సీతాకోకచిలుక ఆసనం.. మహిళల చింతలన్నీ మాయం!

యోగాలో ఆసనాలు బోలెడు. ఈ ఆసనాలు కూడా మహిళలకంటూ కొన్ని ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. వీటిని వేయడం వల్ల మహిళ అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మహిళలకు పెళ్లి, ప్రసవం, ఆ తరువాత మెనోపాజ్ వంటి కారణాల వల్ల శరీరంలో చాలా అసౌకర్యాలు ఏర్పడతాయి. వాటిలో కొన్నింటికి సీతాకోక చిలుక ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

వెన్నునొప్పి..

చాలామంది మహిళలు వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనికి సీతాకోకచిలుక ఆసనం చక్కని పరిష్కారం.  ప్రతిరోజూ సీతాకోకచిలుక ఆసనం ఫాలో కావడం వల్ల వెన్ను నొప్పి ఈజీగా తగ్గుతుంది.

మానసిక ఒత్తిడి, తలనొప్పి..

మానసిక ఒత్తిడి, తలనొప్పి మహిళల జీవితంలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వారు అనారోగ్య సమస్యలు లెక్క చేయకుండా ఇంటి పనులలోనూ, భర్త  పిల్లలను చూసుకోవడంలోనూ మునిగిపోతారు. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి కాస్తా మానసిక సమస్యలుగా రూపాంతరం చెందుతాయి. పదే పదే తలనొప్పి కూడా వస్తుంది. అదే సీతాకోకచిలుక ఆసనం వేస్తే ఇవి తగ్గిపోతాయి.

నడుమునొప్పి..

ప్రసవం తరువాత, నెలసరి సమస్యలున్న మహిళలు చాలావరకు నడుము నొప్పితో ఇబ్బందులు పడుతుంటారు. సీతాకోకచిలుక ఆసనం ఈ నడుమునొప్పికి చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చేస్తే నడుమునొప్పి సమస్య తగ్గిపోతుంది.

బలం..

చాలామందికి హిప్స్ బలహీనంగా ఉంటాయి.  మరికొందరికి హిప్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. హిప్ ప్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.  సీతాకోకచిలుక ఆసనం వేస్తే హిప్స్ కు బలం చేకూరడంతో పాటు హిప్స్ ఫ్యాట్ తగ్గి మంచి ఆకృతిలోకి వస్తాయి.

సీతాకోకచిలుక ఆసనం..

యోగా మ్యాట్ లేదా దుప్పటి పరుచుకుని దాని మీద పద్మాసనంలో కూర్చోవాలి. కాళ్లు రెండూ పొడవుగా చాపి కాళ్లు దగ్గరగా చేసి కూర్చోవాలి.

ఇప్పుడు మోకాళ్లను మడుస్తూ కాలి పాదాలు రెండూ ముందుకి  తీసుకురావాలి.

రెండు కాళ్ల పాదాలు ఎదురెదురుగా కలుసుకుని ఉండాలి.

ఈ పొజిషన్ లో అలాగే ఉండి రెండు పాదాలను చేతులతో పట్టుకుని తొడల నుండి మోకాళ్లను పైకి కిందకు లేపుతూ సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్టు ఆడించాలి.

ఈ ఆసనాన్ని  రోజూ చేస్తుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ ఉంటాయి.

                                        *నిశ్శబ్ద.