సినిమాలకు గుడ్ బై.. రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం!
on Feb 5, 2022

'అర్జున్ రెడ్డి' సినిమాలో శివ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. 'గీత గోవిందం', 'బ్రోచేవారెవరురా', 'హుషారు', 'జాతిరత్నాలు' వంటి సినిమాలతో ఆకట్టుకున్న రాహుల్ ఇటీవల 'స్కైలాబ్' సినిమాలో సుబేదార్ రామారావుగా అలరించాడు. ఆయన నటించిన 'ఆర్ఆర్ఆర్', 'విరాట పర్వం' వంటి క్రేజీ ఫిల్మ్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో తాను సినిమాలు చేయడం మానేస్తున్నాను అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు రాహుల్.
తాను సినిమాల్లో నటించడం మానేస్తున్నాను అని తాజాగా రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత సినిమాలు చేయనని రాహుల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 31 ఏళ్ళ రాహుల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కూడా కాలేదు. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, వరుస ఆఫర్స్ వస్తున్నాయి, ఇలాంటి సమయంలో సినిమాలు మానేస్తున్నాను అంటూ రాహుల్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాహుల్ సినిమాలు మానేస్తున్నాను అంటూ ట్వీట్ చేయడం వెనక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండాలి. లేదా ఏదైనా ప్రమోషన్ కోసమే లేక ప్రాంక్ చేయడం కోసమో ఈ ట్వీట్ చేసుండాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



