ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు.. మహిళలకున్న బోలెడు సమస్యలు మాయం! శారీరక సమస్యలను తగ్గించడంలో ఆసనాలు బాగా సహాయపడతాయి. మహిళలలో ఎక్కువగా వెన్ను నొప్పి, సయాటికా, నాడీ వ్యవస్థ బలగీన పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి కారణంగా రోజువారి పనులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలు తగ్గడానికి వైద్యులను కలిసి బోలెడు మందులు  కూడా వినియోగిస్తుంటారు. అయితే వీటన్నింటిని కేవలం ఒకే ఒక్క ఆసనం సెట్ చేస్తుంది. అదే సేతుబంధాసనం. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా వెయ్యాలి?  దీని ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. *సేతుబంధాసనం.. సేతుబంధాసనం వెయ్యడం సులభమే.. మొదట వెల్లికిలా పడుకోవాలి. ఆ  తరువాత కాళ్లను మోకాళ్ల దగ్గర వంచి పాదాలను దూరం జరపాలి. ఇలా జరిపినప్పుడు వంచిన కాళ్ల మద్య గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు చేతులతో పాదాల చీలమండలు పట్టుకోవాలి.  ఒకవేళ చేతులకు చీలమండలు అందకపోతే చేతులను తొడల దగ్గర నేలపై ఉంచాలి. ఊపిరి తీసుకుని వదులుతూ కడుపును లోపలికి తీసుకోవాలి. తలను భుజాలను నేలపై ఉంచి కాళ్లపై బరువు మోస్తూ మెల్లిగా నడుమును పైకి ఎత్తాలి. పై స్థితిలోకి వచ్చినప్పుడు గడ్డం   ఛాతీని తాకుతుంది. ఈ పొజీషన్లోకి వచ్చాక సాధారణ శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు ఆ భంగిమలో ఉండాలి. ఆ తరువాత శ్వాస వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చెయ్యాలి. *సేతుబంధాసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది, నడుము కండరాలు అనువుగా మారతాయి.   మోకాళ్లు, తొడలు,  కోర్ కండరాలు బలాన్ని పొందుతాయి. వెన్నునొప్పి, స్లిప్ డిస్క్,  సయాటికా నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వెన్నెముక బెండ్ కావడం, బోలు ఎముకల వ్యాధిలో ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, ప్రేగులు, మూత్రపిండాలు, కాలేయం, ప్లీహము, పురీషనాళం,  మూత్రాశయాన్ని బలపరుస్తుంది. ఇది అడ్రినల్, థైమస్, థైరాయిడ్,  పారాథైరాయిడ్ గ్రంధులను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్త్రీలలో అండాశయాలు,  గర్భాశయ బలాన్ని పెంచుతుంది.  రుతుక్రమం లోపాలను తొలగిస్తుంది. గమనిక: హెర్నియా, అల్సర్, మెడ నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.                                           *నిశ్శబ్ద.

ప్రసవం గురించి  భయాలున్నాయా? ఈ  వ్యాయామాలు చేస్తే!     ఆడపిల్లల జీవితంలో తల్లికావడం అత్యుత్తమమైన దశ. నెలలు గడిచేకొద్దీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం గురించి, ప్రసవం గురించి తలచుకుని భయపడుతుంటారు. ఈ భయాలను పోగొట్టి సుఖవంతమైన ప్రసవానికి బాట వేసేది ప్రసవం కోసం ప్రత్యేకంగా రూపొందింటిన వ్యాయామాలు. ఇవి ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వ్యాయామాలలో పెరినియల్ మసాజ్, కెగెల్ వ్యాయామాలు ముఖ్యమైనవి.  ఇవి ప్రసవ సమయంలో కలిగే అసౌకర్యాన్ని దూరం చేసి  బిడ్డ  క్షేమంగా బయటకు వచ్చేందుకు సహాయపడుతుంది. పెరినియల్ మసాజ్ యోనికి పాయువుకు మధ్య కణజాలాన్ని సున్నితంగా సాగదీస్తుంది. బిడ్డ సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. యోని మార్గం చిరిగిపోయే ప్రమాదాన్ని అరికడుతుంది. కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రసవం సాఫీగా జరగడానికి, ప్రసవం తరువాత మహిళలు వేగంగా కోలుకోవడానికి కూడా ఈ కెగెల్ వ్యాయామాలు సహాయపడతాయి. అసలు పెరెనియల్ మసాజ్ అంటే ఏంటంటే.. పెరెనియల్ మసాజ్ అనేది సుఖవంతమైన ప్రసవం కోసం యోని, పురీషనాళం మధ్య ప్రాంతాన్ని సాగదీయడానికి, ప్రసవం కోసం సన్నద్దం చేయడానికి చేసే మసాజ్. ఇది ప్రసవం సమయంలో యోని ప్రాంతం చిరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది. యోనిని దృఢంగా మారుస్తుంది.  ప్రసవం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.  దీని వల్ల సరైన ఫలితాలు కావాలంటే 34నుండి 36వారాల గర్బం ఉన్నప్పుడు దీన్ని మొదలుపెట్టాలి. దీనికోసం శుభ్రమైన నూనెను చేతులతో లేదా కందెన  ఉపయోగించి మసాజ్ చేయాలి. మసాజ్ సమయంలో వెనుకకు కూర్చోవడం, పక్కకు కూర్చోవడం వంటి బంగిమలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా ఒత్తిడి తెస్తూ కిందివైపుకు మసాజ్ చేయాలి. కెగెల్ వ్యాయామాలు అంటే ఏంటంటే.. కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను టార్గెట్ చేసుకుని చేసే వ్యాయామాలు. ఈ కండరాలను ఈ వ్యాయామాలు బలోపేతం చేస్తాయి. మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తాయి. ప్రసవం తరువాత తొందరగా కోలుకోవడంలో సహకరిస్తాయి. గర్బధారణ సమయంలో, గర్భధారణ తరువాత యోని లీక్ కావడం వంటి  సమస్యలను ఇది చక్కగా నియంత్రిస్తుంది. పెరినియల్ మసాజ్, కెగెల్స్ వ్యాయామం ప్రతిరోజూ అయినా చేయవచ్చు. లేదా వారానికి ఒకసారి ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని అయినా చేయవచ్చు. దీనిని భాగస్వాముల సహకారంతో చేయడం వల్ల గర్బవతులు మరింత సంతోషంగా తమ గర్బం మోసే కాలాన్ని అనుభూతి చెందగలుగుతారు.                                                          *నిశ్శబ్ద.

ఈ ఆసనాలు వేస్తే కొవ్వు కరిగిపోతుంది! ప్రస్తుతకాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.  ఎక్కువగా కూర్చొని పని చేయడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా శరీరంలో అధిక కొవ్వు పెరుగుతుంది. రోజంతా డెస్క్ వర్క్ వల్ల శరీరంలో కింది భాగం బలహీనంగా మారుతుంది. అధిక కొవ్వు తొడలు, తుంటిలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, శరీరం పై భాగం కంటే దిగువ భాగంలో కొవ్వు పెరుగుతుంది దీనివీల్ల శరీరం లావుగా  కనిపిస్తుంది. ఊబకాయం లేదా శరీరంలో ఇలా పెరిగిపోయిన కొవ్వును వ్యాయామం లేదా యోగా ద్వారా తగ్గించవచ్చు. శరీర పరిస్థితికి అనుగుణంగా ఏ వ్యాయామం లేదా యోగా చేయాలో చాలామంది మహిళలకు తెలియదు. లావుగా ఉన్న తొడల కొవ్వును తగ్గించాలనుకుంటే, ఆయా ప్రాంతాలలో ఉన్న కొవ్వును కరిగించే యోగాసనాలు చెయ్యాలి. ఇందుకోసం యోగాలో ఎన్నో అసనాలున్నాయి కూడా. ఈ కింద పేర్కొన్న మూడే మూడు యోగాసనాల ద్వారా తొడలు, తుంటి భాగంలో పేరుకున్న కొవ్వును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఉత్కటాసన ఉత్కటాసనాన్ని కుర్చీ భంగిమ అంటారు. ఈ ఆసనం చేయడానికి రెండు కాళ్ల మధ్య కొద్దిగా ఖాళీని ఉంచి, చేతులను ముందు వైపుకు చాచి, నమస్కార భంగిమలో అరచేతులను కలపండి. ఇప్పుడు చేతులను పైకి లేపి, మోకాళ్లను వంచి, కటిని తగ్గించాలి. ఇప్పుడు, చీలమండలు, మోకాళ్లను నిటారుగా ఉంచి, నమస్కార ముద్రలోకి వచ్చి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమను ప్రతిరోజు పాటిస్తూ ఉంటే తొడల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.  ఏకపాదాసనం ఏకపాదాసనం చేయడం వల్ల తొడల్లోనే కాకుండా తుంటి భాగంలో పేరుకున్న కొవ్వు కూడా తొందరగా తగ్గుతుంది. పాదాలను వెడల్పుగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఇప్పుడు చేతులు పైకి లేపి, ప్రాణ ముద్రలో అరచేతులను కలపండి. వీపును నిటారుగా ఉంచి, శ్వాస వదులుతూ, శరీరాన్ని నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచాలి. ఈ సమయంలో, చేతులను చెవుల దగ్గర ఉంచి, నెమ్మదిగా వెనుకభాగాన్ని పైకి లేపాలి. కుడి కాలు, కటి, ఎగువ శరీరం, చేతిని నేరుగా పైకి ఎత్తండి. కళ్ళను నేలపై ఉంచేటప్పుడు బ్యాలెన్స్  చూసుకోవాలి. వృక్షాసనం.. వృక్షాసనం శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ఈ ఆసనం చేయడానికి , నిటారుగా నిలబడి కుడి కాలును నేల నుండి పైకి లేపాలి. ఎడమ కాలుపై శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు కుడి కాలు లోపలి తొడపై ఉంచి, అరచేతులతో సపోర్ట్ ఇవ్వాలి. ప్రాణ ముద్రలో ఉన్నప్పుడు చేతులు పైకి ఎత్తాలి. ఈ యోగాను కొంత సమయం పాటు రిపీట్ చెయ్యాలి.                              ◆నిశ్శబ్ద.

వ్యాయామం తరువాత నొప్పులు వస్తున్నాయా...ఇలా చేస్తే చాలు! మహిళల ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిలో వ్యాయామాలు ముఖ్య భాగం. మహిళల్లో ఎముకలు, కండరాలు, గుండె ఊపిరితిత్తులను బలపరుస్తుంది. కానీ వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. మహిళల శరీరంలో కండరాలు ముందే సున్నితంగా ఉంటాయి. అలాంటివారు పొట్ట కొవ్వు తగ్గించుకోడానికో.. నడుము కొవ్వు వదిలించుకోవడానికో.. పిరుదుల పరిమాణం తగ్గించుకోడానికో.. ఇలా కొత్త కొత్త వ్యాయామాలు మొదలుపెడుతుంటారు. ఇలా చేసినప్పుడు కండరాల నొప్పులు, కండరాలు చీలడం వంటి సమస్యలు వస్తాయి.   పోస్ట్-వర్కౌట్ నొప్పులకు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాటించాలి. విశ్రాంతి వ్యాయామం తర్వాత నొప్పిని ఎదుర్కోవటానికి అతి ముఖ్యమైన చిట్కా విశ్రాంతి తీసుకోవడం. కండరాలు కోలుకోవడానికి అవి తిరిగి సాధారణంగా మారడానికి  సమయం కావాలి. అప్పటికే అలసిపోయిన కండరాలను మరింత దెబ్బతీసే ఎలాంటి కఠినమైన వ్యాయామం చేయకుండా ఉండాలి.  స్ట్రెచింగ్.. కండరాల నొప్పులు ఉండకూడదు అంటే దానికి మరొక మార్గం స్ట్రెచింగ్. స్ట్రెచింగ్ బిగుతుగా ఉండే కండరాలను విప్పడంలో వాటి పనితీరు సాధారణంగా మారడంతో సహాయపడుతుంది. ఇది గొంతు ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. హాట్, కోల్డ్ థెరపీ.. హాట్, ఓల్డ్ థెరపీ  వల్ల కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మంచు మంటను తగ్గించడానికి, నొప్పిని అణచడానికి సహాయపడుతుంది. వేడి నొప్పి ఉన్న ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కండరాల నొప్పులతో ఇబ్బంది పడేటప్పుడు ఈ రెండూ ఫాలో అవుతూ ఉండాలి.  మసాజ్.. కండరాలకు మసాజ్ చేయడం కూడా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మసాజ్ వల్ల నొప్పి ఉన్న ప్రాంతంలో రక్త ప్రవాహం పెరుగుతుంది.  హైడ్రేట్ అలసిపోయిన కండరాలు తిరిగి హైడ్రేటెడ్ గా మారడం చాలా అవసరం. నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కండరాలలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. నొప్పులు తగ్గించే ఆహారాలు.. శోథ నిరోధక ఆహారాలు తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. సాల్మన్, గింజలు, ఆకు కూరలు వంటి ఆహారాలు కండరాల నొప్పులు తగ్గించడానికి, కండరాల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి అద్భుతంగా సహాయపడతాయి. నొప్పి నివారణలు తీసుకోవాలి.. నొప్పి తీవ్రంగా ఉంటే, ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణలు మంటను తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఈ నొప్పి నివారిణిలను మితంగా మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం ముఖ్యం.  నిద్ర కండరాల పునరుద్ధరణకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి. శక్తి స్థాయిలను పునరుద్ధరించడానికి నిద్ర సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేలికగా వ్యాయామం చేయాలి.. నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ తక్కువ-ప్రభావ వ్యాయామాలు కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి, ఇవి కండరాలు కోలుకోవడంలో  సహాయపడతాయి. అవగాహతో ఉండాలి.. కండరాల బెణుకులు, గాయాలను నివారించడానికి వ్యాయామం గురించి అవగాహన ముఖ్యమైనది. జీబ్ లో లేదా ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో వారు సూచించిన విధంగా మొదలుపెట్టడం ముఖ్యం. తరువాత కావాలంటే వాటిని ఒక్కరే కొనసాగించుకోవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా..ఈ ఆసనాలు వేస్తే చాలు! కాలం ఏదైనా అమ్మాయిలు స్లీవ్‌లెస్ టీ షర్టులు లేదా టాప్స్ ధరిస్తారు. ఇక  షార్ట్స్ లేదా మినీ డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటుందని అటువైపు దృష్టి సారిస్తారు. కానీ కాళ్ళలో, చేతులలో పేరుకున్న కొవ్వు కారణంగా చాలామంది అధికబరువు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంటారు. కేవలం ఈ స్లీవ్ టాప్స్, మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్ కారణంగా ఇలా జరగడం అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తుంది. కాళ్ళూ, చేతుల్లో కొవ్వు కరగడం కోసం చాలామంది డైటింగ్ మాయింటైన్ చేస్తారు. నిజానికి కొన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫాలో అవ్వాల్సింది డైటింగ్ ప్లాన్ కాదు. ఆ భాగాల్లో కొవ్వు కరిగించే వ్యాయామం ఫాలో అవ్వాలి ఇలా చేతులు, కాళ్ళలో పేరుకున్న కొవ్వు కరిగించడానికి యోగా బాగా పనిచేస్తుంది. యోగా వల్ల పొట్ట, మెడ కొవ్వు తగ్గడంతోపాటు కాళ్లను, చేతులను టోన్‌గా మార్చవచ్చు. అందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే..  వశిష్ఠాసనం.. చేతుల కొవ్వును తగ్గించడానికి వశిష్ఠాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఆసనం నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా ప్లాంక్ పోజ్ లోకి వెళ్ళి. క్రంచెస్ వేసేటప్పుడు ఎలాగైతే చేతులు పాదాల మీద శరీరం బరువు మోపుతూ బ్యాలెన్స్ చేస్తామో అదే ప్లాంక్ పోజ్. . అప్పుడు కుడి వైపున చెయ్యి, కుడి కాలి మీద బరువు ఉంచండి. ఆ తరువాత, ఎడమ కాలు, ఎడమ చేతిని పైకి లేపుతూ, ఎడమ పాదాన్ని కుడి పాదంపై ఉంచాలి. ఎడమ చేతిని మీ తొడలపై ఉంచాలి.  శ్వాస తీసుకుంటూ కొన్ని క్షణాలు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఊపిరి పీల్చుకుంటూ తిరిగి ప్లాంక్ పొజిషన్‌కు రావాలి. ఇదే వశిష్టాసనం.  కోణాసనం.. లావుగా  చేతులతో పాటు తొడల్లో ఉన్న కొవ్వును తగ్గించడానికి కోనాసన సాధన చేయవచ్చు. ఈ ఆసనం వేయడానికి, ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య దూరం ఉంచుతూ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి కదపాలి. శ్వాస వదులుతున్నప్పుడు, వెన్నెముకను వంచి శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, తలను పైకి చూసేలా తిప్పాలి.  ఈ సమయంలో మోచేతులను సరళ రేఖలో ఉంచాలి. గాలి పీల్చేటప్పుడు పాత భంగిమకు తిరిగి వచ్చి, ఊపిరి పీల్చుకుంటూ ఎడమ చేతిని క్రిందికి తీసుకురావాలి.  మాలాసనం.. కాళ్లను సన్నగా చేయడానికి రెగ్యులర్ గా మాలాసనంను ప్రాక్టీస్ చేయవచ్చు. మాలసనం తొడలు, కాళ్ళను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆసనం. ఈ ఆసనం దిగువ శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది, అదనపు కొవ్వును తొలగిస్తుంది. మాలాసనం చేయడానికి, పాదాల మధ్య దూరం ఉంచుతూ తాడాసనం స్థితిలో నిలబడాలి.  స్క్వాట్ పొజిషన్‌లో మోకాళ్లను వంచండి. ముందుకు వంగి రెండు చేతులను వంచి మోకాళ్లను లోపల ఉంచాలి. ఇప్పుడు నమస్కార ముద్రలో చేతులను గుండె దగ్గర ఉంచండి. ఇదే మాలాసనం. ఈ మూడు ఆసనాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే.. అమ్మాయిల కాళ్ళు, చేతులలో కొవ్వు తగ్గి అందంగా నాజూగ్గా మారతాయి.                                      ◆నిశ్శబ్ద.  

మతిమరుపు రావద్దంటే..రోజూ ఈ యోగాసనాలు వేయాల్సిందే!   యోగాసనాలు శరీరంలోని అన్ని భాగాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా యోగాసనాలు మెదడు సక్రమంగా పనిచేయడం, కణాల శ్రేయస్సు నుంచి అన్ని రకాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అల్జీమర్స్ వ్యాధిని నివారించడంతోపాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఏ యోగాసనాలు సహాయపడతాయో చూద్దాం. 1. పద్మాసనం: సంస్కృతంలో పద్మాసనం అంటే తామర పువ్వు అని అర్థం.  అందుకే ఆసనాన్ని లోటస్ భంగిమ అంటారు. ఈ ఆసనం ఒక ధ్యాన భంగిమ, ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది.  విశ్రాంతినివ్వడంతోపాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పద్మాసనం ఉదయం పూట చేయడం మంచిది. ఆసనం వేసే విధానం: -మీ వెన్నెముక నిటారుగా, కాళ్ళను ముందుకి చాచి చదునైన ఉపరితలంపై కూర్చోండి. -మీ కుడి పాదాన్ని వంచి, మీ ఎడమ తొడపై ఉంచండి. ఎడమ తొడపై కుడి పాదాన్ని ఉంచడానికి మీ చేతులను ఉపయోగించండి. అరికాలి పైకి ఎదురుగా ఉండాలి. మడమ పొట్టకు దగ్గరగా ఉండాలి. -అదేవిధంగా, మీ ఎడమ పాదాన్ని వంచి, మీ చేతులను ఉపయోగించి కుడి తొడపై ఉంచండి. అరికాలి పైకి ఎదురుగా ఉండాలి. మడమ పొట్టకు దగ్గరగా ఉండాలి. -గట్టిగా ఊపిరి తీసుకో. తల నిటారుగా, వెన్నెముక నిటారుగా కొన్ని నిమిషాలు ఈ స్థితిలో ఉంచండి. 2. అర్ధమత్స్యేంద్రాసన: ఈ ఆసనాన్ని ఉదయం ఖాళీ కడుపుతో చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. మీరు భోజనం తర్వాత 4 నుండి 5 గంటల తర్వాత కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. మెదడు శక్తి కోసం ఈ యోగాసనాన్ని 30 నుంచి 60 సెకన్ల పాటు చేయవచ్చు. ఆసనం చేసే విధానం: -మీ కాళ్ళను చాచి నిటారుగా కూర్చోండి -పాదాలు వెన్నెముకతో కలిసి ఉండాలి. -ఎడమ కాలును వంచండి. ఎడమ పాదాన్ని కుడి తొడకు దగ్గరగా ఉంచండి. మోకాలిని తీసుకొని కుడి కాలును ఎడమ కాలు మీద ఉంచండి. -మీ భుజాలు, మెడ, తుంటిని కుడి వైపుకు తిప్పండి, కుడి భుజం వైపు చూడండి. -ఎడమ చేతిని కుడి మోకాలిపై,కుడి చేతిని వెనుకకు ఉంచండి. -30 నుండి 60 సెకన్ల వరకు భంగిమను పట్టుకోండి. నెమ్మదిగా, స్థిరంగా శ్వాసను తీసుకోండి. మరొక వైపు అదే ప్రయత్నించండి. 3. వజ్రాసనం: వజ్ర అనేది సంస్కృత పదం. ఈ ఆసనాన్ని డైమండ్ పోజ్ అంటారు. ఈ ఆసనం ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఆసనం సాధన చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ,రిలాక్స్‌గా ఉంటుంది, మీ శరీరం 'వజ్రం'లా బలంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చేసే ఆసనం ఇదే. ఆసనం చేసే విధానం -ముందుగా మోకరిల్లండి. -మీ పాదాలు మీ కాళ్ళకు అనుగుణంగా ఉండాలి, మోకాలు, చీలమండలను ఒకదానితో ఒకటి తీసుకురావాలి. కాలి బొటనవేళ్లు ఒకదానికొకటి తాకాలి. -మీరు మడమల మీద మీ బట్,తొడల మీద తొడలతో కూర్చున్నప్పుడు ఊపిరి పీల్చుకోండి. -మీరు సుఖంగా ఉండే వరకు మీ చేతులను తొడలు, తుంటిపై ఉంచండి. -మీ వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చున్నప్పుడు నెమ్మదిగా పీల్చుకోండి. ముఖాన్ని నిటారుగా ఉంచండి.  

పిల్లలు కలగడం లేదా ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది! పెళ్ళైన ప్రతి జంట తల్లిదండ్రిగా మారాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికాలంలో సంతానలేమి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తల్లి కనాలనే అమ్మాయిల కలలు ఆలాగే ఉండిపోతున్నాయి. ప్రస్తుతకాలంలో ఉన్న జీవన శైలి, ఆహారం విషయంలో జరిగే పొరపాట్లు, మరీ ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమస్యల కారణంగా అమ్మయిలకు గర్భం దాల్చడంలో సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని యోగాసనాలు ఈ సమస్యను దూరం చేస్తాయి. కింద చెప్పుకునే ఆసనాలు వేయడం వల్ల అమ్మయిలలో సంతాన సామర్థ్యము పెరుగుతుంది. ఇందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే.. సూర్య నమస్కారం యోగాసనాలు రుతుక్రమంలో లోపాలు తగ్గించడంలో, మెనోపాజ్ సమయంలో సంభవించే సమస్యలలో సహాయపడతాయి. బహిష్టు నొప్పిని తగ్గించుకోవడానికి సూర్య నమస్కారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్త్రీ గర్భాశయంపై, పిల్లల పుట్టుకపై నెలసరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలసరి విషయంలో సమస్యలు లేకుంటే గర్భం దాల్చడంలో సమస్యలు తక్కువే ఉంటాయి. సూర్య నమస్కారం లైంగిక గ్రంధులను క్షీణించే సమస్య నుండి దూరంగా ఉంచుతుంది. ఇందువల్ల గర్భం దాల్చడంలో సహాయపడుతుంది.  బద్ద కోణాసనం బద్ద కోనాసనను సీతాకోకచిలుక భంగిమ అంటారు. ఈ ఆసనం లోపలి తొడలు, తుంటి ప్రాంతం మరియు మోకాళ్ల కండరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం దృఢంగా మారడంతో సహాయం చేస్తుంది.. బద్ధ కోనాసనం వేయడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది. పశ్చిమోత్తనాసనం పశ్చిమోత్తనాసనం కండరాలను సాగదీస్తుంది.ఈ ఆసనం సాధన చేయడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. బాలసనా సంతానోత్పత్తి సమస్య నుండి బయటపడటానికి, బాలసనాను మంచి మార్గం. ఈ యోగాసనం రక్త ప్రసరణను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఈ ఆసనం ద్వారా వెనుక, మోకాళ్లు, తుంటి మరియు తొడల కండరాలు సాగుతాయి. ఈ ఆసనాలు వేస్తే గర్భం దాల్చే విషయంలో ఇబ్బందులు పడే మహిళలకు తొందరలోనే మంచి ఫలితాలు ఉంటాయి.                                ◆నిశ్శబ్ద.  

  అమ్మాయిల ముఖచర్మం మెరిసిపోవాలంటే.. ఈ మూడు ఆసనాలు వేస్తే సరి! అందంకోసం తపించని అమ్మాంటూ ఉండదు. బ్యూటీ టిప్స్ కావచ్చు, బ్యూటీ క్రీములు కావచ్చు, ఏదైనా బ్యూటీ థెరపీ కావ్చచు.. అందంగా మెరిసే చర్మంతో కనిపిస్తామంటే ఏం చెయ్యడానికైనా సిద్దపడతారు. అమ్మాయిల ముఖ చర్మం ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్, ఏ విధమైన  క్రీములు రాకుండానే మెరిసిపోవాలంటే ఈ కింది ఆసనాలు వెయ్యాల్సిందే.. వీటిని వేస్తే రక్తం శుద్ది అయ్యి చర్మం కాంతివంతంగా మారుతుంది. సర్వాంగాసనం.. సర్వాంగాసనం వేస్తే భుజాలు, వెనుక భాగాలు బలంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే.. మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా ఉంచుకుని మెల్లిగా పైకి లేపాలి. క్రమంగా  తొడలు, పిరుదులు పైకి లేపుతూ వెన్నెముకను పైకి లేపి దానికి సపోర్ట్ గా చేతులతో నడుమును పట్టుకోవాలి. మోచేతులను నేలకు ఆనించి నడుముకు మద్దతు ఇవ్వాలి. ఈ ఆసనంలో మెడ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది వేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖచర్మానికి ప్రసరణ బాగుండటం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. హలాసనం.. హలాసనం చేయడం వల్ల శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీన్నెలా చేయాలంటే.. మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు అరచేతులను నేలకు ఆనేలా ఉంచాలి. నెమ్మదిగా కాళ్లను లేపి 90డిగ్రీలు అంటే లంబకోణంలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీ శరీరం ఎల్ అక్షరం షేపులో ఉంటుంది. లంబకోణంలో ఉన్న కాళ్లను మెల్లిగా వెనక్కు జరుపుతూ కాలి పాదాల వేళ్ళను నేలకు తలిగేలా వంచాలి. ఈ స్థితిలో కాళ్లు రెండూ ఒక్కిటిగా, నిటారుగా ఉంచాలి. నాలుగైదు సార్లు  దీర్ఘంగా శ్వాస తీసుకుని  తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. ఛాతీ, ముఖానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. త్రికోణాసనం.. త్రికోణాసనం వేస్తే ముఖ చర్మం కాంతివంతమవడమే కాదు ఛాతీ, భుజాలు, కాళ్లు రిలాక్స్ అవుతాయి. చేతులు, కాళ్లు, తొడలు దృఢంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే.. మొదటగా కాళ్లను దూరంగా ఉంచి నిలబడాలి. ఇలా నిలబడిన తరువాత  కుడి కాలును 90డిగ్రీలు, ఎడమ కాలును 15డిగ్రీలు తిప్పాలి.  దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ  వదులుతూ రిలాక్స్ అవ్వాలి. శరీరాన్ని కుడివైపుకు వంచాలి. ఇలా వంచినప్పుడు నడుమును నిటారుగా ఉంచాలి. ఎడమ చేతిని పైకెత్తి ఆకాశం వైపుకు సూటిగా ఉంచాలి. కుడిచేతిని కిందకు ఉంచి గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపు కూడా చేయాలి. ఈ మూడు ఆసనాలు వేస్తే ముఖానికి రక్తం సరఫరా మెరుగుపడి ముఖం చర్మం కాంతివంతమవుతుంది. చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.

Benefits Of Shavasana ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం * యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది. * ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత. శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము. శవాసనం చేసే పద్ధతిః * నేలపై తివాచీ లేదా పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ ఒకటి లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. * రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. * ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి. * కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. * విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి. * మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిపిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. * కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పైన కూడ కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక దిగువ భాగాన లేదా పొత్తికదుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. * అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్‍ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు * తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం. * శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది. * మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. * బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది. * శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్‍ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి. * ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది. * దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బున పడిన వ్యక్తుల శరీరం మనస్సు తిరుగి కోలుకుంటుంది. * శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. * నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది.రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. * హృదయ సంబంధనైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. * క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది. * చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Globalization and Yoga Today yoga caters to a cadre of practitioners spanning continents and investigation tens of zillions of adherents. In this two-part playoff, we present address the globalization of hatha yoga with fact connection to Collection and implications of yoga training for musculoskeletal upbeat in antithetic cultures/ethnicities. Bodoni postural yoga started as a fusion of Indweller athletics and elite hatha yoga principles in the old twentieth century, posits Symbol Singleton. Around this minute, yoga was exported to the US from Bharat by Vivekananda and others, experiencing various waves of popularity before incoming at its live omnipresence. As yoga has exponentially grown in the region, it's been re-exported to India igniting a nationalistic fervor, despite umpteen fashionable forms existence inextricably infused with feature cultural norms. "Yoga went to Crockery via America," according to one of B.K.S. Ingra’s superior disciples, Faeq Biria, who routinely trains students in Peking. "They see it from an Denizen repair of scope. At prime, they're attracted by the byproducts: to be pretty, to shorten asymptomatic, quietus symptomless, person a fastidious embody, be agile, short. It's marmoreal human, "yoga is a symbolization of the extracurricular mankind. Suchlike ribbon women on the beach." As in the US, yoga fits fit there with the desire for success. Yet Religion tai chi is entitled, soothing, and rhythmic to alleviate a deeper union to chi; most modernistic yoga conjures images of pretzels, headstands, and additional sport, reminiscent of the competitive environs in which it's marinated. Thus, in a mansion of the times, "hip Hong Kongers would rather ware $35 on a hemorrhage family than course with their grannies." Arguably, modernistic postural yoga, as were its initial iterations, is an evolution reflecting statesman of the modern social discourse than anything ancient and imperishable. Yet piece the version and thought of yoga may possess denaturized, umpteen of the gymnastics, Asian poet discipline, and exercise?

 సింపుల్ గా బరువు తగ్గడానికి భలే ఆసనం ఇది..! బరువు తగ్గడానికి చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. వెయిల్ లాస్ అవుతున్నవారిని చూసి బాబోయ్.. వీళ్లు ఇంతలా బరువు ఎలా తగ్గుతున్నారు అని ఆశ్చర్యపోతుంటారు. అయితే బరువు తగ్గడం అనేది కేవలం రోజులు, వారాలలో జరిగేది కాదు. దీనికి ఆహారం నుండి శారీరక శ్రమ వరకు ప్రతీది ముఖ్యమే. ఇకపోతే జిమ్ లో కసరత్తులు చేయడం కన్నా.. మన భారతీయ ఆయుర్వేద ఋషులు ప్రసాదించిన యోగా బరువు తగ్గడానికి ఎంతో మిన్న. యోగాలో ఉన్న ఎన్నో ఆసనాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్రమం తప్పకుండా ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.  అలాంటి ఆసనాలలో తాడాసనం కూడా ఒకటి. తాడాసనం ప్రతిరోజూ వేస్తే సింపుల్ గా బరువు తగ్గేయచ్చట. ఈ ఆసనం ఎలా వెయ్యాలో తెలుసుకుంటే.. తాడాసనం అనేది ముఖ్యంగా సంస్కృత పదం. సంస్కృతంలో తడ అంటే పర్వతం. ఆసనం అంటే భంగిమ లోదా పోజ్. దృఢమైన పర్వతంలా ఈ ఆసనం భంగిమ ఉండటంతో దీన్ని తాడాసనం అని అంటున్నారు. తాడాసనం ఎలా వేయాలంటే.. తాడాసనం వేయడం చాలా సింపుల్. మొదట రెండు పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి.   ఇప్పడు రెండుచేతులను తలకంటే పైకి తీసుకెళ్లాలి. తరువాత రెండు చేతివైళ్లను ఒకదాని మధ్యన ఒకటి ఉంచి చేతులను కలిపి ఉంచాలి. ఇలా కలిపిన రెండు చేతులను ముందుకు తిప్పి చేతులను పైకి ఆకాశం వైపు చూపించాలి. ఇలా చేసినప్పుడు చేతులను వీలైనంత పైకి సాగదీయాలి. ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.  ఇదే సమయంలో  నిలబడుకున్నవారు కాస్తా పాదాల మునివేళ్ల మీద నిలబడాలి. ఈ భంగిమలో 20 నుండి 30 సెకెన్లు లేదా వీలైనంత సమయం ఈ భంగిమలో ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ సాధారణ స్థితికి రావాలి. తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా వెయ్యాలి. ఇలా వేయడం వల్ల శరీరాకృతి మంచిగా తయారవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంతేకాదు.. తాడాసనం వేయడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. శరీరాకృతి.. తాడాసనం వేయడం వల్ల శరీరాకృతి మెరుగవుతుంది. చాలామందికి కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు భుజాలు కిందికి వాలిపోయినట్టు అవుతుంటాయి. దీన్ని పెద్దలు గూని అని అంటూంటారు. ఈ గూని సమస్యను తాడాసనం వేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదే విధంగా వెన్ను నొప్పి సమస్య కూడా తగ్గుతుంది. పిల్లలు ఎత్తు పెరుగుతారు.. చిన్న పిల్లలతో తాడాసనం వేయించడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు. శరీరం సాగదీయడం వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడే గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి బాగుంటుంది. ఎదిగే వయసులో పిల్లలు ఈ ఆసనం వేసేలా చూడాలి. మానసిక ఆరోగ్యం.. మహిళలలో మానసిక సమస్యలు సాధారణంగానే ఎక్కువ. దీనికి కారణం హార్మోన్ అసమతుల్యత, నెలసరి సమస్యలు, గర్భధారణం, ప్రసవం, మెనోపాజ్ వంటివి. వీటి వల్ల ఎదురయ్యే మానసిక సమస్యలు తాడాసనం వేయడం వల్ల కంట్రోల్ లో ఉంటాయి. దీన్ని రోజూ ఆచరిస్తుంటే నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. శ్వాసక్రియ.. తాడాసనం వేయడం వల్ల శ్వాస క్రియ బాగుంటుంది. శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. దీర్ఘంగా ఊపిరితీసుకోవడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. బరువు.. అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గడంలో తాడాసనం బాగా సహాయపడుతుంది.  రోజూ తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా ప్రాక్టీస్ చేస్తుంటే శరీరంలో కేలరీలు సులువుగా బర్న్ అవుతాయి. ఇది శరీరం మొత్తాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.                                                     *నిశ్శబ్ద.

మలాసనంతో  మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం! భారతీయ మహర్షులు ముందుతరాలకు అందించిన గొప్ప  సంపద యోగ అని చెప్పవచ్చు. ఈ యోగాలో బోలెడు ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలలో ఒక్కోదానికి ఒక్కో విధమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడంటే ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయ్లెట్ లు వచ్చాయి. కానీ అంతకుముందు ప్రతి ఇంట్లో మలవిసర్జన మోకాళ్ల మీద కూర్చున్న భంగిమలోనే ఉండేది. ఇలా మోకాళ్లు మడిచి మలవిసర్జనకు వెళ్లడం వల్ల కడుపు కండరాల మీద ఒత్తిడి పడి మల విసర్జన సాఫీగా జరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అయితే ఈ ఇలా మల విసర్జనకు వెళ్లే భంగిమలో కూర్చోవడాన్ని మలాసనం అని పేర్కొంటున్నారు. మలాసనం వేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మలాసనాన్ని గర్భవతులు కూడా వేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. గర్భిణులు, జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, కడుపునొప్పితో ఇబ్బంది పడేవారు కూడా మలాసనం వేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. మలాసనం వేస్తే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పూర్తీగా ఆరోగ్యంగా మారుతుంది. ఈ  ఆసనంలో కూర్చున్నప్పుడు పేగుల మీద ఒత్తిడి కలిగి పేగుల కదలిక ఆరోగ్యంగా మారుతుంది. పేగు కదలికలు బాగుంటే ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది. మలాసనం వేయడం వల్ల నడుము దృఢంగా మారుతుంది. దీన్ని క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి. నడుము కండరాలు బాగా గట్టిపడతాయి. నడుము నొప్పి ఉంటే క్రమంగా తగ్గుతుంది. ఇప్పట్లో చాలామంది మహిళలు పీసీఓయస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మలాసనం వేయడం వల్ల ఈ పీసీఓయస్ సమస్య తగ్గుతుంది. పీసీఓయస్ కారణంగా మహిళలలో సంతానోత్పత్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మహిళలు మలాసనం వేస్తుంటే ఈ సమస్యలు ఉండవు. మహిళలలో నడుము, నడుము కింద భాగాలు బలహీనంగా ఉంటాయి. ఇవి నెలసరి వల్ల కావచ్చు, ప్రసవాలు, ఆపరేషన్లు, అబార్షన్లు ఇలా చాలా కారణాలు కావచ్చు. కానీ వీటన్నింటికి మలాసనం చెక్ పెడుతుంది. నడుమును, నడుము కింది భాగాలను బలంగా మారుస్తుంది. మహిళలలో యోని ప్రాంతం ఆరోగ్యంగా ఉండటానికి మలాసనం సహాయపడుతుంది. యోని కండరాలు దృఢంగా మారతాయి. నెలసరిలో ఇబ్బందులు, లైంగిక సమస్యలు తగ్గుతాయి. మానసిక సమస్యలున్నవారికి కూడా మలాసనం గొప్ప ఊరట. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.                                         *నిశ్శబ్ద.

పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి! ఆడవారికి నెలసరి అనేది సాధారణం. ఒక వయసులో ఋతుచక్రం మొదలయ్యాక  ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కోవాల్సింది. ఇది ఒక నెలతోనో, ఒక ఏడాదితోనో ముగిసేది కాదు. కొందరికి నెలసరి సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలేంటో తెలుసుకుంటే.. బలాసనం.. బలాసనం వేయడం చాలా సులువు.  మోకాళ్లమీద  పాదాలకు పిరుదులు తగిలేలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అని అంటారు. ఇప్పుడు ముందుకు వంగి తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ పొడవుగా చాపాలి. ఈ స్థితిలో 10నిమిషాల సేపు ఉండవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మానసిక సమస్యలు, జీర్ణసమస్యలుంటే తగ్గుతాయి. నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పశ్చిమోత్తానాసనం.. వెన్నెముకను వంచి చేసే ఆసనం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పద్మాసనంలో కూర్చుని పాదాలను ముందుకు చాపాలి. ఇప్పుడు తలను కిందకు వంచి మోకాళ్లకు తల తగిలేలా వంగాలి. ఈ ప్రయత్నంలో రెండు చేతులను ముందుకు చాపి పాదాలను అందుకోవాలి. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోతుంది. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది.  నెలసరి సమయంలో కలిగే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు  తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది. సీతాకోక చిలుక భంగిమ.. సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల దీన్ని సీతాకోక చిలుక భంగిమ అని అంటారు.  పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లను ఎడంగా చేసి రెండు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు చేత్తో రెండు పాదాలను పట్టుకుని మోకాళ్లను సీతాకోక రెక్కల్లా ఆడించాలి. దీని వల్ల యోని కండరాలు బలపడతాయి. యోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నెలసరి సమయంలో కడుపునొప్పి నుండి ఉపశనం లభిస్తుంది. శవాసనం.. శవాసనం సాధారణంగా యోగా లేదా వ్యాయామాలు చేసిన తరువాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి   వేస్తారు. అయితే మహిళలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటే శరీరాన్ని రాలాక్స్ గా వదులుగా ఉంచి శవాసనం భంగిమలో ఉండాలి. కాళ్లు, చేతులు, శరీరంలో కండరాలు వదులుగా ఉండటం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది కడుపునొప్పిని తగ్గిస్తుంది.                                                  *నిశ్ళబ్గ.

సీతాకోకచిలుక ఆసనం.. మహిళల చింతలన్నీ మాయం! యోగాలో ఆసనాలు బోలెడు. ఈ ఆసనాలు కూడా మహిళలకంటూ కొన్ని ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. వీటిని వేయడం వల్ల మహిళ అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మహిళలకు పెళ్లి, ప్రసవం, ఆ తరువాత మెనోపాజ్ వంటి కారణాల వల్ల శరీరంలో చాలా అసౌకర్యాలు ఏర్పడతాయి. వాటిలో కొన్నింటికి సీతాకోక చిలుక ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. వెన్నునొప్పి.. చాలామంది మహిళలు వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనికి సీతాకోకచిలుక ఆసనం చక్కని పరిష్కారం.  ప్రతిరోజూ సీతాకోకచిలుక ఆసనం ఫాలో కావడం వల్ల వెన్ను నొప్పి ఈజీగా తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, తలనొప్పి.. మానసిక ఒత్తిడి, తలనొప్పి మహిళల జీవితంలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వారు అనారోగ్య సమస్యలు లెక్క చేయకుండా ఇంటి పనులలోనూ, భర్త  పిల్లలను చూసుకోవడంలోనూ మునిగిపోతారు. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి కాస్తా మానసిక సమస్యలుగా రూపాంతరం చెందుతాయి. పదే పదే తలనొప్పి కూడా వస్తుంది. అదే సీతాకోకచిలుక ఆసనం వేస్తే ఇవి తగ్గిపోతాయి. నడుమునొప్పి.. ప్రసవం తరువాత, నెలసరి సమస్యలున్న మహిళలు చాలావరకు నడుము నొప్పితో ఇబ్బందులు పడుతుంటారు. సీతాకోకచిలుక ఆసనం ఈ నడుమునొప్పికి చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చేస్తే నడుమునొప్పి సమస్య తగ్గిపోతుంది. బలం.. చాలామందికి హిప్స్ బలహీనంగా ఉంటాయి.  మరికొందరికి హిప్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. హిప్ ప్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.  సీతాకోకచిలుక ఆసనం వేస్తే హిప్స్ కు బలం చేకూరడంతో పాటు హిప్స్ ఫ్యాట్ తగ్గి మంచి ఆకృతిలోకి వస్తాయి. సీతాకోకచిలుక ఆసనం.. యోగా మ్యాట్ లేదా దుప్పటి పరుచుకుని దాని మీద పద్మాసనంలో కూర్చోవాలి. కాళ్లు రెండూ పొడవుగా చాపి కాళ్లు దగ్గరగా చేసి కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్లను మడుస్తూ కాలి పాదాలు రెండూ ముందుకి  తీసుకురావాలి. రెండు కాళ్ల పాదాలు ఎదురెదురుగా కలుసుకుని ఉండాలి. ఈ పొజిషన్ లో అలాగే ఉండి రెండు పాదాలను చేతులతో పట్టుకుని తొడల నుండి మోకాళ్లను పైకి కిందకు లేపుతూ సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్టు ఆడించాలి. ఈ ఆసనాన్ని  రోజూ చేస్తుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ ఉంటాయి.                                         *నిశ్శబ్ద.

హలాసనంతో భలే లాభాలు.! యోగాతో  శరీరం చాలా ఫిట్ గా మారుతుంది. చాలామంది జిమ్ లో కసరత్తులు చేస్తారు, బరువులు ఎత్తుతారు, డైట్ ఫాలో అవుతారు. చాలా కష్టపడతారు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫలితాలు యోగా చేస్తే లభిస్తాయి. యోగాలో ఆసనాలు, ధ్యానం, శ్వాసవ్యాయామాలు ఇలా అన్ని ఉంటాయి. ఒక్కో ఆసనం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది. యోగాలో ఉన్న ఆసనాలలో హలాసనం కూడా ఒకటి. హలము అంటే నాగలి. పొలాన్ని దున్నే నాగలి భంగిమలో ఉండటం వల్ల దీన్ని హలాసనం అని అంటారు. మహిళలు హలాసనం వేస్తే బోలెడు లాభాలుంటాయి.  ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలో.. దీని వల్ల కలిగే లాభాలేంటో  తెలుసుకుంటే.. హలాసనం వేసే విధానం.. హలాసనాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే వెయ్యాలి. మొదట ప్రశాంతమైన ప్రదేశంలో దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. యోగా మ్యాట్ మీద వెల్లికిలా పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు కాళ్లు రెండూ పక్కపక్కనే ఆనుకుని ఉండాలి. చేతులు నడుముకు రెండు వైపులా అరచేతులు నేలకు తాకుతూ చాపుకుని ఉండాలి. శరీరాన్ని బిగించినట్టు కాకుండా వదులుగా రిలాక్స్ గా పడుకోవాలి. రిలాక్స్ గా పడుకున్నప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి  లంబకోణంలోకి తీసుకునిరావాలి. ఇప్పుడు కాళ్ల పాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. కాళ్లు ఇలా లంబకోణంలోకి తెచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు పాదాలను క్రమంగా వెనక్కు వంచుతూ పాదాలను తల వెనుకకు తీసుకెళ్ళాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. హలాసనం వల్ల కలిగే లాభాల.. హలాసనం శరీరాన్ని, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్నెముక, భుజాలు బాగా బెండ్ అవుతాయి. ఈ కారణంగా వెన్ను నొప్పి, భుజాలనొప్పి వంటి సమస్యలున్న వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. థైరాయిడ్ పనితీరు దెబ్బతింటే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అయితే హలాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా మారుతుంది. ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఉంటే కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. కానీ హలాసనం వేస్తే ఒత్తిడి, అలసట దూరమై మంచి నిద్ర సొంతమవుతుంది. హలాసనం వేసే క్రమంలో పొత్తి కడుపు కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ కారణంగా పొత్తికడుపు కండరాలు బలంగా మారుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలుంటే అవి తగ్గుతాయి. శరీరంలో కండరాలన్నీ ఈ ఆసనం వేసేటప్పుడు పనిచేస్తాయి. ఈ కారణంగా శరీర కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. చెడు కొలెన్ట్రాల్ తగ్గుతుంది. హలాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు దరిచేరవు.                                                      *నిశ్శబ్ద.  

 యోగాతో హెర్నియేటెడ్ డిస్క్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే.. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య వెన్నునొప్పి. వెన్ను నొప్పితో బాధపడే చాలామంది మూవ్ లేదా పెయిన్ కిల్లర్ వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే ఈ వెన్ను నొప్పి సాధారణమైనది కాకపోవచ్చు.  హెర్నియేటెడ్ డిస్క్ సమస్య కావచ్చు. వెన్నుపూస మధ్య ఉన్న డిస్క్‌లు విడిపోయినప్పుడు,  డిస్క్ లోపలి భాగం పొడుచుకు వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది పక్కనే ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఇంటర్‌వర్‌టెబ్రల్ డిస్క్‌లు కుదించబడి, బయటికి ఉబ్బడం ప్రారంభించినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో చీలిక ఏర్పడినప్పుడు హెర్నియేటెడ్ డిస్క్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు, కాళ్ళు, వీపు రెండూ ప్రభావితమవుతాయి. ఈ నొప్పి కదలికల ద్వారా తీవ్రమవుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ ప్రధాన కారణాలు : వయస్సు, ధరించే దుస్తులు , కుంగిపోవడం కూడా వెన్నెముక క్షీణించడానికి కారణమవుతుంది. ప్రమాదాలు జగినప్పుడు వెన్నుభాగంలో గాయాలు కావడం ఈ సమస్యకు కారణం అవుతుంది. క్రీడలకు సంబంధించిన గాయాలు ప్రభావం చూపిస్తాయి. నిశ్చల జీవనశైలి కలిగిన మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. యోగాలో మూడు రకాల భంగిమలు వెన్నెముక అమరికపై దృష్టి సారిస్తాయి.  ప్రభావిత ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, ఇది నొప్పిని,  అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉష్ట్రాసనం.. ఒంటెను సంస్కృతంలో ఉష్ట్రము అని అంటారు. అందుకే దీన్ని ఒంటె భంగిమ లేదా కామెల్ పోజ్ అని కూడా అంటారు. ఈ భంగిమ ద్వారా వెన్నెముక దృఢంగా మారుతుంది. దీన్ని ఎలా చేయాలంటే.. ఒంటె భంగిమలోకి రావడానికి, నేలపై మోకరిల్లి, ఆపై రెండు చేతులను  తుంటిపై ఉంచాలి.  పాదాల పై భాగం చాప మీద ఉండాలి. ఇప్పుడు వెన్నెముకను పొడిగించాలి.  మడమల మీద రెండు చేతులను ఉంచుతూ నెమ్మదిగా వెనుకకు వంచాలి.  మెడను చాచి తలను వెనుకకు వంచాలి. తరువాత, రెండు చేతులను అరికాళ్ళకు తాకుతూ ధనస్సులా వెనక్కు వంగాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. శలభాసనము.. ఈ భంగిమ మిడతను పోలి ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి. ఇందుకోసం యోగా మ్యాట్ లేదా మెత్తగా ఉన్న దుప్పటి వంటిది ఉపయోగించాలి. బోర్లా పడుకుని చేతులు  కిందకు చాపాలి. నేలపై  నుదిటిని ముఖాన్నిఆనించి కాస్త  విశ్రాంతి తీసుకోవాలి.  ఊపిరి పీల్చుకున్నప్పుడు,  ఛాతీ, తల, కాళ్ళు  చేతులను నేల నుండి పైకి ఎత్తాలి. ఈ సమయంలో  కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.  చేతులు ఇరువైపులా  ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోవాలి. తరువాత,  కాళ్ళను,వేళ్లను వీలైనంతగా సాగదీయాలి. ఇది చేస్తున్నంతసేపు శ్వాస పీల్చడంపై దృష్టి పెట్టాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి. భుజంగాసనం.. సంస్కృతంలో పామును భుజంగం అంటారు. ఈ ఆసనం నాగుపాము నిలబడినట్టు ఉంటుంది. నేలపై పడుకుని రెండు అరచేతులు చదునుగా  భుజాల క్రింద ఉంచుకోవాలి. పాదాల పైభాగం  నేలపై ఫ్లాట్‌గా ఉండాలి. ఆపై బొడ్డు బటన్‌ను లోపలికి తీసుకుంటూ పెల్విస్ విభాగాన్ని బిగుతుగా చేయడం  ద్వారా పొట్ట కండరాలను  బిగించాలి. ఇప్పుడు అరచేతులను నొక్కుతూ వేళ్లను సాగదీయాలి. భుజం అంచులు ముందుకు వంచుతూ  భుజాలను వెనక్కి లాగాలి.  శరీర  పైభాగంలో  మొండెం ఉపరితలం నుండి  చేతులను నిఠారుగా ఉంచాలి. ఇప్పుడు పాదాలు, కాళ్ళను నేలపై గట్టిగా  ప్రెస్ చేయాలి.  గడ్డం పైకి వంచి, ఛాతీని పైకి ఎత్తాలి. ఇదే భుజాంగాసనం. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి. ఈ మూడు ఆసనాలు ప్రతిరోజూ  వేస్తుంటే  డిస్క్ సమస్యలు తగ్గుతాయి.                                                       *నిశ్శబ్ద

గుండె సమస్యలు ఉంటే ఈ  4 యోగాసనాలు వేయకూడదు..!! శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాసనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. రోజూ యోగా చేయడం  దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిపుణులు కూడా ఇవే సలహా ఇస్తున్నారు.  యోగా అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ సమతూకంగా ఉంటాయి .కానీ నిపుణుల సలహా తీసుకోకుండా కొన్ని యోగా వ్యాయామాలు చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. యోగా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే యోగా వ్యాయామాలు చేయడం మంచిది. మీకు తోచినట్లు ఏదొక ఆసనం వేసినట్లయితే.. మరో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యోగాసనాలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో యోగా పాత్ర మరువరాదు.  యోగాసనాల ద్వారా అనేక రకాల గుండె సమస్యలు పరిష్కారమవుతాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే రోజూ కొన్ని యోగాభ్యాసాలు పాటిస్తే గుండెకు హాని కలుగుతుందని మీకు తెలుసా?  మరి అలాంటి యోగాసనాలు ఏంటో చూద్దాం... చక్రాసనం: సాధారణంగా, యోగా నిపుణులు వెన్నునొప్పి లేదా వెన్నుపాముకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నవారు చక్రాసనానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. అదేవిధంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహంతో బాధపడేవారు ఈ చక్రాసన యోగాభ్యాసం చేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని తేట్ చక్రం పద్ధతిలో ఉంచుతుంది కాబట్టి దీనిని చక్రాసనం అంటారు. ఈ ఆసనాన్ని అభ్యసిస్తున్నప్పుడు, శరీరం, గుండె రెండింటిపై అధిక ఒత్తిడి పడి, శ్వాస రేటు కూడా పెరుగుతుంది. ఇవి గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు.. ఈ యోగాభ్యాసం చేయకపోవడమే మంచిది. శీర్షాసన: శీర్షాసనం చేయడం అంత ఈజీ కాదు. ఈ యోగాభ్యాసం చేసే వ్యక్తి తన తలను నేలపై ఉంచి రెండు కాళ్లను పైకి ఎత్తాలి. అంటే మీరు తలక్రిందులుగా నిలబడాలి, మీ తల క్రిందికి, మీ కాళ్ళను పైకి ఉంచాలి. మీ శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయాలి. ఈ యోగాభ్యాసం సమయంలో రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండెపై విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హలాసనం: హలాసాన్ని నీల భంగి అని కూడా అంటారు. ఈ యోగాను అభ్యసించే వ్యక్తి ఉదర కండరాలపై పీల్చేటప్పుడు, నొక్కినప్పుడు నేల నుండి పాదాలను పైకి ఎత్తాలి. అటువంటి సందర్భంలో, వ్యక్తి గుండె శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణను కలిగిస్తుంది కాబట్టి, ఇక్కడ రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, గుండె ప్రాంతానికి రక్త ప్రసరణ పెరిగే అవకాశం ఉంది, తద్వారా గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఈ యోగాసనాలు వేయకూడదు. కరణిఆసనం: నేలపై పడుకుని రెండు పాదాలను గోడలపై ఉంచి చేసే యోగాభ్యాసం ఇది. కానీ ఇలా చేయడం వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని, రక్త ప్రసరణ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.-అందుకే ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కరణి యోగాను అతిగా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సూర్య నస్కారాలు వాటి ఉపయోగాలు! ఇప్పుడున్న ఊరుకులపరుగుల జీవితం లో ఆరోగ్యం మీద శ్రద్ద లేకుండా పోతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒత్తిడికి గురవడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రోజు ఒక అరగంట వ్యాయామానికి సమయం కేటాయించడం వలన అందం, ఆరోగ్యం రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ వ్యాయామాలు ఏంటో? వాటివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం . సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. * జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.. ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడంవల్ల .. జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఇది పేగులోలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ముందుగు వంచడం, సాగదీయం వల్ల.. పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్‌ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. రోజూ సూర్య నమస్కారం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. * బరువు తగ్గుతారు.. ఒక సెట్‌ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం నుంచి అదనపు కేలరీలు, కొవ్వును బర్న్‌ చేస్తుంది. సూర్యనమస్కారాలు వేగంగా చేయడం వల్ల.. వేగంగా బరువు తగ్గవచ్చు. ఇవి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి. * పీసీఓఎస్‌ తగ్గిస్తుంది.. సూర్యనమస్కారాలు 12 వారాల పాటు 10 - 15 నిమిషాలు చేస్తే.. సాధారణ వ్యాయామాల కంటే.. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పిన పీరియడ్స్‌ను.. సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీసీఓఎస్‌కు ఒత్తిడి హార్మన్‌ పెరగడం కూడా ఓ కారణం. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు.. క్రమతప్పకుండా సూర్యనమస్కారాలు ప్రాక్టిస్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది, అదనపు కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు విడుదల చేస్తుంది. స్ట్రెస్‌ తగ్గిస్తుంది.. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సూర్యనమస్కారాలలోని లోతైన శ్వాస ప్రక్రియలు.. నాడీ కణాలను రిలాక్స్‌ చేస్థాయి. ఇవి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతాయి. రోజూ సూర్య సమస్కారాలు చేయడం వల్ల.. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. * మెరిసే చర్మం మీ సొంతం.. సూర్య నమస్కారాలు.. సౌందర్య సంరక్షణలోనూ సహాయపడతాయి. ఈ ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖానికి ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సూర్యనమస్కారాలు నిద్రను ప్రేరేపిస్తాయి, విశాంతిని అందిస్తాయి, జీర్ణక్రయను మెరుగుపరుస్తుంది. సూర్యనమస్కారాలు.. వేగంగా చేస్తే చెమట ఎక్కువగా పడుతుంది. చమట ద్వారా చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. మీ చర్మం తాజాగా మారుతుంది * వీళ్లు వేయకూడదు.. గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయకూడదు. హైపర్‌టెన్షన్‌, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఉన్నావారు, గతంలో స్ట్రోక్‌కు గురైనవారు సూర్యనమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి ఉన్నవారు సూర్యనమస్కారాలు చేయవద్దు.