అరటిపండుతో సౌందర్య సంరక్షణ

ముఖ సౌందర్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అరటిపండు ఓ మంచి టిప్ అని నిపుణులు చెబుతున్నారు . అరటిపండుతో సౌందర్య రక్షణ ఎలాగో చూద్దాం…

• బాగా మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి.. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

• పొడి చర్మం ఉన్న వారు అరటిపండు గుజ్జులో గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

• ముఖం మీద మచ్చలు ఉన్నట్లయితే... అరటి పండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ పావు గంట సేపు ఆరనివ్వాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోజు మొత్తం మీద వీలయినన్ని సార్లు ఈ విధంగా చేసినట్టయితే మచ్చలు మాయం అవుతాయి.

• పళ్ళు పసుపు పచ్చగా మారుతుంటే ఈ విధంగా చేసి చూడండి. అరటి తొక్కతో పళ్ళ మీద బాగా రుద్దాలి. రోజులో కనీసం రెండు సార్లు ఈ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

 

-వై.లిల్లీ నిర్మల శాంతి