శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్ బ్రదర్స్!
on Nov 29, 2021

కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ సోకి చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో కన్నుమూసిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో శివశంకర్ చిన్నకుమారుడు అజయ్ తండ్రి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాస్టర్ పార్థివదేహం ఉంచిన పాడెను పాపులర్ యాంకర్ ఓంకార్, అతని తమ్ముడు అశ్విన్‌బాబు మోశారు.
అంతకు ముందు శివశంకర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం పంచవటి కాలనీలో ఉన్న నివాసంలో ఉంచారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిస్టులు, డాన్సర్లు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. తుదిశ్వాస విడిచే సమయానికి ఆయన కొవిడ్ నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయనకు చికిత్స అందించిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
Also read: శివశంకర్ మాస్టర్ ఇకలేరు.. బలితీసుకున్న కరోనా!
శివశంకర్ 1978 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. సలీమ్ మాస్టర్ దగ్గర 1974లో అసిస్టెంట్‌గా చేరడం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివశంకర్, ఆ తర్వాత దేశంలోని పలు భాషా చిత్రాల్లోని పాటలకు నృత్యాలు సమకూర్చారు. 800కు పైగా చిత్రాలకు ఆయన పనిచేశారు. కొన్ని సినిమాల్లో నటుడిగానూ ఆయన కనిపించారు. రాజమౌళి సినిమా 'మగధీర'లో "ధీర ధీర" పాటకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 2011లో జాతీయ అవార్డును అందుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



