#NTR30 ముహూర్తం వాయిదా.. యాక్సిడెంటే కారణమా?
on Feb 3, 2022

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమా ముహూర్తపు తేదీ వాయిదాపడినట్లు విశ్వసనీయ సమాచారం. కొరటాల శివ డైరెక్ట్ చేసే ఈ మూవీని ఈనెల 7న లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే తాజాగా ఈ పూజా కార్యక్రమాన్ని వాయిదావేశారు. ఇన్‌సైడర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తారక్‌కు పెద్ద దెబ్బలేమీ తగల్లేదు కానీ, ఆయన పక్కన ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గట్టి దెబ్బలు తగలాయనీ, బోన్ ఫ్రాక్చర్ అయ్యిందనీ అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలియలేదు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం ఊరట కలిగించే విషయం. అభిమానుల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉండటం వల్లే గతంలోనూ ఓ యాక్సిడెంట్ నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. Also read: 'పుష్ప' లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది.. గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
కాగా, నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందనేది వెల్లడి కాలేదు. సినిమా పూజా కార్యక్రమానికి ముందు ఇలా జరగడంతో సెంటిమెంట్‌గా భావించిన తారక్, ముహూర్తాన్ని వాయిదా వేయించినట్లు వినిపిస్తోంది. పూజా కార్యక్రమం జరిగే కొత్త తేదీ ఇంకా ఖరారు కాలేదు. 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తారక్, కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. ఈ మూవీలో తారక్ జోడీగా ఆలియా భట్ నటించే అవకాశాలున్నాయని వినిపిస్తోంది కానీ, అధికారికంగా ధ్రువపడలేదు. ఆ ఇద్దరూ ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటించినా, అది జంటగా కాదు. ఆ మూవీలో రామ్‌చరణ్ జోడీగా ఆలియా నటించింది. Also read: #SSMB28 లాంఛనంగా మొదలైంది
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్', కొరటాల శివ లేటెస్ట్ ఫిల్మ్ 'ఆచార్య' విడుదలకు రెడీ అవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



