ENGLISH | TELUGU  

వెంకీ చేతుల మీదుగా 'లక్ష్య' ట్రైలర్!

on Nov 29, 2021

ఇటీవల 'వరుడు కావలెను' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నాగ శౌర్య.. డిసెంబర్ 10న 'లక్ష్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా డిసెంబర్ 1న 'లక్ష్య' ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో విజయోత్సాహంతో ఉన్న నాగ శౌర్య లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. బుధవారం విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందేమో చూడాలి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాళ భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.