ముఖం మీద మచ్చలను 7రోజులలో మాయం చేసే చిట్కా.. కేవలం 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలు..!



ముఖం మీద మచ్చలను తరచుగా వయస్సు పెరుగుతున్నందుకు సంకేతం అనుకుంటారు. కానీ పెరుగుతున్న వయస్సుతో పాటు, చర్మం విషయంలో తీసుకునే అజాగ్రత్తల వల్ల కూడా ఇది జరుగుతుంది.   జీవనశైలి మారడం, సరైన ఆహారం తీసుకోకపోవడం,  నిద్ర సరిగా లేకపోవడం వంటి కారణాలు ముఖం మీద  మచ్చలు రావడానికి కారణం అవుతాయి. . దీని కారణంగా ముఖం వృద్ధాప్యంగా లేదా వయస్సు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. చాలామంది అమ్మాయిలు  ముఖంపై మచ్చలను తొలగించడానికి క్రీములు,  చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే, ఈ క్రీములలో అధిక రసాయనాలు ఉపయోగించబడతాయి.   ఇది ముఖానికి ప్రయోజనాల కంటే చాలా రెట్లు ఎక్కువ హాని కలిగిస్తుంది.  సహజంగా ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద మచ్చలను తొలగించడానికి కేవలం 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలు. ఇంతకీ ఈ చిట్కా ఏంటి? తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు.

బంగాళాదుంపలు
నీరు
కలబంద జెల్
పసుపు

తయారీ విధానం..

మొదట  బంగాళాదుంపలను తీసుకోవాలి. ఇప్పుడు  ఈ బంగాళాదుంపలను కట్ చేసి మిక్సర్‌లో వేయాలి. ఇప్పుడు మిక్సర్‌లో కొంచెం నీరు కలపాలి, నేరుగా రుబ్బుకోవడానికి ప్రయత్నించవద్దు. ఈ బంగాళాదుంపలు బాగా రుబ్బుకున్న తర్వాత, ఒక గిన్నెలో దాని రసాన్ని విడిగా తీసుకోవాలి.

 దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచితే, స్టార్చ్ గిన్నె అడుగున పేరుకుపోతుంది.  ఈ స్టార్చ్‌ను విడిగా తీయాలి. ఇప్పుడు దానికి కలబంద జెల్, చిటికెడు పసుపు,  విటమిన్-ఇ క్యాప్సూల్ జోడించాలి .  ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఫేస్ మాస్క్ గా ఉపయోగించాలి.

ఎలా ఉపయోగించాలి?

రాత్రి పడుకునే ముందు ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత  ముఖాన్ని కడుక్కోవాలి.  ఈ రెమెడీని 7 రోజుల పాటు నిరంతరం పాటిస్తే, ముఖం  పిగ్మెంటేషన్ మాయమవుతుంది. అలాగే ముఖం పూర్తిగా శుభ్రంగా,  సహజంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.


                       *రూపశ్రీ.