రోడ్డు పక్కన దయనీయంగా కన్నుమూసిన తమిళ పాపులర్ డైరెక్టర్!
on Dec 8, 2021

తమిళ దర్శకుడు ఎం. త్యాగరాజన్ కన్నుమూశారు. ఈ విషాదంలో మరింత షాకింగ్ అనిపించే విషయం ఏమంటే, బుధవారం (డిసెంబర్ 8) చెన్నైలోని ఏవీయం స్టూడియో ఉన్న వీధి అవతలి వైపు ఆయన మృతి చెంది కనిపించారు. గతంలో ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురై, కోమాలోకి వెళ్లారు. విజయకాంత్ పోలీసాఫీసర్‌గా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మానగర కావల్' దర్శకుడిగా ఆయన పాపులర్ అయ్యారు. చాలా కాలంగా అనారోగ్యం, పేదరికంతో బాధపడుతున్న ఆయన ఏవీఎం స్టూడియో ఎదురుగా చనిపోయి ఉండటం కోలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also read: అనసూయ పుట్టింట విషాదం.. కేన్సర్‌తో తండ్రి మృతి
'మానగర కావల్'తో పాటు ప్రభు, సీత జంటగా నటించిన 'వెట్రి మేల్ వెట్రి' సినిమాని కూడా త్యాగరాజన్ రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు, ఆ సినిమాకి పనిచేసిన పలువురి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Also read: మనకాలం గొప్ప గేయరచయిత సీతారామశాస్త్రి అస్తమయం!
కాలక్రమంలో ఆయన సినిమాలు సరిగా ఆడకపోవడం, అవకాశాలు లేకపోవడంతో త్యాగరాజన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని సమాచారం. ఆఖరుకి అమ్మ క్యాంటిన్ భోజనంతో ఆయన పొట్టగడుపుకోవాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



