Childcare: Dine with your children! Meal time is a treasured time for the whole family. It is one of the times when family bonding plays a major role and gets rewarded too. Once the Children are old enough to go to schools, lunch time is not atall considered in an all- family schedule, but Dinners come with joyous moments. It can be a very stressful day for the parents, an extremely boring or tiresome day for the children too, but having dinner together can be relaxing and helps ward off those gloomy feelings. A University study shows that children involved in regular family mealtimes tend to possess healthier weight, eat healthier, and have greater academic achievement, improved psychological wellbeing and positive family interactions. Findings from the study paper suggest scheduling atleast three family meals per week. The key: Family Time. Whether its breakfast, lunch or dinner, focus on connecting through pleasant conversation and questions about the kids' school life, work, friends and other interests. Healthy kids make a Happy family!! .....Prathyusha Talluri
బుడుగులే మనకి గురువులు మన ఇంట్లో ఉండే పసివాడికి తినటం, తాగటం, నడవటం, చదవటం, రాయటం ఇలా ఎన్నెన్నో నేర్పిస్తుంటాం మనం. వాడు ఎంత వాడైనా ఏదో ఒకటి వాడికి నేర్పించేది మిగిలే వుంటుందని గాఢంగా నమ్ముతాం, నేర్పిస్తుంటాం. వాడికి నేర్పింది, నేర్పించేది, నేర్పించబోయే దాని గురించి మనం బోల్డంత నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. అది సరే.... మరి మనం ఆ పసివాడి నుంచి నేర్చుకునేది ఏదీ లేదంటారా? ఆ నవ్వులు, ఆనందం, ఆశ్చర్యపడటం, లేవటం, ప్రేమ... ఇవన్నీ మనం వాడి దగ్గర నేర్చుకోవల్సినవి కావా? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటూ పెద్ద పెద్ద వర్క్ షాపులలో నేర్పించేది గమనిస్తే అచ్చం మనం పసివాడు అలాగే చేస్తున్నాడని మురిసిపోక తప్పదు. రూపాయి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా వాడు రోజూ మనకి నేర్పించే పాఠాలు. ఈ రోజు ఆ పాఠాల్లోని విశేషాలని తెలుసుకుందాం. పిల్లలు నేర్పే పాఠాలెన్నో... చంటివాడు పాకటం, నుంచోవటం, నడవటం నేర్చుకునేటప్పుడు వాడిని గమనించండి.. ప్రయత్నిస్తాడు... సాధ్యం కాదు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒకోసారి పడతాడు, తిరిగి లేస్తాడు, ఏమైనా చివరికి అనుకున్నది సాధిస్తాడు. అంతేకానీ మధ్యలోనే నావల్ల కాదని చతికిలపడడు. నాకిక రాదేమోనని నిరుత్సాహపడడు. వస్తుందనే నమ్మకం వాడిని ప్రయత్నించేలా చేస్తుంది. నేర్చుకోవటాన్ని వాడు శిక్షగా భావించడు. ఆనందంగా నేర్చుకోవటం మొదలుపెడతాడు. అలా అని పాకటం నేర్చుకున్న తర్వాత ఇక ఊరికే వుంటాడా! ఇక అప్పుడు నడవటానికి ప్రయత్నిస్తాడు. నడక వచ్చిందని ఆగిపోక పరుగులు పెట్టడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ నేర్చుకోవటానికి ఫుల్ స్టాపులు, కామాలు ఉండవు. ఇది జీవిత పాఠం కాదంటారా? ఆత్మవిశ్వాసం చిరునామాలు... పిల్లలు ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారిని గమనించండి. ఇష్టంగా ప్రేమతో నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలకి ఏదైనా త్వరగా వస్తుంది. తమకి ఏమీ తెలియదన్న అమాయకత్వం వారికి అన్ని నేర్పిస్తే, మనకి చాలా తెలుసు అనీ అహంభావం మనల్ని నేర్చుకున్నవి కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందుకే ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా ముందు పసిపిల్లలంతస్వచ్ఛంగా జిజ్ఞాస కలిగి వుండాలి మనం. ఇక మరో ముఖ్య విషయం మనం పిల్లల నుంచి నేర్చుకోవలసినది ఆత్మవిశ్వాసం. పిల్లల్ని ఏమడిగినా ‘‘వచ్చు’’ అనే సమాధానం చెబుతారు. వాడు గీసే పిచ్చిగితల్నే గొప్ప బొమ్మ అని నమ్ముతాడు. పదిమందికి చూపిస్తాడు. కానీ మనమో...ఆత్మన్యూనత, సొంత సామర్థ్యంపై అపనమ్మకం, ఓటమి అంటే భయంవంటి వాటిని వదలకుండా పట్టుకుంటాం. ఏం సాధించాలన్నా ముందు కావలసినది ఆత్మవిశ్వాసం. ఇది మనం పిల్లల నుంచి నేర్చుకు తీరాల్సిన పాఠం. పిల్లలంటే ఆనందపు గనులు... మీకు బాగా సంతోషం కలిగిన సందర్భం ఏది అని ఎవరైనా అడిగితే మన సమాధానం ఏంటి. ఎప్పటివో ఒకటి రెండు సంఘటనలు గుర్తు చేసుకుని చెబుతాం. అదే పిల్లల్ని అడిగితే ప్రతీరోజూ వారికి ఆనందం కలిగించే విషయాలు ఎన్నో వుంటాయి.అవి కాకుండా చిన్నచిన్నవే ఫ్రెండ్‌కి పెన్సిల్ ఇవ్వటం నుంచి రోడ్డుపై కనిపించిన కుక్కపిల్లతో ఆడుకోవటం దాకా ఎన్నిటికో అందులో చోటుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయం అబ్బురమే. ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు, వీచే చల్లటి గాలి... అన్నీ తమకోసమే ప్రత్యేకం అన్నంత ఆనందం వారి స్వంతం. మనకి ఆనందం కలిగించే విషయాలు అంటూ కొన్నిటిని నిర్ణయించుకుని, వాటితోనే ఆనందాన్ని ముడిపెట్టి, గిరిగిసుకుని కూర్చుంటాం కాబట్టే ఆనందాల వెలితి మనల్ని వెంటాడుతుంది. ఈ పాఠం మనం నేర్చుకోవాలి... పసివారి బోసినవ్వులంత స్వచ్చంగా మన నవ్వులు విరియలంటే వారంత స్వచ్ఛంగా మన మనసులూ వుండాలి. విరిసే కొమ్మని, పూసే పువ్వుని కూడా చూసి ఆనందించగలగాలి. నిస్వార్థంగా మెలగాలి, ప్రేమని పంచాలి. ముఖ్యంగా పిల్లల్లా నిన్నటిని నిన్నే వదిలేసి ఈ రోజుని కొత్తగా ప్రారంభించాలి. గెలుపు ఓటమి ఆటలో భాగమని నమ్మాలి. వాళ్ళకి ఆడుకోవటానికి ఈ ఆటే అని లేదు. ఈ బొమ్మే కావాలనిలేదు. పూచిక పుల్లతో కూడా అడుకోగల నేర్పు పిల్లల స్వంతం. జీవితమూ అంతే జీవించాలి అదీ ఆనందంగా. అనుకోవాలే కానీ సాధ్యం కాదంటారా! -రమ ఇరగవరపు Attachments
Hold your Tongue It is easy to say 'Children are a Blessing from God' but it is not so easy to mean it everytime they count on your patience. Specially, Children who in the age group of 1-3 fall in this category, as they either cant speak atall, or they cant express clearly and also because they have explored something new that day and are eager to display their skills, which clashes with your timetable or your just-cleaned house. Loosing temper on a child is very easy and so simple too, as you have no threat that the child will shout back at you. But the guilt which comes later is a killer. It will haunt you like anything, everytime you sit to count the pleasant moments you and your child had together,and when you compare how good a Mom you are!! I dont know about the previous generations but the up-coming generations of children are pretty fast with catching the wrong behaviour. You shout thrice at the child, the next day you will see him/her repeating that same pattern. Forget about loosing your temper, it will get even worse and more difficult to straighten things up as the child has deviated from your 'good-behaviour' boundary, already. And also if you have friends who comment openly about some parents who shout or hit their children, that derogatory feeling will make you feel so awful, that you will repent of your lost temper. And so, after talking to quite a few parents on this topic and interviewing a couple of Moms who suffered from this guilt, i suggest, "try to hold your tongue, your bad temper from slipping away even infront of your child, that same child who says 'Mom, you are my best friend' " because it will tear your heart into pieces one day, Beware parents!!
Toy House, easily! One more activity to keep your child busy! And you need not run to the store. Just find a big enough cardboard box, collect few color papers, a strong glue. Allow your child to help you, but careful with the scissors around. Be smart, by thinking ahead about your child's most favourite TV show. Let that be the theme for this Toy House, and it will keep your child so busy. You will hear no complaints about the looks of it. We are not going to decorate it overly, as its just a cardboard box and we never know how many days it lasts. So just paste the basic colored papers on all interior sides of the box. If you have time and interest, make clouds with white paper and paste. You can even paste a sun, few simple trees , cut some windows and a door or just draw them all using colorful sketch pens. Here are some pics of what i did with my toddler Baby Girl. The sun was her idea....i dont intend to spend anymore time on this piece and feel bad later, as my curious Daughter is destructive at times. Basically, it all started as an All-in-one Toy house so that she can use it for any of her toys. And thats the reason, i just used blue for the sky, green for the land, clouds and a Sun. Put your imagination to creativity !! - Prathyusha Talluri
ఎడమవైపునే ఎందుకు ఎత్తుకుంటారు? సాధారణంగా మనం పిల్లల్ని ఏ చేత్తో ఎత్తుకుంటామో ఎప్పుడైనా గమనించారా? అన్ని పనులూ కుడి చేతితో చేసే అలవాటు వున్న వారు కూడా పిల్లల్ని ఎడమ చేత్తో ఎత్తుకుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఇదే అలవాటు. పిల్లల్ని ఎత్తుకోవాల్సివచ్చే సరికి స్త్రీలంతా ఎందుకిలా ఎడమ చేతి వాటాన్ని ఉపయోగిస్తారు. అనే దానిపై మానసిక శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. దానిలో వారు గ్రహించిందేంటంటే... స్త్రీల మెదడులో కుడివైపు భాగం ఉద్వేగాలను, ముఖాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. పసి పిల్లల ముఖాలను, అప్యాయత చిలకరించే వారి ఉద్వేగాలను మెదడులోని కుడివైపు భాగమే ఎక్కువగా ఆకర్షిస్తోంది. కుడివైపు మెదడు సంకేతాలు ఎడమ చేతి వాటాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల మహిళలు పిల్లల్ని ఎడమచేతివాటంతో ఎత్తుకుంటారు. -రమ
పిల్లల్లో భయానికీ ఇదీ ఒక కారణం పిల్లలకి రకరకాల భయాలు వుండటం సహజం. ఏ చిన్న సంఘటనో పసి మనసులపై ఆ ముద్ర వేస్తుంది. అయితే నిద్రలో కలవరిచటం, భయపడి లేవటం, అరవటం వంటి సమస్యలతో తరుచూ పిల్లలు భాదపడుతుంటే, ఒక్కసారి వారు టి.విలో, నెట్ లో చూసే ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకోండి అంటున్నారు నిపుణులు. హీరోయిజంతో కూడుకున్నవి, హింసని చుపించే, ఫైటింగులు ఎక్కువుగా వున్నవి. చూసే అలవాటు ఉన్న పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు ఎక్కువుగా ఉంటున్నట్టు గుర్తించారు. ఓ అధ్యయనంలో నిద్ర పోవటానికి గంట ముందు చూసే కార్యక్రమాలు పిల్లల నిద్రపై ప్రభావాన్ని చూపిస్తాయట. మనసుని ఆహ్లాదపరిచే కార్యక్రమాలు చూస్తే కంటినిండా నిద్ర పట్టే అవకాశం ఎక్కువట. పిల్లల కార్యక్రమాలే కదా అని చాలా వాటిని పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే ఆ కార్యక్రమాలో చూపించే సాహసాలు, హింస, పిల్లల మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నారు. "సీటెల్ చిల్డ్రన్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్" పరిశోధకులు సరిపడినంత నిద్ర లేనప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు, ఏకాగ్రత తగ్గుతుంది. చదువులో వెనకబడతారు, చిరాకు, కోపం ఎక్కువగావుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవైనా పిల్లల్లో కనిపిస్తే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ నిద్రలేమి, నిద్రలో కలవరింతలు వంటివి గుర్తిస్తే పిల్లలు చూసే కార్యక్రమాలు ఏంటో పరిశిలించి వారిని వాటి నుంచి నెమ్మదిగా మళ్లించాలి. వినటానికి చిన్న సమస్యగా వున్నా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై నిద్ర చూపించే ప్రభావం చాలా వుంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకూడదు అని గట్టిగా చెబుతున్నారు వీరు. -రమ
నన్ను పాకనివ్వమ్మా.. ప్లీజ్... పసి పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతీ దశ ముఖ్యమైనదే. ఏ వయసుకు ఆ వయసుకు తగ్గట్టుగా వుండే పిల్లల ఆటపాటలు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి అంటున్నారు పిల్లల ఆరోగ్య నిపుణులు. అయితే పిల్లల మీద ప్రేమతో, అలాగే వారికి హాని కలుగుతుందేమోననే భయంతో తల్లిదండ్రులు వారిని ఆ ఆటపాటలకి దూరం చేస్తే ఆ ప్రభావం తప్పకుండా పిల్లల శారీరక ఆరోగ్యంపై వుంటుందని హెచ్చరిస్తున్నారు వీరు. ఉదాహరణకి పారాడే పాపాయి అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం మామూలే. కానీ, అది చూసిన తల్లి కింద పాకుతుంటే దెబ్బలు తగిలించుకుంటోందంటూ ఎప్పుడూ ఎత్తుకు తిరగడం లేదా వాకర్‌లో వేయడం చేస్తుంది. అయితే ఇది ఎంతో తప్పు అంటున్నారు నిపుణులు. పిల్లల్ని పాకనివ్వకపోవడం పాపం... చంటి పిల్లల్ని అటూ ఇటూ తిరగకుండా వాకర్లలో కూర్చోబెట్టడం, ఉయ్యాల్లో పడుకోబెట్టడం, ఎప్పుడూ ఎత్తుకుని ఉండటం కన్నా వారు నేలంతా పారాడుతూ అటూ ఇటూ తిరుగుతుండటమే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, పిల్లలు తమ పొట్టపై తక్కువగా గడపటం వల్ల పాకే సామర్థ్యం తగ్గిపోతుందిట. 339 మంది చిన్నారులపై చేపట్టిన ఒక అధ్యయనంలో నేలమీద పారాడే అలవాటు అస్సలు లేని పిల్లల్లో 48 శాతం మందిలో శారీకర సమతౌల్యం లోపించడం, అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయిట. అలాగే పాకే వయసు పిల్లల్ని ఎప్పుడూ వాకర్లలో కూర్చోబెట్టడం వల్ల నష్టం ఉందని కూడా అంటున్నారు. అవయవాల అభివృద్ధిని ఆపకండి... పాకే వయసు పిల్లల్ని ఆపకుండా ఎప్పుడూ వాళ్ళు హాయిగా ఇల్లంతా పాకే అవకాశం కల్పించడం మంచిదిట. వాళ్ళని ఆపి ఒకేచోట కూర్చోబెట్టడం, అందులోనూ వాకర్లలో వేసి వుంచడం వల్ల ఎదిగే దశలో అవసరమైన అభివృద్ధినీ, నైపుణ్యాల్నీ పెంపొందించుకోలేరని గుర్తించారు నిపుణులు. ఇలాంటి పిల్లల్లో తలభాగాన్ని నియంత్రించుకోవడం, మెడ, శరీర పైభాగం బలిష్టమవటం వంటివన్నీ సమస్యగా మారే ప్రమాదముందిట. ఫలితంగా సమతౌల్యం లోపించడం, శరీరాకృతి సరిగా ఉండకపోవడం, కళ్ళ కదలికల్లో నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందిట. ఎదుగుదల క్రమపద్ధతిలో వుండాలంటే... పసిపిల్లలు ముందుగా పొట్టపై, ఆ తర్వాత చేతులపై, ఆ తర్వాత మోకాళ్ళ సాయంతో పాకడం చేస్తుంటారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా సాగే ప్రక్రియ ఎదుగుదలకి సహాయపడుతుంది. ఇలా అన్ని దశలను దాటిన పిల్లల ఆరోగ్యం చక్కగా వుంటుందిట. వారిలో ఎదుగుదల క్రమపద్ధతిలో జరిగి, సంపూర్ణంగా వుంటుందని చెబుతున్నారు పరిశోధకులు. కాబట్టి పిల్లలు నేలపై పాకితే గాయాలయిపోతాయని, అవీ ఇవీ నోట్లో పెట్టుకుంటారని భయపడకుండా వారిని స్వేచ్ఛగా పారాడనిస్తే వారి శారీరక ఎదుగుదలకి సహాయపడినవారం అవుతామని కూడా వీరు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న దెబ్బల్ని లైట్ తీసుకోండి... పిల్లలపై మన ప్రేమ వారికి హాని చేసే విధంగా వుండకూడదు. అందుకని ఈసారి మీ పసిపాప నేలపై పాకుతూ పడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్న తనని ఓదార్చి మళ్ళీ నేలపై వదిలిపెట్టండి. ముఖ్యంగా పరిశోధకులు చెప్పిన విషయం గమనించారు కదా. అలా పొట్టతో, ఆ తర్వాత చేతులతో, మోకాళ్ళతో పాకడం వల్ల వారి కళ్ళ, మెడ ఎదుగుదలలో సమతౌల్యం వుంటుంది. పారాడే పిల్లలని ఆపడం కన్నా వారికి అనువుగా ఇంటి పరిసరాలని మార్చడం మంచిది. క్రిందన వారికి అందేవిధంగా ఏవీ వుంచకుండా చూడాలి. ఇకప్పుడు ఏ భయం లేకుండా పిల్లల్ని హాయిగా ఇల్లంతా తిరగనివ్వొచ్చు. -రమ
పిల్లల్లో ఒత్తిడిని చిత్తు చేయండిలా... ఉరుకుల, పరుగుల జీవితం పెద్దలకే కాదు... పిల్లలకీ తప్పడం లేదు ఈ రోజుల్లో. నిద్రకళ్ళతోనే స్కూలు బస్సు ఎక్కే పిల్లలు ఎందరో. ఇక సాయంత్రం ఇంటికి వస్తూనే హోం వర్కులు, ప్రాజెక్టు వర్కులూ... ఊపిరి తీసుకునే సమయం కూడా వుండటం లేదు వారికి. ‘‘ఏం చేస్తాం... ఇదంతా ఇప్పటి కాంపిటీటివ్ ప్రపంచంలో తప్పవు’’ అనే పేరెంట్స్‌ని కాస్త ఆలోచించమంటున్నారు మానసిక నిపుణులు. చిన్నతనం నుంచే విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే పిల్లల్లో చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఏకాగ్రత తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ‘‘ఎంత ఒత్తిడికి గురయితే అంత బాగా నైపుణ్యాలు సొంతమవుతాయనే భ్రమ వద్దు’’. ఒత్తిడి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారి నైపుణ్యాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు. బాగా ఆడించండి మీరు కరెక్టే చదివారు. ఎంత శారీరక అలసట వుంటే అంత ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకి ఆ అలసట ఆటల్లో దొరుకుంతుంది. రోజుకి కనీసం రెండు గంటలపాటు బాగా అలసిపోయేలా ఆరుబయట ఆడించాలి. అది వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలకి సానపట్టేవి ఆటలే. పదిమందితో కలవటం, ఓడటం, గెలవటం, సర్దుకుపోవడటం అన్నీ వస్తాయి. మానసికంగా బలంగా తయారవుతారు. దాని నుంచి రోజువారీ ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకుంటారు. ఇలా పిల్లలకి అన్ని విధాలా ఆటలు మేలు చేస్తాయి. అలాగే వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. కాబట్టి ఓ గంటసేపయినా పనులు పక్కనపెట్టి పిల్లల ఆటల్లో భాగం కండి. ఆరకంగా మీరూ మీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందచ్చు. ప్లానింగ్ నేర్పించాలి ఒత్తిడికి మరో కారణం- టైమ్ చూసుకుంటూ పరుగులు పెట్టడం. ఆ ఒత్తిడి తగ్గాలంటే ప్రణాళికతో రోజుని ఎలా ప్రారంభించాలో పిల్లలకి నేర్పాలి. ముందురోజే స్కూలు బ్యాగు సర్దుకోవడం నుంచి రోజు ఓ అరగంట ముందు లేచి రిలాక్స్‌గా తయారవ్వటం దాకా అన్నీ ముఖ్యమే. ‘‘టైమ్ అయిపోయింది’’, ‘‘టైమ్ లేదు’’ లాంటి మాటల నుంచి విముక్తి దొరికితే పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆనందంగా వుంటారు. కాబట్టి కాస్త కష్టమైనా టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంట్లో పెద్దలు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. కొంచెం కబుర్లు పిల్లలంటేనే వసపిట్టలు. అన్ని విషయాలనీ అనర్గళంగా చెబుతూనే వుంటారు. అందులోనూ రకరకాల భావావేశాలతో. వారి ఆ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయద్దు. సాధారణ విషయాలతోపాటు వారిలోని భయాలు, ఆందోళనల వంటివి కూడా బయటకి వచ్చేందుకు ఆ కబుర్లే సాధనం. ‘‘మాట్లాడకుండా చదువుకో’’ అన్న ఒక్క మాట పిల్లల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. పిల్లలని మాట్లాడనివ్వండి. మీరూ మాట్లాడండి. ఉదయం నిద్రలేచి ఎవరి దారిన వారు పరుగులు పెట్టేముందు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ టైమ్ అంటూ ఓ పది నిమిషాలు ఒకచోట కూర్చుని కబుర్లతో రోజుని ప్రారంభించి చూడండి. అలానే రాత్రి నిద్రకి ముందు ఓ నాలుగు కబుర్లు చెప్పకుంటే అందరి ఒత్తిడి ఎగిరిపోతుంది. అనుబంధాలు బలపడతాయి. పిల్లలకు భరోసాగా వుంటుంది. వారిలో ఉత్సాహం నిండుతుంది. పిల్లలకి ప్రత్యేకంగా మనం ఏమీ నేర్పించక్కర్లేదు. మనం ఆచరించి చూపిస్తే చాలు పిల్లలు వాటినే ఫాలో అవుతారు. ఒత్తిడితో క్రుంగిపోతూ రోజులని బరువుగా వెళ్ళదీయడం కాదు. ‘‘ఎంత ఒత్తిడినైనా దరిచేరనివ్వకుండా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిపోవడమే జీవితం’’ అన్న విషయం పిల్లలకి అర్థమైతే చాలు - ఎప్పటికీ ఆనందంగా వుంటారు. -రమ
చక్కని చేతిరాత - భవిష్యత్తుకు బంగారు బాట పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తోంది. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు వుండాలి? వంటి విషయాలు ఈమధ్యకాలంలో ఎంతో చర్చనీయాంశాలుగా మారాయి. మన పరిధి దాటిన సమస్యల పరిష్కారానికి మనం ఆయా రంగంలోని నిపుణుల సలహాల కోసం చూస్తుంటాం. అలా పిల్లల చదువులు, తల్లిదండ్రుల పాత్ర అన్న విషయంపై ఈమధ్య అమెరికాలోని వాండర్ బిల్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కొన్ని స్కూల్స్‌లో ఓ ఏడాదిపాటు వివిధ అధ్యయనాలు చేశారు. అందులో వారు కనుక్కొన్న విషయం ఏమిటంటే, చక్కటి దస్తూరి కలిగి వుండటం అనేది కేవలం ఓ ప్రత్యేక నైపుణ్యం మాత్రమే కాదు, అభ్యసన ప్రక్రియలో అదెంతో కీలకమైనదని కూడా గుర్తించారు. మంచి చేతిరాత కలిగి వుండటం ఎంతో ముఖ్యం. పిల్లలకు మంచి చేతిరాత నేర్పించడమంటే దానర్థం అభ్యసన ప్రక్రియను, భావ వ్యక్తీకరణను సమర్థవంతంగా నేర్పించడమే అంటున్నారు వాండర్ బిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. చేతిరాత చక్కగా నేర్చుకునే క్రమంలో పిల్లలు తాము రాసే అక్షరాలపై ఎంతో శ్రద్ధ పెడతారుట. చిన్నతనంలో ఇలా అక్షరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాయడం అలవాటైన పిల్లలు ఆ తరువాత కూడా అదే శ్రద్ధ, ఏకాగ్రత కనపరుస్తారట తమ చదువు విషయంలో. అలాగే మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నప్పుడే పిల్లల దస్తూరి విషయంలో కొద్దిపాటి శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తే అది వారికి అలవాటుగా కూడా మారుతుందని అంటున్నారు పరిశోధకులు. ఈమధ్యకాలంలో ‘గ్రాఫాలజీ’ ఎంతో ఆదరణ పొందటం మనం చూస్తున్నాం. చేతిరాత బట్టి పిల్లల మానసిక స్థితి, వారి ఏకాగ్రత వంటివి అంచనా వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాగే చేతిరాతని కుదురుగా వుండేలా రాయడం నేర్చుకున్నాక పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటం కూడా గమనించామని అంటున్నారు పరిశోధకులు. అలాగే అక్షరాలని గుర్తించడంలో దస్తూరి బాగున్న పిల్లలు పొరపాట్లు పడటం తక్కువని కూడా గుర్తించారు వీరు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి చేతిరాత కలిగివుండటం అంటే పిల్లల్లో తగినంత శ్రద్ధ, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం కలిగి వున్నట్టు అర్థమని అంటున్నారు పరిశోధకులు. కాపీరైటింగ్ అంటూ చిన్నప్పుడు పిల్లలతో రాయిం చి ఆ తరువాత తరువాత వారి చదువు, మార్కులపై శ్రద్ధ పెట్టి చేతిరాత విషయంలో అంత శ్రద్ధపెట్టరు తల్లిదండ్రులు. కానీ, ఎప్పటికప్పుడు పిల్లల చేతిరాత కుదురుగా వుండేలా ప్రోత్సహిస్తూ, ఆ విషయంగా తనకి కావలసిన సహాయం చేయడం ఎంతో ముఖ్యమని చెబుతున్న పరిశోధకులు మనకు చేస్తున్న సూచన ఒకటే... పిల్లల చక్కని మార్కులకు, వారి వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఆరోగ్యానికి చక్కటి చేతిరాత ఎంతో ముఖ్యం. -రమ
Easy art by your child You want to keep your child busy, sametime, you want to cherish the messy work your child did !!!! Yes, it can be possible...just take a canvas or a white poster chart, a plastic sheet to cover the floor, few non-toxic water or acrylic colors, cotton balls, small cup of water, a small plate to mix colors. On the blank canvas or a poster, if you really want any particular name or design untouched, all you have to do is cover that area with painter's tape, so that after the painting is finished and dry, once you remove the tape, you can see the letters or design you covered in bold white and stunning. Painter's tape does not allow any color seepage. To start the painting process, Put the first color you want on the plate, mix a little water and ask your child to dab a cotton ball in the color...let your child take free action now. Dab, dab and dab wherever you want...follow with the other colors too....all you have to do is monitor your child's dabbing action, let them follow your instructions on where to dab more and where less...then Stop your child when the whole art is looking good...if you dont stop them there, your child might proceed to spoil the fun...so convince your child to stop painting and hide it from them...the next day, the fantastic artwork is ready to be displayed and you are already proud !!!!! You can make your child finger paint or use plastic hair combs dipped in color to paint on the canvas, just make sure the colors are non-toxic ( not harmful to those tiny hands).
వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు! ‘‘పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు.. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలుని వదిలేయండి చాలు’’ ఈ మాటలు అన్నది 12 ఏళ్ళపాటు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఓ యూనివర్సీటీ బృంద సభ్యులు.పిల్లల్లో ఆత్మవిశ్వాసం అన్న అంశంపై వీరి అధ్యయనం సాగింది. అందులో పిల్లల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించారు. అందులో తల్లిదండ్రుల అతి జాగ్రత్త, ప్రేమ కూడా కారణమని తేలింది. సాధారణంగా పిల్లల మీద ప్రేమకొద్దీ వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటారు పేరెంట్స్. వారికి తెలీదని, చేతకాదని అంటూ దగ్గరుండి అన్నీ చేస్తారు. సలహాలు, సూచనలు, నీకేం తెలీదనే అదిలింపులు సరేసరి. అయితే ఇది సరికాదని, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిని నెమ్మది నెమ్మదిగా స్వతంత్రంగా పనులు చేసేలా, ఆలోచించేలా వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుని తిరిగి ప్రయత్నించమనాలి. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్ అని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వారు సలహా అడిగితేనే ఇవ్వాలి అంటున్నారు వీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ప్రయత్నాన్ని, తప్పొప్పులని విమర్శించకూడదట. నీవల్ల కాదులే అని చొరబడి వారి పని కూడా చేయకూడదట. అది మూడేళ్ళవాడు కావొచ్చు.. పదమూడేళ్ళవాడు కావొచ్చు.. వాడి పరిధిలో వాడి పనేదో వాడికి చేతనైనట్టు చేయనివ్వాలి. అప్పుడే వారు ‘ఆత్మవిశ్వాసం’ అనే కవచాన్ని పొందగలరు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. ఆ ఆటలో వారు ఒకసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోనే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వారికివ్వగలిగే అమూల్యమైన బహుమతి. ఏమంటారు? - రమ
Mothers’ Milk must for Premature Babies Mothers Milk for Premature Baby growth: A recent study which appeared in the Journal of Pediatrics stressed the need for Mothers’ milk for the health and growth of premature babies. Incorporating human milk fat supplement into premature infants' diets improves their growth outcomes in the neonatal intensive care unit (NICUand for premature babies who weigh less than a kg, one of the problems is that their lungs and other organs are still developing when they are born," said Amy Hair, an assistant professor at Baylor College of Medicine in the US. "If the infant gains weight and increases in length at a good rate while in the NICU, this helps improve their (growth) outcomes," Hair added. Previous research has shown that an exclusive human milk diet protects the intestines of premature infants and supports their growth. This diet consists of mothers' own breast milk or donor human milk, as well as a fortifier consisting of protein and minerals made from the donor milk. In this study, researchers sought a way to optimise growth in infants who weigh between 750 and 1,250 grams and need additional calories. As infants are already receiving enough protein from the fortifier, another way to help them grow is by giving them fat. One of the byproducts of pasteurising donor milk is milk fat, also referred to as a cream supplement. They found that infants in the cream group had better growth outcomes in terms of weight and length than infants in the control group.
Heartburn during Pregnancy Joy Of Pregnancy : In this video Dr. Kameswari Surampudi, Gynecologist, Fernandez Hospital takes about acidity and heartburn during Pregnancy .She gives useful tips on what to eat / stay away from and suggestions to avoid heart burn and acidity during pregnancy.
What not to eat when Breastfeeding Tips for healthy breast feeding: The lucky moms who have no issue can eat whatever they like and their babies enjoy their moms milk. Some babies enjoy the spice if you are fond of spicy food , but if the spice gets a bit too much you know what happens Down under the baby’s bottoms… The first and foremost tip when it comes to proper breast feeding would be to find out on your own as to what suits your baby. Careful examination of what you eat directly affects the baby’s bowels. If the baby feels gassy check on the protein content you are eating. Some babies are allergic to heavy doses of protein which come from meat, poultry and lentils. Mothers report that babies most often object to chocolate, spices (cinnamon, garlic, curry, chili pepper); citrus fruits and their juices, like oranges, lemons, limes, and grapefruit; strawberries; kiwifruit; pineapple; the gassy veggies (onion, cabbage, garlic, cauliflower, broccoli, cucumbers, and peppers); and fruits with a laxative effect, such as cherries and prunes. So eating these in moderation would be the best option. One or two cups of coffee is allowed but too much caffeine can interfere with your baby's sleep or make him/her fussy. Avoid sodas, teas and beverages as they also contain moderate amounts of caffeine. NO alcohol please and if you think you really can’t do without one, go for those mild drinks which have less alcohol content in them. Alcohol increases your blood alcohol level to the point that the alcohol gets into your milk. Some babies are known to be allergic to cows' milk , soya, wheat, egg, nuts, and corn or corn syrup. So if you think that these are causing the baby to go colic its best to avoid them. Talk to your pediatrician before you stop any foods from your diet if the food causes any allergy. If avoiding foods like dairy products, you may need to see a nutritionist for advice on substituting other foods or taking nutritional supplements. Take your prenatal vitamins as long as you are breastfeeding to cover any gaps in your own diet.
The Art of Brushing Baby Teeth Teaching toddlers to brush: It’s either a nightmare for some or a pleasant task for some parents whose children totally love the brushing routine. So what should the parents who are facing the task of teaching their child to brush the right way. 1.First and foremost stay Calm - Children have the uncanny ability to detect agitation in the parents. So when you start the first round of brushing session stay calm, use all the tactics you know to distract the child and brush their teeth. 2.Use the latest brushing equipment including the finger brushes so that your finger doesn’t get bitten. 3.Make your child choose his/her own dental supplies, the fancy brushes, sweet toothpastes with cartoon characters and rotary brushes in the super market. 4.Since brushing twice is the order of the day make him/her brush on his own at least once a day so that they get the hang of it. You could brush the teeth and massage the gums the other time so that you can compensate for inadequate brushing. 5.Want them to brush! Then brush along with them. This way they get into the habit and learn while brushing. 6.Make a trip to the dentist so that they feel important and make the dentist talk to them personally and explain oral hygiene. 7.As they grow older make it a point to check on them once in a while and also show them how to floss their teeth. 8.You could figure your own special way to help your children brush their teeth and this could pave way for better oral hygiene in the future.
Anemia during Pregnancy Anemia or Iron Deficiency During Pregnancy : In our Joy Of Pregnancy series, we have Dr. Kameswari Surampudi, FRCOG (UK), Gynecologist from Fernandez Hospital talk about Anemia during pregnancy. Hemoglobin levels in the body should be adequate even before you become pregnant and maintained during pregnancy for a healthy delivery. She gives us several tips and advice about how to maintain good hemoglobin levels till you deliver safely.
How to train your Baby to be Independent How A Mother Should train Her Baby: In this video on Effective Parenting, watch Dr Chitti Vishnu Priya, our Parenting Expert explain when and how a mother should start training the child to be independent and start doing things by him/herself.