శీతాకాలంలో చర్మాన్ని రక్షించే టోనర్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేస్కోండి!


 శీతాకాలం చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుంది.  కొన్ని సందర్బాలలో ఇది చర్మాన్ని ఎర్రగా మార్చి చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా చర్మం నుండి కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. ఇవన్నీ జరగకూడదు అంటే చర్మం ఎప్పుడూ  హైడ్రేటెడ్‌గా  తాజాగా ఉండాలి. ఇందుకోసం  టోనర్‌ను ఉపయోగించడం చాలా అవసరం. మార్కెట్లో లభించే టోనర్లు చర్మాన్ని హాని చేసే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి అలర్జీ,  ఇరిటేషన్ కలిగిస్తాయి.   అందుకే ఇంట్లో తయారుచేసిన టోనర్  చాలా మంచిది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టోనర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..  

టోనర్ చేసే మ్యాజిక్..

టోనర్ చర్మంలో ఉండే  సహజ నూనెలను సమతుల్యం చేస్తుంది. చర్మానికి  గ్లో ఇస్తుంది.    మృదుత్వాన్ని పెంచుతుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది, పొడి చర్మాన్ని తగ్గించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది.  ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవడం వల్ల కెమికల్ ఫ్రీ ఉత్పత్తి చర్మానికి వాడినట్టే.  దీని వల్ల చర్మం ఆరోగ్యంగా  ఉంటుంది.

రోజ్ వాటర్, దోసకాయ టోనర్..

శీతాకాలంలో  ముఖాన్ని వెంటనే చల్లబరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి రోజ్ వాటర్, దోసకాయ టోనర్ బెస్ట్ సొల్యూషన్. దోసకాయ సహజంగా హైడ్రేటింగ్ కలిగి ఉంటుంది, చర్మపు మంటను తగ్గిస్తుంది.

తయారు చేసే విధానం..

దోసకాయను తురుమి దాని రసాన్ని తీయాలి.

దోసకాయ రసానికి సమాన మొత్తం రోజ్ వాటర్.

ఈ రెండింటి కలిపి ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని ప్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు.  ఇదిచర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ టోనర్..

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో డల్ గా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి, చర్మానికి  శక్తినిస్తాయి.

తయారు విధానం..

గ్రీన్ టీని మరిగించి పూర్తిగా చల్లబరచాలి. దానిని స్ప్రే బాటిల్‌లో పోయాలి. ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మం వెంటనే   రిఫ్రెష్ అవుతుంది. చర్మ  రంధ్రాలు బిగుతుగా మారుతాయి. ఇది జిడ్డుగల,  డల్ గా  ఉన్న  చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

అలోవెరా టోనర్..

పొడి చర్మం, చాలా  రఫ్ గా ఉన్న చర్మానికి అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ తో చేసే టోనర్ కూడా అదేవిధంగా సహాయపడుతుంది.

తయారు విధానం..

రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను అర కప్పు నీటిలో వేసి  బాగా కలపాలి.  తేలికగా, చర్మాన్ని  హైడ్రేట్ చేసే టోనర్ ఇది.  ఈ  టోనర్ చర్మపు చికాకు, ఎరుపును తగ్గించడమే కాకుండా చర్మం మీద  పొలుసులను తగ్గిస్తుంది. దీన్ని  అప్లై చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా మారుతుంది. అలాగే  చల్లగా ఉంటుంది.

లెమన్ వాటర్ టోనర్..

శీతాకాలంలో చాలా సార్లు ముఖ చర్మానికి ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇందుకోసం లెమన్ వాటర్ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది.

తయారు విధానం..

ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ టోనర్ రంధ్రాల నుండి మురికిని శుభ్రపరుస్తుంది. నూనెను నియంత్రిస్తుంది.  ముఖానికి క్లియర్  రూపాన్ని ఇస్తుంది. చాలా పొడి చర్మం ఉన్నవారు దీనిని తక్కువ పరిమాణంలో ఉపయోగించడం బెటర్.

పైన చెప్పుకున్న టోనర్ లు  చాలా సహజంగా, తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.  వీటిలో రసాయనాలు లేకపోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుటుంది.  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

                               *రూపశ్రీ.