మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు!

అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్‌ లెస్‌ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి .


2. స్క్రబింగ్‌ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్‌ సెల్స్‌, టాక్సిన్స్‌ తొలగుతాయి. స్క్రబ్‌ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్‌ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్‌ చేయవద్దు.

3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్‌ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్‌గా హ్యాండిల్‌ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం,
ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్‌ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.

5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌, విటమిన్‌ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉంటుంది.

6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్‌ కారణంగా.. పిగ్మెంటేషన్‌, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపండి.