ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే!
 


 అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

 అశ్వగంధ..

తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు.

ఉసిరి..

ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.

 
తులసి..

తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది.

నెయ్యి..

నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

బ్రహ్మి..

బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.

                                           *నిశ్శబ్ద.