గబ్బర్ సింగ్ 2 కి డేట్ ఫిక్స్
on Oct 23, 2013
"నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది" అంటూ తన తిక్కతో "గబ్బర్ సింగ్" చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్టయ్యేలా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది."గబ్బర్ సింగ్" చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు డిసెంబర్ 2 న జరగనున్నట్లు తెలిసింది.
"అత్తారింటికి దారేది" వంటి ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత పవన్ చేయబోతున్న ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కథ, మాటలు, డైలాగ్స్ విషయంలో డైరెక్టర్ సంపత్ నందితో పాటుగా త్రివిక్రమ్ కూడా సహాయం చేస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు.