అల్లం రసంలో వీటిని కలిపి అప్లై చేస్తే కనుబొమ్మలు భలే ఒత్తుగా పెరుగుతాయి..!

కనుబొమ్మలు ముఖానికి అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వాటిని షేప్ చేయించుకోవడం కూడా ఎంతో బాగుంటుంది. ఒత్తుగా, ముదురు రంగులో ఉన్న కనుబొమ్మలు కళ్ళ అందాన్ని పెంచడమే కాకుండా ముఖానికి షార్ప్ లుక్ ని కూడా ఇస్తాయి. చాలామంది ఐబ్రో పెన్సిల్ సహాయంతో కనుబొమ్మలను ఒత్తుగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఇంటి చిట్కాలు ఉపయోగించి కనుబొమ్మలను సహజంగా ముదురుగా, మందంగా మార్చుకోవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇది చాలా సులభంగా సాధ్యమవుతుంది.
కొబ్బరినూనె, అల్లం..
కొబ్బరి నూనెతో కలిపి అల్లం పేస్ట్ రాయడం వల్ల కనుబొమ్మల వెంట్రుకలు పోషణ పొందుతాయి. అవి మందంగా మారుతాయి. రంగు కూడా ముదురుగా మారుతుంది.
అల్లం, ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అల్లంతో కలిపి వాడటం వల్ల కనుబొమ్మలు వేగంగా నల్లబడటానికి, ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది.
అల్లం, అలోవెరా జెల్..
అలోవెరా చర్మాన్ని చల్లబరుస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. అల్లంతో కలిపితే సహజ టానిక్‌గా పనిచేస్తుంది.
అల్లం, ఆలివ్ నూనె..
ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అల్లంతో కలిపి వాడటం వల్ల కనుబొమ్మల మూలాలు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
అల్లం, మెంతుల పొడి..
మెంతులలోని ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అల్లం కలిపిన పేస్ట్‌ను పూయడం వల్ల కనుబొమ్మలు మందంగా మారుతాయి.
అల్లం, నిమ్మరసం..
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలను శుభ్రపరుస్తుంది. అల్లంతో కలిపి నిమ్మరసం రాస్తే.. కనుబొమ్మలను నల్లగా, మెరిసేలా చేస్తుంది.
ఎలా అప్లై చేయాలి..
పై మిశ్రమాలలో దేనినైనా రాత్రిపూట కనుబొమ్మలకు సున్నితంగా అప్లై చేసి, ఉదయం కడిగేయాలి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే కొన్ని వారాలలో గుర్తించదగిన తేడాను చూడవచ్చు.
*రూపశ్రీ.



