చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొల్లాజెన్ డ్రింక్.. తాగితే మ్యాజిక్కే..!
మెరిసే, మృదువైన చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఎవరూ ఉండరు. ఇది ఎప్పటికీ యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది కాబట్టి చర్మం మెరుస్తూ, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా ఖరీదైన ఉత్పత్తులు, స్కిన్ ట్రీట్మెంట్ వైపు దృష్టి సారించేవారు ఎక్కువ. మరికొందరు మందులు కూడా వాడతారు. చర్మం యవ్వనంగా, మెరుస్తూ, మృదువుగా ఉండాలంటే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఆశించినంతగా ఉండాలి. కానీ 30 ఏళ్ల వయసు తర్వాత కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది.
కొల్లాజెన్ అంటే..
శరీరంలో కొల్లాజెన్ అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ . ఇది శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 30% ఉంటుంది. కొల్లాజెన్ శరీరం యొక్క చర్మం, కండరాలు, ఎముకలు, స్నాయువులు.. ఇతర బంధన కణజాలాలను తయారు చేయడంలో సహాయపడుతుంది.
ఇది శరీరంలోని అనేక భాగాలలో, రక్త నాళాలు, పేగు లైనింగ్ వంటి వాటిలో కూడా కనిపిస్తుంది. కొల్లాజెన్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. స్థితిస్థాపకతను పెంచుతుంది. కొల్లాజెన్ ను ఎలా పెంచాలో తెలుసుకుంటే..
కొల్లాజెన్ ఐస్ క్యూబ్స్..
కావలసిన పదార్థాలు..
దోసకాయలు
నానబెట్టిన చియా విత్తనాలు
బీట్‌రూట్ పౌడర్
పుదీనా ఆకులు
నిమ్మకాయ
కలబంద రసం
ఎలా తయారు చేయాలి?
ముందుగా మిక్సర్ తీసుకోవాలి. అందులో తరిగిన దోసకాయ వేసి, పైన పేర్కొన్న అన్ని ఇతర పదార్థాలను కలిపి, నీరు కలపాలి. అన్ని పదార్థాలను బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ద్రవాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి.
ఎలా ఉపయోగించాలి?
ఐస్ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత, ఒక గ్లాసు నీటిలో 3 క్యూబ్స్ కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. ఈ పానీయం తాగిన తర్వాత రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే చాలా యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది . ఈ ఐస్ క్యూబ్‌లను 10 నుండి 12 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఓపిక, పదార్థాలు అన్ని అందుబాటులో ఉంటే దీన్ని అప్పటికప్పుడు తాజాగా కూడా తయారుచేసుకుని తాగవచ్చు.
*రూపశ్రీ.
