స్టన్నింగ్ పార్టీ  వేర్ 

Stunning Party Wear


 రంగులలో నలుపుకు ఉన్న ప్రత్యేకతే వేరు. కొంతమంది ఈ రంగును ఆశుభంగా భావించినా, చాలా మంది పార్టీల్లో ఈ నలుపు రంగుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నలుపు అందాన్ని ఇనుమడింపజేయడమే కాదు, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అటువంటి నలుపు రంగులో ఉన్న పర్ఫెక్ట్ పార్టీ వేర్, అందునా అవి లాంగ్ గౌన్స్ అయితే చెప్పనక్కర్లేదు, ఆహ్లాదకరమైన ఆ సాయంత్రానికే కొత్త కళ వచ్చినట్టుగా ఉంటుంది. అందుకే ఆధునికతను కోరుకునే వారికి ప్రత్యేకం. ఈ తెలుగువన్ ఫ్యాషన్ బ్లాక్ గౌన్ కలెక్షన్, హావ్ ఏ లుక్...

 

Blush Floral Peacock One-Shoulder Gowns

అందమైన సాయంత్రానికే వన్నె తెచ్చేలా, లార్జ్ ఫ్లోరల్ ప్రింట్ తో పీకాక్ డిజైన్ తో క్లాస్ లుక్ ని ఇచ్చే వన్ షోల్డర్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్. 

 

Blush Floral Prom Gowns

         శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా ఉండి కంఫర్టబుల్ గా ఉండేలా డిజైన్ చేయబడ్డ స్ట్రాప్ లెస్ గౌన్.ఫ్లవర్స్ తో పాటు 3D లేస్ దీని ప్రత్యేక ఆకర్షణ.

 

Plaid Prom strap less Gown 

        స్టైలిష్ గా, ట్రెండీ గా ఉండి గౌన్ మొత్తం ఫ్యాషనబుల్ ప్రింట్ తో శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా, అద్భుతంగా డిజైన్ చేయబడ్డ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్, దీనితో పాటు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్,బ్లాక్ హై హీల్స్ వేస్తే చాలా బావుంటుంది.

 

Blush Strapless Prom Gowns 

     హై వేస్టేడ్ మరియు బోల్డ్ రైన్ స్టోన్ తో డిజైన్ చేయబడిన స్ట్రాప్ లేస్ గౌన్. మాడరన్ గా కనబడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అవుట్ ఫిట్.

 

 Sparkling One Shoulder Evening Gowns

గౌన్ మొత్తం స్క్వేర్ సెక్విన్ తో డిజైన్ చేయబడ్డ వన్ షోల్డర్ అవుట్ ఫిట్. బ్లాక్ తో పాటు గ్రే కలర్ కాంబినేషన్ దీని ప్రత్యేక ఆకర్షణ.