మహిళలు మహారాణి లాంటి జీవితం పొందాలన్నా.. పేదరికంలో మగ్గిపోవాలన్నా

ఈ 5 విషయాలే డిసైడ్ చేస్తాయ్..!


ప్రపంచంలో అందరు  వ్యక్తుల జీవితం ఒకేలా ఉండదు. ఇందులో మహిళల జీవితం మినహాయింపేమీ కాదు. కానీ సరిగా గమనిస్తే.. బాగా ఆలోచిస్తే.. ప్రారంభం ఎలా ఉన్నా.. కాలంతో పాటు ఎదిగి సాధారణ మహిళలు కూడా మహారాణుల్లా గొప్ప స్థానానికి ఎదిగిన వారు ఉన్నారు.  గొప్ప జీవితంతో తమ ప్రయాణం మొదలుపెట్టి పాతాళానికి పడిపోయి పేదరికంతో పోరాడుతున్న మహిళలు కూడా ఉన్నారు.  ఇదంతా ఎందుకు జరుగుతుంది? మహిళల జీవితాలను నిర్ణయించే విషయాలు ఏంటి? కేవలం 5 విషయాలు మహారాణుల్లా గొప్ప స్థానాలు ఇవ్వగలవు, పేదరికంలోనూ ముంచేయగలవు.. అవేంటి? తెలుసుకుంటే..

కష్టం, సోమరితనం..

కష్టపడి పనిచేసే స్త్రీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే సామర్థ్యం ఉంటుంది. మహిళలలోని అంకితభావం, కృషి,  పట్టుదల ఆమెకు గౌరవాన్ని,  విజయాన్ని,  శ్రేయస్సును తెస్తాయి. సోమరితనం  స్త్రీని వెనక్కి నెట్టివేస్తుంది.  పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. సోమరితనం ఎదుగుదల, విశ్వాసం,  ఏదైనా నేర్చుకోవడం  లేదా సాధించడం అనే లక్ష్యాలకు   అతిపెద్ద శత్రువుగా మారుతుంది.

పొదుపు, దుబారా..

ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా అందులో స్త్రీల పాత్ర చాలా కీలకం.    డబ్బు విలువను అర్థం చేసుకుని తెలివిగా పొదుపు చేసే స్త్రీలు తమ కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోగలుగుతారు.  కానీ ఆడవాళ్లకు   దుబారా అలవాట్లు ఉంటే ఆమె జీవితమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్త్రీలు  కుటుంబం పతనం కావడానికి, ఆర్థిక కష్టాలు అనుభవించడానికి కారణం అవుతారు.

మోసం, నిజాయితీ..

నిజాయితీ అనేది ప్రతి సంబంధానికి బలమైన పునాది.   నిజాయితీపరులైన స్త్రీ సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. దీనికి విరుద్ధంగా అబద్ధాలు చెబుతూ  ఉంటే వారి మోసం  సంబంధాలను బలహీనపరచడమే కాకుండా జీవితంలో బాధ, ఒత్తిడి,  అపనమ్మకాన్ని కూడా పెంచుతాయి.

ఓర్పు, కోపం..


ఓర్పు,  సంయమనం స్త్రీకి ఉన్న గొప్ప బలాలుగా భావిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ఏ పరిస్థితినైనా నిర్వహించగల స్త్రీ ఎలాంటి పరిస్థితిలోనైనా విజయం సాధిస్తుంది,  బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. దీనికి విరుద్ధంగా, తొందరగా కోపం తెచ్చుకునే స్త్రీలు సంబంధాలలో విభేదాలు, గొడవలు రావడానికి కారణం అవుతుంది.  ఎక్కువ కోపం, తొందరగా కోపం వచ్చే స్త్రీల జీవితం ఒత్తిడి,  సమస్యలతో నిండిపోతుంది.

నేర్చుకోవడం,  స్తబ్దత..

కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ,  కాలానికి అనుగుణంగా మారుతూ ఉండే స్త్రీలు జీవితంలో అన్ని విధాలా అభివృద్ది చెందుతూ ఉంటారు. నేర్చుకునే అలవాటు మహిళలను ప్రతి రంగంలోనూ బలంగా, విజయవంతం అయ్యేలా చేస్తుంది.  నేర్చుకోవడం పట్ల ఆసక్తి లేకుండా కేవలం తిని కూర్చుకొంటూ ఎంజాయ్ చేయాలనే మహిళలు వెనుకబడిపోతారు.

                                             *రూపశ్రీ.