పరువాల పాదాల కోసం


మనలో చాలా మంది అందం విషయంలో ముఖానికిచ్చే ప్రాధాన్యత పాదాలకి ఇవ్వరు. దాని పర్యవసానమే జీవం కోల్పోయిన పాదాలు వాటి వల్ల వచ్చే పగుళ్ళు. మొహం ఎంత అందంగా ఉన్నా పగుళ్లతో నిండిన పాదాలు చూసుకుంటుంటే మనకే బాధగా ఉంటుంది కదా. అందుకే వాటి మీద కూడా శ్రద్ధ  చూపించి పాడాలని కూడా మెరిసేలా చేద్దాం. సాదారణంగా రోజు కాళ్ళని బాగా కడిగి కొద్దిగా నూనే రాసుకుని పడుకునే వారి పాదాలు ఎంతో మృదువుగా కనిపిస్తాయి. ఇలానే ఇంకొన్ని చిట్కా వైధ్యాలతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన పని లేకుండానే పాడాలని సంరక్షించుకుందాం.

*  రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని దానిలో దూది ముంచి దానిని పాదాలకు రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కడిగెయ్యాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పాదాలు మృదువుగా మారిపోతాయి.

*  బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.

*  గోరువెచ్చని  నీటిలో  తేనే వేసి ఆ నీటిలో పాదాలని 20-30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగినా మంచి నిగారింపు వస్తుంది.

*  రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇంట్లో ఉండే వేసలైన్ ని పాదాలకి పట్టించి పడుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే మీ పాదాలలో వచ్చిన తేడాని మీరే గమనించవచ్చు.

*  పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి.

*  అరటిపండుని  గుజ్జులా చేసి దానిని పాదాలకి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగినా మెరిసే పాదాలు మీవి అవుతాయి.

* నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.

*  ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ఆ దూదిని గుండ్రటి ఆకారంలో తిప్పుతూ పాదాలని ఒక పది నిమిషాలు మసాజ్ చేసి సాక్స్ వేసుకుని ఒక అరగంట ఉంచి తర్వాత వేడి నీతితో కడిగినా  చాలు పదాలు మెరిసిపోతాయి.

చూసారా పాదాల సంరక్షణకి ఇంట్లోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో. మరి మొదలుపెడదామా ఏదో ఒక చిట్కాని.                                                                                                                                                                                                                    

....కళ్యాణి