ఎడమవైపునే ఎందుకు ఎత్తుకుంటారు?


సాధారణంగా మనం పిల్లల్ని ఏ చేత్తో ఎత్తుకుంటామో ఎప్పుడైనా గమనించారా? అన్ని పనులూ కుడి చేతితో చేసే అలవాటు వున్న వారు కూడా పిల్లల్ని ఎడమ చేత్తో ఎత్తుకుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఇదే అలవాటు. పిల్లల్ని ఎత్తుకోవాల్సివచ్చే సరికి స్త్రీలంతా  ఎందుకిలా ఎడమ చేతి వాటాన్ని ఉపయోగిస్తారు. అనే దానిపై మానసిక శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. దానిలో వారు గ్రహించిందేంటంటే...  స్త్రీల మెదడులో కుడివైపు భాగం ఉద్వేగాలను, ముఖాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. పసి పిల్లల ముఖాలను, అప్యాయత చిలకరించే వారి ఉద్వేగాలను మెదడులోని కుడివైపు భాగమే ఎక్కువగా ఆకర్షిస్తోంది. కుడివైపు మెదడు సంకేతాలు ఎడమ చేతి వాటాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల మహిళలు పిల్లల్ని ఎడమచేతివాటంతో ఎత్తుకుంటారు.

 

-రమ