వారానికి రెండుసార్లు.. ఈ ఒక్క డ్రింక్ తాగితే జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!

 


మనిషి అందంగా కనిపించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తుగా జుట్టు ఉండటం వల్ల చాలామంది ఎంతో ఆత్మివిశ్వాసంతో కూడా ఉంటారు. అయితే జుట్టు రాలే సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో నాణ్యమైన జుట్టు పెరుగుదల కలలా మారుతోంది.  చాలామంది అమ్మాయిల నుండి పురుషుల వరకు ప్రతి ఒక్కరు జుట్టు పెరుగుదల కోసం చాలా చిట్కాలు ట్రై చేసి నిరాశ చెందుతున్నారు. అయితే జుట్టును ఊహించని విధంగా పెంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే డ్రింక్ ఒకటుంది.   ఈ డ్రింక్ ను వారంలో కేవలం రెండు సార్లు తాగితే చాలు.. తొందరలోనే హెయిర్ గ్రోత్ ప్రారంభమవుతుంది. పలుచగా ఉన్న జుట్టు మందంగా కూడా మారుతుంది. అలాగే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.  జుట్టుకు ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చే ఆ డ్రింక్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..

మునగాకు డ్రింక్..

మునగ ఆకు జుట్టుకు చాలా సహాయపడుతుంది.  చాలామంది మునగాకును లైట్ గా తీసుకుంటారు. కానీ ఇది షుగర్ పేషెంట్లకు,  అలాగే జుట్టు పెరుగుదలకు, కంటి ఆరోగ్యానికి, చర్మానికి.. ఇలా చాలా రకాలుగా మేలు చేస్తుంది.

కావలసిన పదార్థాలు..

మునగ ఆకు.. ఒక గుప్పెడు

క్యారెట్.. ఒకటి

నిమ్మకాయ.. సగం

నీరు.. ఒక గ్లాసు..

తయారు విధానం..

ఒక గుప్పెడు మునగ ఆకులను తీసుకుని మిక్సర్ జార్ లో వేయాలి. ఇందులో ఒక క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇందులో సగం కాయ  నిమ్మరసం పిండాలి.  తర్వాద దీంట్లో గ్లాసుడు నీరు పోసి బాగా గ్రైండ్ చేయాలి.  తర్వాత దీన్ని వడగట్టి తాగాలి.

ఈ డ్రింక్ ను వారంలో రెండు సార్లు తాగాలి. మునగను వాడటం వల్ల  జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . ఎందుకంటే ఇందులో విటమిన్లు ఎ, బి, సి,  ఇ వంటి అనేక పోషకాలతో పాటు ఐరన్  కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి జుట్టు రాలడాన్ని నివారించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో,  తల చర్మంతో సహా వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

                                                *రూపశ్రీ.