Home

»

Latest News

అన‌సూయ పుట్టింట విషాదం.. కేన్స‌ర్‌తో తండ్రి మృతి

Dec 05, 2021

 

పాపుల‌ర్ టీవీ యాంక‌ర్‌, సినీ న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టింట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి సుద‌ర్శ‌న్‌రావు ఖ‌స్బా ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో మ‌ర‌ణించారు. కొంత కాలంగా ఆయ‌న కేన్స‌ర్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌సు 63 సంవ‌త్స‌రాలు. తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కొద్ది నిముషాల్లోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సుద‌ర్శ‌న్‌రావు సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ వ‌స్తున్నారు.

Also read:  పాపుల‌ర్‌ క‌న్న‌డ న‌టుడు-ద‌ర్శ‌కుడు శివ‌రామ్ క‌న్నుమూత‌

సుద‌ర్శ‌న్‌రావు గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్ర‌ట‌రీగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌నకు భార్య‌, ముగ్గురు కుమార్తెలు.. అంబిక‌, సాయివైష్ణ‌వి, అన‌సూయ ఉన్నారు. సుద‌ర్శ‌న్‌రావు మృతికి ప‌లువురు సినీ, టీవీ సెల‌బ్రిటీలు, అన‌సూయ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com