ఆరెంజ్ ప్యాక్‌తో అందం అదరహో...

 

 


అందం అంటే మగువ, మగువ అంటే అందం. అలాంటి అందాన్ని కాపాడుకోవడానికి మగువలు బయట దొరికే కాస్మోటిక్స్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులతో కూడా మనం ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఆరెంజ్ ఒకటి. ఇది తినడానికే కాదు  ఫేస్ ప్యాక్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ కోసం కొన్ని ఆరెంజ్ ఫేస్ ప్యాక్‌లు....
  
* రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాలు ఉంచుకొని తరువాత  కొంచెం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మీ ముఖం నునుపుగా మారటమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది.

* రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని వాటిని బాగా కలిపి ముఖానికి , మెడకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మీ చర్మం పై ఉన్న మచ్చలు పోవడమే కాకుండా కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది.

* కొంచెం ఆరెంజ్ జ్యూస్ తీసుకొని దానిలో ముల్తాని మట్టి, పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమషాలు అలా ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. 

* ఆరెంజ్ తొక్కలతో చేసిన పొడిలో  కొంచెం గంధం పొడి, పాలు / నీరు / రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి 20 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల మీ చర్మం మీద ఉండే మృతకణాలు పోవడమే కాకుండా ముఖం మంచి కాంతివంతంగా తయారవుతుంది.