Read more!

Wet Wipes and diaper rash

  Wet Wipes and diaper rash   As young mothers on the run the easiest way to clean your baby’s bottoms after removing the diaper is to use the convenient wet wipes. Simple fast and possible the  cleanest way to clean your baby’s little bottom. Now the resultant effect we are sure which every mother would have seen are the severe rashes that infect the child and sometimes also leading to fungal infection .Extremely painful which s/he cannot express and the crying can drive you mad at times. When this happens and the rash doesn't subside check out these few tips to help you tide through the problem. •  First and foremost remove diapers and avoid putting them for at least 3-4 days. •  Avoid wet wipes as some of them have minor content of chemical and alcohol which cause the skin to burn more. •  Use water directly and wash the baby or use a wash cloth dipped in warm water and clean. •  Avoid soap for some time. And try to keep the area open for some time. • To keep the area dry the best powder is to use cornstarch powder. Some of the branded baby powders have cornstarch in it. •  If you don’t have it mix some corn starch in baby powder and dust the baby bottoms with it •  Now tight clothes only loose cotton clothes and use a cloth nappy till s/he feels better. Unless its winter season. There are various creams available OTC and find the specific one suited to your baby ,but keeping the area dry is very important for quick healing. Try to find  wet wipes which don’t contain alcohol and are not too fragrant and use them.    

Teach your Child Gardening and see them grow

Teach your Child Gardening and see them grow     Gardening - a hobby which is usually pursued by elders can actually be a wonderful method to teach new skills to children. They can learn new skills, have fun, enjoy and develop self-confidence by spending time in the garden learning how to grow plants and watch them grow.  Apart from getting their hands dirty which they love to do they get the opportunity be outdoors and get the right amount of sunshine. Holistic approach to Gardening. According to the Waldorf and other Asian philosophies engaging children in playing in the sand and digging the soil to grow plants is extremely healing and also grounds the children to the mother earth. They learn to be at peace with themselves and their cognitive skills also improve. Benefits of Gardening for children 1. The best point is that they have fun and enjoy being out doors 2. There is a scientific learning where they learn about saplings and how plants grow 3. They learn to be responsible while caring for plants They learn to understand that plants need water, air and have to be tended to like little kids or else without either of these they die 4. They will learn about the different plants life and discover how they grow and their nutritional values 5. They learn to be more Self-confident when they see the sapling that they planted grows 6. They learn  to respect how  food to the table comes and how much time and effort it takes for fruits , vegetables and other plants take to grow 7. They will love to enjoy the beauty of nature  and 8. Finally they learn about teamwork and cooperation where they interact and share with other children while gardening as a group event.  

Children and Gadget addiction

Children and Gadget addiction   A question which many parents ask is “when can I start giving my child the I phone/pad/tab”? Especially with the trend now where new age parents give their little children the Smartphone or the I-pad and say “ Oh! My child already knows how to use the tab/phone” , “ he know where the widgets are I still have no clue as to where the others icons are” .You probably heard enough of those and these praises go on and on. At the end of the day we wonder if this is a strategy to keep the child quiet so that s/he doesn’t bother the parent .Weighing the pros and cons of giving these gadgets to the child at an early stage has been a point of debate ever since this gadget /gizmo phase started. Studies say that too much of usage of the touch screen can inhibit the motor skills of the child. Different muscles are used to type, point, click, and touch the screen that are actually suppose to control a pencil. So spending longtime on the User friendly gadget can actually hinder his/her growth. Secondly, the technology used changes the chemistry of the children's brains so that they end up not being able to concentrate for long periods. There are studies to say that it may be contributing to an increase in ADHD (attention deficiency), as the brain reacts in a different way when compared to the regular pen-pencil and paper activities. This kind of an interface is changing the way our children's brains operate. The parent –child interaction also is reduced which leads to other cognitive deficiencies and the way the child operates his brain as the years progress. The child can also develop a distance between him/herself and the parents which in the long run can lead to emotional confusion during adulthood. Ultimately we can’t stop the parent from not giving the Gadget but the least we can do is to cut down on the usage and limit the time spent on playing with the Ipad/phone or Tab and try to focus the Childs attention with hands on creative activities and develop and closer bond with the child.

పిల్లలకు అసలైన బహుమతి ‘ఆత్మవిశ్వాసం’

పిల్లలకు అసలైన బహుమతి ‘ఆత్మవిశ్వాసం’   పిల్లల్ని ఆనందపరచడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటాం. వారికి ఇష్టమైనవి, అవసరమైనవి వెతికిమరీ కొని తెస్తాం. అయితే ఇవన్నీ అప్పటికి మాత్రమే ఆనందాన్నిచ్చేవి. అలాకాక పిల్లలకి ఎప్పటికీ ఉపయోగపడే అతి అమూల్యమైన, విలువైన బహుమతి ఒకటి వుందట. అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలిగింది. అదీ, అతి చిన్నవయసు నుంచి తప్పకుండా ఇవ్వాల్సిందిట. ఆ అమూల్యమైన బహుమతి పేరే ‘కాన్ఫిడెన్స్’. ఎందుకంటే, తనమీద తనకి నమ్మకం కలిగిన ఈనాటి పిల్లలు రేపు పెరిగి పెద్దయ్యి అదే నమ్మకంతో జీవితంలో తాము కోరుకున్న విజయాలని సొంతం చేసుకుంటారు అంటున్నారు మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు. ‘పిల్లలు - వారిలో ఆత్మవిశ్వాసం’ అన్న విషయంపై అధ్యయనం చేపట్టిన వీరు... 200 మంది తల్లిదండ్రులని, పిల్లలని ప్రశ్నించారు. వారి జీవనశైలిని అధ్యయనం చేశారు. తల్లిదండ్రులకు వారు సూచనలు, సలహాలు ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకుంటారు. దాంతో అతి గారాబంగానే కాదు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళని అరచేతుల్లో పెట్టి కాచుకుంటారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నకొద్దీ ఆ పట్టు బిగుస్తుందే కాని విడిపోదు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు పిల్లలు ఎక్కడ చేజారిపోతారనే భయంతో ఎక్కువ కట్టడి కూడా చేస్తారు. తమ మాట విననప్పుడు విమర్శిస్తారు. ఇదంతా పిల్లల్ని పెంచడంలో భాగమే. వారి మంచికోరే తల్లిదండ్రులు చేసే పనులే. అయితే ఇదే మంచిది కాదు అంటున్నారు. నిపుణులు. ఎక్కడ పిల్లలు తప్పటడుగు వేస్తారోననే భయంతో వాళ్ళని అతిగా కట్టడి చేయడం, లేదా వాళ్ళ ప్రతి అడుగులో చేయందించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. పిల్లలకి తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాల్సిన అమూల్యమైన బహుమతి ‘ఆత్మవిశ్వాసం’. ఈ బహుమతి ఇవ్వాలంటే తల్లిదండ్రులు మొట్టమొదటగా చేయవలసింది ఏంటో తెలుసా? పిల్లల చేతివేలుని వదిలేసి వారంతట వారు నడిచేలా చేయడం. ఆ ప్రయత్నంలో పిల్లలు పడతారు, లేస్తారు. ఆ క్రమంలోనే సరైన నడక రీతిని తెలుసుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు చేసే ఈ పనినే జీవితానికి అన్వయించుకోమంటున్నారు నిపుణులు. పిల్లలని స్వంతగా ఆలోచించనివ్వాలి. స్వంతగా వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించాలి. దానితోపాటు ఏ పనైనా స్వంతగా చేయడానికి ప్రయత్నించనివ్వాలి. వీటన్నిటిలో పిల్లలు మొదటిసారే సక్రమంగా చేయలేరు. అయినా వదిలేయాలి. ఆ పొరపాట్ల నుంచే పిల్లలు నేర్చుకుంటారు... ఎదుగుతారు అని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులుగా పిల్లల మంచిచెడ్డలు అన్నిటిని దగ్గరుండి చూసుకోవాలన్న తాపత్రయం వారిని ఎదగనివ్వకుండా చేస్తోందేమో ఒక్కసారి చూసుకోండి అంటున్నారు నిపుణులు. కష్టంగా అనిపించినా నిజమదే. ప్రతి క్షణం పిల్లలు ప్రతి విషయానికీ తల్లిదండ్రుల మీద ఆధారపడటం వారికి ముచ్చటగా అనిపించినా, పిల్లలకి స్వంత వ్యక్తిత్వం అన్నది లేకుండా చేస్తుంది కాబట్టి ఏ వయసు పిల్లలైనా వారి ఆలోచనలకి, వారి ప్రయత్నాలకి అవకాశం ఇవ్వాలిట. మూడేళ్ళ పిల్లాడు కూడా అమ్మ ఏది వద్దందో అది చేయడానికే ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ‘‘నే చెప్పాను కదా వద్దు’’ అని ఖచ్చితంగా చెప్పడం కన్నా ‘‘ఎందుకు’’ అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం మంచిదని అంటున్నారు వీరు. ఆ ‘‘ఎందుకు’’ అన్న ప్రశ్న తల్లిదండ్రులని ఛాలెంజ్ చేస్తున్నట్టు, వారిని ఎదిరిస్తున్నట్టు అనుకుంటారు చాలామంది. కానీ ఆ ప్రశ్న వారిలో ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, తెలుసుకోవాలన్న ఆసక్తికి ఉదాహరణగా తీసుకోవాలిట. చిన్నప్పుడు పడ్డ పునాదిపైన పిల్లల వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళని పట్టు విడుపులతో పెంచితే వారిలో ఏదైనా ప్రయత్నించడానికి వెనకాడని ధైర్యం కలుగుతుంది. అలాగే ఏ పనైనా చేయడానికి ప్రయత్నిస్తే అందులోని సులువుని తెలుసుకోవచ్చన్న విషయం అర్థమవుతుంది. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్. వాటినుంచి వాళ్ళెన్నో నేర్చుకుంటారు. పెద్దలుగా వారు ప్రమాదపుటంచులకు వెళ్ళకుండా చూడటం మాత్రమే తల్లిదండ్రుల పని. వారి తప్పులను ఎంచొద్దు. ఆ తప్పులను ఎత్తి చూపించొద్దు. నీవల్ల కాదంటూ అన్నిట్లో వారికి సాయపడొద్దు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. పిల్లలు ఒకోసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోంచే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వాళ్లకిచ్చే అమూల్యమైన బహుమతి. -రమ ఇరగవరపు

ఫాంటసీ ప్లే మంచిదే!

ఫాంటసీ ప్లే మంచిదే!   పగటికలలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతూ వుంటారు. అంటే, ఊహలలో విహరించడం. నిజ జీవితంలో చేయలేమనుకునే పనులని ఊహలలో నిజం చేసుకోవడం. ఈ పద్ధతి వల్ల టెన్షన్ తగ్గి కొంత మానసిక సంతృప్తి, విశ్రాంతి కూడా లభిస్తాయని అంటున్నారు నిపుణులు. ఇది పెద్దలకే కాదు... పిల్లలకీ వర్తిస్తుంది. అయితే వారికి తెలిసి చేసే పని కాదు. తెలియకుండానే వారి మనసులలోని భయాలనో, అసహనాన్నో, అయిష్టాన్నో, ఇష్టాన్నో వారి ఊహాజనితత ఆటల ద్వారా బయటపెడుతుంటారు. పిల్లల ఆటపాటల్ని దగ్గరగా గమనించే తల్లిదండ్రులందరికీ ఇది అనుభవమే. పిల్లలు టీచర్ ఆట, అమ్మ ఆట, డాక్టర్ ఆట అంటూ రకరకాల పాత్రాలను పోషిస్తూ, ఆ పాత్రల్లా ప్రవర్తిస్తూ ఆడుతూవుంటారు. అలాగే సూపర్ మేన్, హనుమాన్ అంటూ తమని తాము అతి బలవంతులుగా ఊహించుకుంటూ విన్యాసాలు చేస్తూ వుంటారు. అయితే, ఇవన్నీ పిల్లల ఆటలేనని కొట్టిపారేయడానికి  లేదు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు.   నిజానికి సూపర్ మేన్, హనుమాన్ వంటి ధీరోదాత్త పాత్రలని అభియనించే పిల్లలు అతి పిరికితనం కలిగి వున్నవారో, అలాగే బిడియస్తులో కావచ్చు. వారిలోని ఆ లక్షణాలని జయించడానికి వారికి తెలియకుండా వారు చేసే ప్రయత్నమే ఆ ఆటలు. వారు పదేపదే నేను ఇలా చేస్తాను.. అలా చేస్తాను అని చెబుతుంటే ఆ విషయంపై పిల్లలు ఎక్కువ వత్తిడికి గురవుతున్నారని గ్రహించాలని అంటున్నారు నిపుణులు. చీకటంటే భయపడే ఓ కుర్రాడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి ఒక్కడే వెళ్ళలేని వాడు వాడి ఆటలలో భాగంగా ‘‘నేను విమానమెక్కి దూరంగా వున్న కొండపైకి వెళ్తున్నాను. రాక్షసుడు వస్తే ఫైట్ చేసి పడేస్తాను’’ అంటాడు. అంటే మనసు మూలలలో వాడిలోని భయాన్ని జయించడానికి వాడు పెద్ద ప్రయత్నమే  చేస్తున్నాడు. అది ఈ విధంగా వాడి ఆటలో బయటపడుతోంది అని అర్థం. టీచర్ ఆట ఆడుతూ పిల్లల్ని కొట్టడం, అమ్మ ఆట ఆడుతూ అందర్నీ విసుక్కోవడం వంటివి ఆ పాత్రలోని నిజమైన వ్యక్తుల ప్రవర్తన పట్ల పిల్లల మనసులో వున్న వ్యతిరేకతనితెలియపరుస్తాయి. ‘ఫాంటసీ ప్లే’ అని పిలవబడే ఈ ఊహాజనిత ఆటలు కేవలం పిల్లల మానసిక బలహీనలతనే కాదు. వారిలో గాఢంగా దాగున్న ఆశలు, వారి బలాలని కూడా బయటపెడతాయి.   ‘‘నేను పెద్దయ్యాక డ్రైవర్ని అవుతా’’ అని ఓ పిల్లాడు అన్నాడనుకోండి. ఆ తల్లిదండ్రులు వెంటనే ‘‘నోర్ముయ్’’, ‘‘పిచ్చివాగుడు’’ ఏ డాక్టరో అవుతానని అనక అని అరిచి పిల్లాడి నోరు మూసేస్తారు. కానీ, అది చాలా పెద్ద పొరపాటు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు. ఎందుకంటే ‘‘డ్రైవర్’’ అవుతాననో, ఇంకేదో పిల్లాడు చెబుతుంటే, అది వాడి ఇష్టం అని గ్రహించాలి. నిజానికి ఆ ఇష్టాలు రోజుకొకటి చొప్పున మారుతుంటాయి కూడా. అయినా వాటిలో చిన్నప్పుడు వాడు తెలిసీ తెలియక వ్యక్తం చేసిన ఓ విషయంపై ఇష్టం వాడి మనసులో పెరిగి పెద్దదయ్యే నిజమైన సందర్భాలూ వుంటాయి. ఏ పైలెట్టో అవ్వొచ్చు డ్రైవర్ అవుతానన్న కుర్రాడు. నిజానికి చిన్నతనంలో పిల్లలు ఆడుకునే ఆటలన్నీ వారి ఊహాజ్ఞానాన్ని వృద్ధిపరిచేవే. ఎక్కడో విన్న ఓ కథకు మరిన్ని మార్పులు, చేర్పులు చేసి పిల్లలు ఆటలాడటం మనకి తెలిసిందే. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఊహాపరిజ్ఞానాన్ని బయటపెడుతుంది. ఇది ఒకవిధంగా వారి మానసికాభివృద్ధికి సహాయపడే ఓ ప్రక్రియ. ఇది గ్రహించకుండా తమ కల్పనాశక్తిని వ్యక్తం చేస్తున్న పిల్లలు ఆడుకునే ఆటలను పెద్దవాళ్ళు నిరుత్సాహపరచకూడదు. వీలయితే పెద్దలూ అందులో చేరి  వాటిని ప్రోత్సహించాలి. లేదా చూసీ చూడనట్టు వదిలేయాలి. అంతేకాని పొంగుతున్న పాలమీద చన్నీరు పోసినట్టుగా వారి ఉత్సాహాన్ని నీరుగార్చకూడదు. అలా చేస్తే పిల్లలలోని కల్పనాశక్తి అడుగంటిపోయే ప్రమాదం వుంది. వారి ఆలోచనలు, భావాలు పదును తేలవు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సహజంగా పిల్లలు ఆడుకునే ‘‘ఫాంటసీ ప్లే’’ని ప్రయత్నపూర్వకంగా వారితో ఆడించే ప్రయత్నం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. అంటే. ‘‘నువ్వు నీకు నచ్చిన పాత్ర చేసి చూపించు’’ అని అడగటం, నువ్వే హీరోవి అయితే ఏం చేస్తావ్ అని అడిగి వారి మనసులోని మాటలు పైకి చెప్పించడం, వారు విన్న కథలలోని పాత్రలని అనుకరించమని ప్రోత్సహించడం వంటివి పిల్లల ఊహాశక్తికి పనిచెబుతాయి. అంతేకాదు, పిల్లల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అంటున్నారు నిపుణులు. మరి ఆలోచిస్తారు కదూ!