Home

»

Latest News

మ‌ర‌ద‌లు అనుష్పాల పెళ్లిలో భార్య‌తో పాటు మెరిసిన‌ రామ్‌చ‌ర‌ణ్

Dec 08, 2021

 

ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పాల‌.. తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బుధ‌వారం సాయంత్రం అర్మాన్ ఇబ్రహీంను పెళ్లాడింది. అనుష్పాల, అర్మాన్‌ వివాహ వేడుక‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి. త‌మ‌ ఫ్యామిలీకి సంబంధించిన పెళ్లి వేడుకకు రామ్ చరణ్, ఉపాసన జోడీ మ‌రింత అందాన్ని తీసుకొచ్చింద‌ని ఫొటోల్లో వారు క‌నిపించిన తీరు తెలియ‌జేస్తోంది.

Also read:  పొర‌పాటున షాలిని మ‌ణిక‌ట్టుపై కోసిన అజిత్‌.. ఆ త‌ర్వాత మొద‌లైంది ల‌వ్ స్టోరీ!

ఈ పెళ్లిలో రామ్ చరణ్ ప్యాంటుతో కూడిన షేర్వాణి ధ‌రించి అందంగా క‌నిపించ‌గా, ఉపాసన భారీ అలంకర‌ణ‌ల‌తో షరారా సెట్ ధ‌రించి గార్జియ‌స్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. తన చెల్లెలి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన‌ ఉపాసన, "నిజంగా నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. చాలా చాలా కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరికి శుభాకాంక్షలు తెలిపినందుకు, ఆశీర్వాదాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ప్రేమతో నేను అమితానందంలో మునిగిపోయాను." అంటూ రాసుకొచ్చింది. Also read:  పూర్ణ హీరోయిన్‌గా ర‌విబాబు వ‌రుస‌గా మూడు సినిమాలు ఎందుకు చేశాడు?

శోభ‌న కామినేని, అనిల్ కామినేని దంప‌తుల చిన్న కుమార్తె అయిన అనుష్పాల‌.. ప్ర‌స్తుతం అపోలో గ్రూప్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమె ప్రేమించి పెళ్లాడిన అర్మాన్ ఇబ్ర‌హీం చెన్నైకి చెందిన ఒక కార్ రేస‌ర్‌. అత‌ను మాజీ ఇండియ‌న్ ఎఫ్‌3 చాంపియ‌న్ అయిన అక్బ‌ర్ ఇబ్ర‌హీం కుమారుడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com