తారక్ తో పరశురామ్?
on Feb 5, 2022

ఆ మధ్య మాస్ మహారాజా రవితేజతో `ఆంజనేయులు`, `సారొచ్చారు` చిత్రాలు తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్.. దాదాపు పదేళ్ళ తరువాత మరో స్టార్ తో సినిమా చేస్తున్నారు. ఆ చిత్రమే.. `సర్కారు వారి పాట`. సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో పరశురామ్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వేసవి కానుకగా మే 12న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. మహేశ్ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో ఓ మూవీ చేయబోతున్న పరశురామ్.. ఆపై మళ్ళీ స్టార్స్ పైనే ఫోకస్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న పరశురామ్.. త్వరలో మరో నందమూరి స్టార్ తోనూ జట్టుకట్టే అవకాశముందంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. `శ్రీరస్తు శుభమస్తు`, `గీత గోవిందం` అనంతరం గీతా ఆర్ట్స్ లో పరశురామ్ మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. కాగా, ఈ మూవీని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మించే దిశగా గీతా ఆర్ట్స్ సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే తారక్ కి పరశురామ్ స్టోరీ లైన్ కూడా వినిపించారని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
Also Read: #NTR30 ముహూర్తం వాయిదా.. యాక్సిడెంటే కారణమా?
కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలు ఉన్నాయి. అలాగే బుచ్చిబాబు సానాతోనూ ఓ మూవీ చేయబోతున్నారు. మరోవైపు తారక్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న విడుదలకు సిద్ధమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



