ముఖ ఆకృతికి తగ్గట్టు సన్ గ్లాసెస్ ఇలా ఎంచుకుంటే అధిరిపోతారు

 

నేటికాలంలో కళ్లకు రక్షణగానే కాకుండా ఫ్యాషన్ లో బాగంగా చాలామంది అమ్మాయిలు సన్ గ్లాసెస్ ధరిస్తారు. అయితే ఫ్యాషన్ గా కనిపించాలంటే మాత్రం ఏదో ఒక సన్ గ్లాసెస్ పెట్టుకుంటే సరిపోదు. ముఖానికి తగినట్టు సన్ గ్లాసెస్ ఎంచుకోవాలి. చాలావరకు అమ్మాయిలు కేవలం ట్రెండ్‌లను బట్టి సన్‌గ్లాసెస్ కొంటారు. తర్వాత అవి తమ ముఖానికి బాగుండవని తెలిశాక నిట్టూరుస్తారు. ఇలాంటి సన్ గ్లాసెస్ అమ్మాయిల  రూపాన్ని , వ్యక్తిత్వాన్ని రెండింటినీ పాడుచేస్తాయి. సన్ గ్లాసెస్  కొనేటప్పుడు, ఫ్రేమ్‌లు  ముఖానికి సరిపోతాయో లేదో చూసుకోవాలి.   ముఖ ఆకృతికి సరైన ఫ్రేమ్‌లను ఎంచుకోకపోతే సన్ గ్లాసెస్ అంత ఆకర్షణ లుక్ ను ఇవ్వవు. ఏ ముఖానికి ఏ సన్‌గ్లాసెస్  స్టైలిష్‌గా , పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుంటే..

గుండ్రటి ముఖం..

 ముఖం గుండ్రంగా ఉంటే, చాలా లక్కీ పర్సన్స్ అనుకోవచ్చు.  ఎందుకంటే ఈ ముఖ ఆకృతికి దాదాపు అన్ని రకాల ఫ్రేమ్‌లు బాగుంటాయి. వేఫేరర్, గుండ్రటి, పెద్ద సైజు, చతురస్రాకార , ఏవియేటర్ వంటి దాదాపు అన్ని సన్ గ్లాసెస్  ముఖానికి ఈజీగా  సరిపోతాయి.  ముఖానికి తగ్గట్టు ఫ్రేమ్ మరీ పెద్దదిగా లేదా మరీ చిన్నదిగా లేదని చూసుకుంటే సరిపోతుంది.


గుండ్రని ముఖంలో బుగ్గలు నిండుగా ఉంటాయి , ముఖం  వెడల్పు, పొడవు దాదాపు సమానంగా ఉంటాయి.  అలాంటి ముఖాలకు  చతురస్ర, దీర్ఘచతురస్ర , వేఫేరర్ వంటి యాంగిల్  ఫ్రేమ్‌లు ముఖాన్ని పొడవుగా , పదునుగా కనిపించేలా చేస్తాయి.
మరీ గుండ్రంగా ఉండే ఫ్రేమ్‌లను ధరించడం వల్ల  ముఖం మరింత గుండ్రంగా కనిపించవచ్చు.

చతురస్రాకార ముఖం..

చతురస్రాకార ముఖంలో దవడ దృఢంగా, నుదురు విశాలంగా ఉంటుంది. అటువంటి ముఖాలపై, గుండ్రని, అండాకార, ఏవియేటర్ , క్యాట్ ఐ ఫ్రేమ్‌లు ముఖంలోని పదునైన రేఖలను సమతుల్యం చేస్తాయి. ఈ ఫ్రేములు ముఖాన్ని మరింత స్లిమ్ గా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

హార్ట్ షేప్ ముఖం..

గుండె ఆకారపు ముఖంలో నుదురు విశాలంగా, గడ్డం సాపేక్షంగా సన్నగా ఉంటుంది. అటువంటి ముఖాలకు ఏవియేటర్, గుండ్రని, బటర్‌ఫ్లై , తేలికపాటి ఫ్రేమ్ ఉన్న సన్ గ్లాసెస్ చాలా బాగుంటాయి.  ఇవి ముఖంలోని పై , కింది భాగాల మధ్య సమతుల్యతను కల్పిస్తాయి.  ఈ రకమైన సన్ గ్లాసెస్ మరింత సొగసుగా కనిపించేలా  చేస్తాయి.

డైమండ్ షేప్ ఫేస్..

డైమండ్ షేప్  ముఖంలో, బుగ్గ ఎముకలు మెయిన్ గా కనిపిస్తాయి.  అయితే నుదురు , గడ్డం సాపేక్షంగా సన్నగా ఉంటాయి. ఈ ముఖ ఆకృతికి క్యాట్ ఐ, ఓవల్ , రిమ్‌లెస్ ఫ్రేమ్‌లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇవి ముఖం యొక్క సహజ ఆకృతిని మెరుగుపరిచి, స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి.

                               *రూపశ్రీ.