ఇంకా ఐసీయూలోనే సీతారామశాస్త్రి
on Nov 30, 2021

ప్రఖ్యాత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఇటీవల కుటుంబసభ్యులు సికిందరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. కాగా సోమవారం ఆయన ఆరోగ్య స్థితిపై హాస్పిటల్ ఒక హెల్త్ బులెటిన్‌ను వెలువరించింది.
Also read: సీతారామశాస్త్రికి శ్వాస సమస్య.. ఐసీయూలో చికిత్స!
"ప్రస్తుతం సీతారామశాస్త్రిగారికి ఐసీయూలో నిపుణులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ అందిస్తుంటాం" అని అందులో పేర్కొన్నారు. సినీ సాహిత్యానికి సంబంధించి సేవలు అందించినందుకు గాను సీతారామశాస్త్రి ఇదివరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



