నాసల్ ఎలర్జీ కి చిట్కాలు నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు మీకోసం.

1. ఒక కప్పు వేడి వేడి టీని తాగాలి. కొన్ని సందర్భల్లో ఇటువంటి వేడి, వేడి పానీయాలో ముక్కు కారడాన్ని మరియు అసౌకర్యాన్ని నయం చేడంలో బాగా సహాయపడుతాయి.వేడి వేడి గ్రీన్ టీ మరియు పెప్పర్ మింట్ టీ మరియు అల్లం టీ వంటివి నాసికా మరియు సైనస్ నొప్పిని నుండి ఉపశమనం కలిగించడంలో గొప్పగా సహాయపడుతాయి.

2. ఆవిరి పట్టడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న గొప్ప ఔషధం లాంటిది. ఇది ముక్కు మూసుకుపోవడాన్ని మరియు సైనస్ రద్దీ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఒక పెద్ద పాత్ర లేదా గిన్నెలో వేడి నీటిని తీసుకొని అందులో, మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి, ఆ వచ్చే ఆవిరిని పూర్తిగా ముక్కు, నోటితో పీల్చాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన ముక్కుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

3. ఎప్పుడైతే ముక్కు మూసుకుపోయినట్టు మరియు సైనస్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది. వేడి నీటి స్నానం వల్ల మూసుకుపోయిన ముక్కును శ్వాసపీల్చడానికి సులభతరం చేస్తుంది.

4. నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశననం పొందడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉల్లిపాయలు. ఉల్లిపాయలను అతి దగ్గరగా పెట్టుకొని, చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వల్ల నాసల్ పాసేజ్ ఫ్రీగా అవుతుంది. మరియు పచ్చి ఉల్లిపాయను తినడం ద్వారా నాసికా ప్రతిష్టంభన నుండి ఉపశమనం పొందవచ్చు.

5. నాజల్ బ్లాకేజ్ నుండి ఉపశనం పొండానికి హాట్ టమోటో జ్యూస్ ను తాగాలి. ఈ టమోటో జ్యూస్ ను వేడి వేడిగా రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.