ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు.. మహిళలకున్న బోలెడు సమస్యలు మాయం!

శారీరక సమస్యలను తగ్గించడంలో ఆసనాలు బాగా సహాయపడతాయి. మహిళలలో ఎక్కువగా వెన్ను నొప్పి, సయాటికా, నాడీ వ్యవస్థ బలగీన పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి కారణంగా రోజువారి పనులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలు తగ్గడానికి వైద్యులను కలిసి బోలెడు మందులు  కూడా వినియోగిస్తుంటారు. అయితే వీటన్నింటిని కేవలం ఒకే ఒక్క ఆసనం సెట్ చేస్తుంది. అదే సేతుబంధాసనం. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా వెయ్యాలి?  దీని ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

*సేతుబంధాసనం..

సేతుబంధాసనం వెయ్యడం సులభమే..

మొదట వెల్లికిలా పడుకోవాలి. ఆ  తరువాత కాళ్లను మోకాళ్ల దగ్గర వంచి పాదాలను దూరం జరపాలి. ఇలా జరిపినప్పుడు వంచిన కాళ్ల మద్య గ్యాప్ ఉంటుంది.

ఇప్పుడు చేతులతో పాదాల చీలమండలు పట్టుకోవాలి.  ఒకవేళ చేతులకు చీలమండలు అందకపోతే చేతులను తొడల దగ్గర నేలపై ఉంచాలి.

ఊపిరి తీసుకుని వదులుతూ కడుపును లోపలికి తీసుకోవాలి.

తలను భుజాలను నేలపై ఉంచి కాళ్లపై బరువు మోస్తూ మెల్లిగా నడుమును పైకి ఎత్తాలి.

పై స్థితిలోకి వచ్చినప్పుడు గడ్డం   ఛాతీని తాకుతుంది.

ఈ పొజీషన్లోకి వచ్చాక సాధారణ శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు ఆ భంగిమలో ఉండాలి. ఆ తరువాత శ్వాస వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.

ఈ ఆసనాన్ని నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చెయ్యాలి.


*సేతుబంధాసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది, నడుము కండరాలు అనువుగా మారతాయి.  

మోకాళ్లు, తొడలు,  కోర్ కండరాలు బలాన్ని పొందుతాయి.

వెన్నునొప్పి, స్లిప్ డిస్క్,  సయాటికా నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

వెన్నెముక బెండ్ కావడం, బోలు ఎముకల వ్యాధిలో ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, ప్రేగులు, మూత్రపిండాలు, కాలేయం, ప్లీహము, పురీషనాళం,  మూత్రాశయాన్ని బలపరుస్తుంది.

ఇది అడ్రినల్, థైమస్, థైరాయిడ్,  పారాథైరాయిడ్ గ్రంధులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్త్రీలలో అండాశయాలు,  గర్భాశయ బలాన్ని పెంచుతుంది.  రుతుక్రమం లోపాలను తొలగిస్తుంది.

గమనిక: హెర్నియా, అల్సర్, మెడ నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.

                                          *నిశ్శబ్ద.