మహిళలు ధరించే బ్రా ల గురించి షాకింగ్ నిజాలు..!
మనకు ఆహారం, నివాసంతో పాటు, బట్టలు కూడా చాలా ముఖ్యమైనవి. పొడవాటి చీర అయినా లేదా చిన్న బ్రా అయినా.. వాటి ఎంపిక విషయంలో మహిళలు బాగా ఆలోచిస్తారు. ఎలాంటి దుస్తులు ధరించినా మహిళలు బ్రా వేసుకోవడం తప్పనిసరి. అయితే మహిళలు బ్రా లు తప్పనిసరిగా ధరించినా వాటి గురించి మాట్లాడటానికి వెనుకాడతారు. ఈ కారణంగా బ్రా గురించి చాలామందికి చాలా విషయాలు ప్రశ్నలుగానే ఉన్నాయి. చాలామందికి తెలియని బ్రా గురించి నిజాలు తెలుసుకుంటే..
బ్రా ఎలా ఉనికిలోకి వచ్చింది?
గతంలో కార్సెట్ దుస్తులు మాత్రమే ఉండేవి. ఇది క్రమంగా మారిపోయి 20వ శతాబ్దంలో బ్రాను ప్రవేశపెట్టారు. హెర్మియోన్ కాడోల్ అనే వ్యక్తి కార్సెట్ తయారు చేస్తున్నాడు. దానిని తయారు చేస్తున్నప్పుడు అది బిగుతుగా మారింది. అతను కార్సెట్‌ను 2 ముక్కలుగా చేశాడు. తరువాత కార్సెట్ బ్రా రూపాన్ని తీసుకుంది. చాలా మంది చరిత్రకారులు బ్రాను 1910లో మేరీ ఫెల్ప్స్ జాకబ్ 19 సంవత్సరాల వయసులో కనుగొన్నారని నమ్ముతారు.
అసలు పదం..
బ్రా పూర్తి రూపం బ్రజియర్. ఇది ఫ్రెంచ్ పదం. దీని అర్థం మహిళల వక్షోజాలను కప్పి ఉంచడానికి, మద్దతు ఇవ్వడానికి రూపొందించిన లోదుస్తులు. కానీ 1930 నాటికి, ప్రజలు బ్రజియర్‌ను బ్రా అని పిలవడం ప్రారంభించారు. బ్రజియర్ అనే పదం 1911లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడింది.
బ్రా లకు ఎక్స్‌పైరీ డేట్..
బ్రాను వారానికి 3 నుండి 4 సార్లు ధరిస్తే.. అది 8 నెలల వరకు ఉంటుంది. బ్రాను 12 నెలల వరకు కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ధరించకపోతే బ్రాను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఇది బ్రా నాణ్యత, దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.
సరైన బ్రా లు ధరిస్తున్నారా?
నివేదికల ప్రకారం 80% మంది మహిళలు తప్పు సైజు బ్రా ధరిస్తున్నారట. బ్రా సైజును కొలవడానికి అనేక స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సంకోచం, సిగ్గు వంటి అనేక కారణాల వల్ల, మహిళలు సైజును కొలవకుండా బ్రాలను కొనుగోలు చేస్తారు. మహిళలు కూడా తాము తప్పు సైజు బ్రా ధరిస్తున్నారనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చట.
అత్యంత ఖరీదైన బ్రా ధర..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్ గురించి వినే ఉంటారు . ఈ విషయంలో బ్రా కూడా తన రికార్డ్ తనకు క్రియేట్ చేసుకుంది. 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాగా పరిగణించబడుతుంది. దీనిని విక్టోరియా సీక్రెట్ రూపొందించింది. 2000లో దీనిని సూపర్ స్టైలిష్ గిసెల్ బుండ్చెన్ ధరించింది . ఈ బ్రా ధర రూ. 125 కోట్లుగా చెబుతారు. 1,300 క్యారెట్ల వజ్రాలు థాయ్ కెంపులు దానిపై పొందుపరచబడ్డాయి. అందుకే 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' మెరిసేలా కనిపిస్తుంది.
*రూపశ్రీ.
