'అడవి తల్లి మాట'.. 'భీమ్లా నాయక్' అప్డేట్ వచ్చేసింది!
on Nov 30, 2021
.webp)
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో పవన్ నటిస్తుండగా, డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. ఇప్పుడు నాలుగో పాట విడుదలకు ముహూర్తం ఖరారైంది.
భీమ్లా నాయక్ నుంచి 'అడవి తల్లి మాట' అంటూ సాగే నాలుగో పాటను బుధవారం(డిసెంబర్ 1) ఉదయం 10:08 కి విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ తో ఉన్న పోస్టర్ లో పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, లల భీమ్లా, అంత ఇష్టం పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'అడవి తల్లి మాట' సాంగ్ కూడా ఆ స్థాయిలో మెప్పిస్తుందేమో చూడాలి.

అలాగే పోస్టర్ తో మరోసారి మూవీ విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇఛ్చారు. చెప్పినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ లో పేర్కొన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



