ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం!

ప్రస్తుత కాలంలో 30 నుండి 40 ఏళ్ళ మహిళల్లో ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఎండోమెట్రియోసిస్. గర్భాశయం (ఎండోమెట్రియం) లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భాశయం వెలుపల అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు, పెల్విస్‌లోని ఇతర భాగాలలో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది.  ఎండోమెట్రియోసిస్ కటి నొప్పి, నెలసరి ఎక్కువరోజులు కొనసాగడం, పిల్లలు కలగడంలో ఇబ్బంది వంటి అనేక లక్షణాలకు దారి తీస్తుంది.

ఈ సమస్య ఎన్నో శారీరక, మానసిక సమస్యలు సృష్టించి, మహిళల లైఫ్ స్టైల్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది పునరుత్పత్తి, లైంగిక, వృత్తిపరమైన, సామాజిక పనితీరులను ప్రభావితం చేస్తుంది. మొదట్లోనే ఈ సమస్య గురించి తెలుసుకుంటే.. దీన్ని గుర్తిస్తే.. దీన్ని అధిగమించడం సులువు అవుతుంది. 

ఎండోమెట్రియోసిస్ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉంటే కణజాల పెరుగుదల, వాపుకు దారితీయవచ్చు, ఇది పరిస్థితిని మరింత బాధాకరంగా మారుస్తుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎండోమెట్రియోసిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎండోమెట్రియోసిస్‌ ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారాలు ఏమిటంటే..

పసుపు

పసుపులో ప్రధాన క్రియాశీల పదార్ధమైన కర్కుమిన్, ఎస్ట్రాడియోల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఎండోమెట్రియోసిస్‌ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది., అలాగే కర్కుమిన్ గర్భాశయం యొక్క లైనింగ్ కణజాల వ్యాప్తిని అణిచివేస్తుంది.

 వీట్ గ్రాస్

వీట్ గ్రాస్ అత్యంత ఆల్కలీన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఒకటి. క్లోరోఫిల్ సమృద్ధిగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, వాపును తగ్గించడానికి, ప్రో-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల కార్యకలాపాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ క్లోరోఫిల్ వీట్ గ్రాస్ లో లభ్యమవుతుంది.

 మునగ ఆకు..

మునగ ఆకు రసంలో మొరింగ ఒలిఫెరా ఉంటుంది. ఇది ఆండ్రోజెన్ గ్రాహకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎండోమెట్రియం యొక్క మందాన్ని కూడా తగ్గిస్తుంది.

అశ్వగంధ

ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి అనుబంధంగా అశ్వగంధ ఉపయోగిస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది.  

శతావరి

శాతవరి ఎండోమెట్రియోసిస్ సంశ్లేషణలను తగ్గించడంలో సహాయపడే మాక్రోఫేజ్‌ల ఫాగోసైటిక్ చర్యను పెంచుతుంది.

ఎండోమెట్రియోసిస్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి చిట్కాలు:

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలిని నిర్వహించడం వలన నెలసరిలో తిమ్మిరి, ఉబ్బరం తగ్గించవచ్చు, ఇవి ఎండోమెట్రియోసిస్ సాధారణ లక్షణాలు.

ఒత్తిడి ఎండోమెట్రియోసిస్ లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది, కాబట్టి దానిని నియంత్రించడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటి రిలాక్సేషన్ పద్ధతులు సహాయపడతాయి.

ఎండోమెట్రియోసిస్ లక్షణాలను తగ్గించడంలో హార్మోన్ థెరపీ సహాయపడుతుంది. దీనివల్ల ఋతుచక్రాన్ని నియంత్రించవచ్చు.

ఆక్యుపంక్చర్ లేదా హెర్బల్ రెమెడీస్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు ఎండోమెట్రియోసిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్యలో గైనకాలజిస్ట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం.

                                    ◆నిశ్శబ్ద.