బరువు పెరుగుతున్నామని భయం వద్దు.. ఇలా చేస్తే చాలు!

మనం భోజనం చేయడం సహజం. అయితే చాలా మంది మహిళలు తిన్న కొద్ది సేపటికే ఆకలి అంటూ ఉంటారు. ఇలా  అనిపించడం సర్వసాధారణం, కానీ అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల  ఆరోగ్యానికి హాని కలుగుతుంది.  శరీరం  ఆకలి సంకేతాలను వినడం ముఖ్యం అయినప్పటికీ,   సరైన ఆహారాన్ని ఎంచుకోవడం  చాలా అవసరం. అనారోగ్యకరమైన తిండిని నివారించడానికి,  మంచి ఆహారం  ఎంపిక చేసుకోోడానికి గందరగోళ పడుతున్నట్టైతే  ఈ చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వండి..

 ఆహారం ట్రాక్‌లో ఉండేలా చేసుకోవడం ఇలా....

ముందుగా ప్లాన్ చేసుకోవాలి..

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపికంచేసుకోవాలి. లేకుపితే చాలా ఈజీగా  దగ్గరలో ఉన్న జంక్ ఫుడ్ వైపుకు వెళ్ళిపోతారు. తీసుకునే ఏ ఆహారం అయినా స్నాక్స్ తో సహా ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల  ఎప్పుడూ పోషకమైన ఆహారం మీరు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. తాజా పండ్లు కూరగాయలను తీసుకోవాలి. ఎనర్జీ బార్ లు స్నాక్ లో చేర్చుకోవాలి.  ఆకలితో ఉన్నప్పుడు ఇవి మంచి ఆప్షన్. ఆరోగ్యం కూడా.. 

 ఇంటి ఆహారమే.. మహాభాగ్యం..

బయట కొన్న ఆహారంలో జోడించిన చక్కెర, అనారోగ్య కొవ్వులతో నిండి ఉంటాయి. అందుకే, పూర్తి పోషక పదార్ధాలను ఉపయోగించి ఇంట్లో స్వంతగా తయారు చేయడానికి ప్రయత్నించాలి. 

హైడ్రేటెడ్ గా ఉండాలి..

ఎవ్వరికీ ఎక్కువగా తెలియని షాకింగ్ నిజం ఏమిటంటే.. శరీరంలో తేమ శాతం తక్కువైతే చాలా మందికి దాన్ని ఆకలి అనుకుంటారు. చాలాసార్లు ఆకలి అనిపించి ఆహారం తీసుకున్నా తృప్తి కలగకపోవడానికి కారణం ఇదే.. నదుకే నీటిని సరిపడినంత తీసుకోవాలి.  ఆకలి అనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి ఆ తరువాత కూడా అదే విధంగా ఆకలి అనిపిస్తే అపుడు ఆహారం తినాలి.

అల్పాహారం చేసేటప్పుడు జాగ్రత్త 

మైండ్‌ఫుల్ ఈటింగ్.. ఫాలో అవ్వాలి. అంటే మీరు తినే వాటిపై శ్రద్ధ చూపడం ప్రతి బైట్ ను  ఆస్వాదించడం. అల్పాహారం చేసేటప్పుడు, టీవీ, మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియా చూడటం వంటివి నివారించండి. ఆహారం రుచి, అందులో పదార్థాలు దాని వాసన ఇలాంటివి అనుభూతి చెందుతూ తింటే చాలా తొందరగా తృప్తి చెందిన ఫీల్ కలుగుతుంది. 

ఆప్షన్స్ కూడా..

ఆహారం తీసుకునేటప్పుడు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి,  ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ స్పైక్‌లు, క్రాష్‌లకు కారణమయ్యే అవకాశం తక్కువ.

వీటిని ఫాలో అయితే మహిళల్లో బరువు పెరగడం అనే సమస్య ఉండదు..


                                               ◆నిశ్శబ్ద.