస్తారు , మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
సాధారణ మానవుడిగా జన్మించిన వర్థమానుడు తన జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకుని, జ్ఞానోదయం పొందిన ఆత్మగా, మహావీరడిగా మారి, అసాధారణమైన కార్యాలు సాధించారు. ఆయన ఒక రాజభవనంలో జన్మించి, పుట్టుకతోనే యువరాజు అయినప్పటికీ, జ్ఞానాన్వేషణలో త్యాగాన్ని, అంకితభావాన్ని అనుసరిస్తూ మహావీరుడిగా మారారు. కానీ యువరాజు వర్ధమానుడి నుండి మహావీరుడిగా ఆయన ప్రయాణం మరింత అద్భుతమైనది.
వర్థమానుడు మహావీరుడిగా మారిన ప్రయాణం..
మహావీరుడు సుమారు 2,500 సంవత్సరాల క్రితం క్రీ.పూ. 599లో వైశాలిలోని క్షత్రియకుండ గ్రామంలో ఒక క్షత్రియ రాజ కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పుడు, అతని తల్లిదండ్రులు అతని శ్రేయస్సు బాగుండాలని వర్ధమాన అని పేరు పెట్టారు. వర్ధమానుని తండ్రి సిద్ధార్థుడు ,అతని తల్లి త్రిశాల. శ్వేతాంబర సంప్రదాయం ప్రకారం వర్ధమానుడు యువరాణి యశోదను వివాహం చేసుకున్నాడు. అయితే దిగంబర సంప్రదాయం మహావీరుడిని జీవితాంతం బ్రహ్మచారిగా వర్ణిస్తుంది.
30 ఏళ్ల వయసులో వర్ధమాన యువరాజు లౌకిక జీవితాన్ని త్యజించాలని నిశ్చయించుకుని, సర్వస్వం త్యజించి సత్యం , జ్ఞానం కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. దీక్ష స్వీకరించిన తరువాత, అతను ఒక సంవత్సరానికి పైగా దేవదూష్య వస్త్రాలు ధరించి, ఆపై వస్త్రాలు విడిచిపెట్టి, తపస్సు మార్గాన్ని అనుసరించి కఠోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల మౌనం, తపస్సు, ఉపవాసం , ఆత్మసంయమనం తరువాత చివరకు రిజుబాలిక నది ఒడ్డున ఉన్న ఒక సాల వృక్షం కింద కైవల్యాన్ని పొందాడు.
42 ఏళ్ల వయసులో దివ్య జ్ఞానోదయం పొందిన తర్వాత, మహావీరుడు తన జీవితంలోని తదుపరి 30 సంవత్సరాలు బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ సమయంలో, ఆయన ధర్మ సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. 72 ఏళ్ల వయసులో, దీపావళి కార్తీక అమావాస్య రోజున, మహావీరుడు బీహార్‌లోని పావాపురిలో నిర్వాణం పొందారు. ఇది మహావీరుడి కథ..!
*రూపశ్రీ.
ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్ సభలో సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం (ఏప్రిల్ 2) ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ వచ్చిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడిందని లోకేష్ పేర్కొన్నారు.
కాగా ఢిల్లీకి చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందిస్తూ.. అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన లోకేష్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందగానే చప్పట్లతో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే హస్తినకు బయలుదేరిన లోకేష్ గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభలో అమరావతిపై జరిగే చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.
అమరావతికి చట్టబద్ధత విషయంలో ధర్మమే గెలిచిందని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందన్నారు. చట్టసభలో అమరావతే రాజధాని అని ఆమోదం పొందినా, వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, ఇంక కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు. తన బొమ్మ కోసం సర్వే రాళ్లపై 750 కోట్లు, పాస్‌బుక్‌ల కోసం పాతిక కోట్లరూపాయల ప్రజాధనాన్ని తగలేసిన జగన్, తన సొంత విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాజధానిని నిర్మిస్తోందన్న నారాయణ.. అమరావతి వంద శాతం సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు.
ప్రభుత్వం దగ్గరున్న 5,000 ఎకరాలు అమ్మి తీసుకున్న రుణాలు తీరుస్తామని, ప్రజల పన్ను నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా స్టేడియంలు, ఎయిర్‌పోర్ట్‌లతో అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్న నారాయణ.. 2028 ఆగస్టు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజే ప్రజలను పక్కదారి పట్టించేందుకు జగన్ మావిగన్ పేరుతో మరో కుట్రకు తెరలేపారని, ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు.
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారాయన.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేశారు.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి. చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి? తెలుసుకుంటే..
బ్రోకలీలో ఉండే పోషకాలు..
బ్రోకలీలో ఫైబర్, విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే..
గుండె జబ్బులు..
బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం. ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
రక్తనాళాల ఆరోగ్యం..
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు, పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.
క్యాన్సర్..
బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
కంటిచూపు..
కంటి చూపుకు పదును పెట్టడంలో, దృష్టి లోపాన్ని నివారించడంలో, రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
పేగు ఆరోగ్యం..
బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.
చక్కెర స్థాయిలు..
మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం. బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి...
ఊబకాయం ఎలా పెరుగుతుందంటే..
కార్యకలాపాలు లేకపోవడం..
శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.
ఉష్టోగ్రత..
వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది.
ఆకలి..
చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి.
చెమట, డిటాక్స్..
చెమట పట్టడం అనేది శరీరం సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
మనస్సు, శరీరం..
చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది. సోమరితనం పెంచుతుంది.
ఇలా జాగ్రత్త పడాలి..
ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి, లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.
ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి.
ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి.
తాజా పండ్లు, సలాడ్లు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి.
విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం. చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు. అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి, నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం అందరికీ సురక్షితం కాదని అంటున్నారు. కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి. ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే..
పసుపు పాలు ప్రయోజనాలు..
రోగనిరోధకశక్తి..
పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
జలుబు, దగ్గు..
పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది.
వాపులు..
పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు, కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు.
పసుపు పాలు ఎవరు తాగకూడదు?
జీర్ణసమస్యలు ఉన్నవారు..
తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం, పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
రక్త సంబంధ వ్యాధుల మందులు..
పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది. ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు.
మధుమేహ రోగులు..
పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు. మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు.
మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు..
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
గర్భిణీ స్త్రీలు..
గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు. దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.
*రూపశ్రీ.
